S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/23/2018 - 23:26

ముంబయి, జూలై 23: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సెనె్సక్స్ సోమవారం రికార్డు స్థాయికి చేరింది. నిఫ్టీలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. పలు వస్తుసేవలపై జీఎన్‌టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. 30-షేర్ ఇండెక్స్ 222.23 పాయింట్లు (0.61 శాతం) పెరిగి, 36,718.60 రూపాయల వద్ద స్థిరపడింది.

07/23/2018 - 23:24

ముంబయి, జూలై 23: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ కుంభకోణంలో నిందితుడైన గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ ఛోక్సీ తనపై జారీ చేసిన రెండు నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలని కోరుతూ హవాలా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టును ఆశ్రయించాడు. భారత్‌కు వస్తే తనపై మూక దాడులు జరిగే అవకాశం ఉందని, జైల్లోనూ భద్రత ఉండదని, తన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని చోక్సీ తన పిటిషన్‌లో అనుమానాలు వ్యక్తం చేశాడు.

07/23/2018 - 23:22

న్యూఢిల్లీ, జూలై 23: దేశంతోపాటు విదేశాల్లో భారతీయులు దాచి ఉంచిన నల్లధనానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వివరాలను బహిర్గతం చేయడం పార్లమెంటు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలనైన ఒక పిటిషన్‌కు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

07/23/2018 - 16:49

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెనె్సక్స్ 56 పాయింట్ల లాభంతో 36,552 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,036 వద్ద ట్రేడ్ అవుతుంది.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 36,719కి చేరుకుంది. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 11,085 వద్ద స్థిరపడింది.

07/23/2018 - 02:04

న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో కదలికలతో పాటు రాజకీయ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

07/23/2018 - 02:01

న్యూఢిల్లీ, జూలై 22: వస్తు సేవా పన్ను అమలుకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో 191 వస్తువులను గరిష్ట శ్లాబ్ నుంచి తక్కువ శ్లాబ్ పరిధిలోకి తెచ్చారు. మరో 35 వస్తువులు మాత్రమే గరిష్ట శ్లాబ్‌లో ఉన్నాయి. వీటిల్లో ఏసీలు, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్లు, వంటపాత్రలు కడిగే మెషీన్లు, ఆటోమొబైల్స్ ఉన్నాయి.

07/23/2018 - 02:00

న్యూఢిల్లీ, జూలై 22: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్ సహా మొత్తం 291 లిస్టెడ్ కంపెనీలు 2020 ఏప్రిల్ ఒకటో తేదీనాటికి తమ బోర్డులలో ఒక నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌ను నియమించవలసి ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పనిసరి. అలాగే వీటిలో చాలా కంపెనీలు తమ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టులను వేరు చేయవలసి ఉంటుంది.

07/23/2018 - 01:59

న్యూఢిల్లీ, జూలై 22: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో శుద్ధి చేసిన ఘనరూపంలో ఉన్న ఉక్కు (్ఫనిష్‌డ్ స్టీల్) ఎగుమతులు 33.7 శాతం పడిపోయి, 1.351 మిలియన్ టన్నులకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో భారత్ 2.037 మిలియన్ టన్నుల ఫినిష్‌డ్ స్టీల్‌ను ఎగుమతి చేసిందని జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ) తన తాజా నివేదికలో వివరించింది.

07/23/2018 - 01:39

హైదరాబాద్, జూలై 22: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ నెలాఖరుకు రెండు రాష్ట్రాల విద్యుత్ డిస్కాంమ్‌లు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

07/23/2018 - 01:13

ఖమ్మం: కొత్త వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతోంది. తాము వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునేలా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది.

Pages