S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/11/2018 - 00:11

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో జూన్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 37.54 శాతం వృద్ధితో పెరిగాయి. సుమారు పదేళ్ల కాలంలో ఒక నెలలో అమ్మకాల వృద్ధి ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తరువాత వాహనాల ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్లు నిరుడు జూన్ నెలలో వాహనాల కొనుగోలును వాయిదా వేసుకోవడం కూడా ఇప్పుడు అమ్మకాల వృద్ధి రేటు బాగా పెరగడానికి దోహదపడింది.

07/11/2018 - 00:10

న్యూఢిల్లీ, జూలై 10: దీపక్ పరేఖ్ నేతృత్వంలోని ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన లిస్టయిన సంస్థల మార్కెట్ విలువ (ఎంక్యాప్) మంగళవారం రూ. పది లక్షల కోట్ల మైలురాయిని దాటింది. టాటా గ్రూప్ ఇప్పటికే ఈ ఘనతను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వాణిజ్య సంస్థగా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుతం నాలుగు లిస్టయిన అనుబంధ సంస్థలను కలిగి ఉంది.

07/11/2018 - 00:09

న్యూఢిల్లీ, జూలై 10: జాతీయ బ్యాంకు ఐడీబీఐలో 52 శాతం వాటా తీసుకోవాలన్న బీమా యాజమాన్యం ప్రతిపాదనలు జీవిత బీమా ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రీమియంల కింద రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ములు వాటాల కొనడాని ఉపయోగించడం అంటే ఖాతాదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఎల్‌ఐసీ క్లాస్-1 అధికారుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

07/11/2018 - 00:08

న్యూఢిల్లీ, జూలై 10: ఐడియా సెల్యులార్‌తో విలీనం తరువాత భారత మార్కెట్‌లో తమ సంస్థ గట్టి పోటీదారుగా నిలుస్తుందని బ్రిటన్‌కు చెందిన టెలికం దిగ్గజం వొడాఫోన్ మంగళవారం పేర్కొంది. రిలయన్స్ జియో కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత టెలికం రంగంలో టారిఫ్ వార్ మొదలయి, పలు సంస్థలు ఆర్థికంగా ఎడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

07/10/2018 - 02:58

తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన వెలకట్టలేని అతి విలువైన సంపదను హైటెక్ మ్యూజియంలో ప్రదర్శించడం ద్వారా వ్యాపార ధోరణికి పాల్పడలేమని, ఇందుకు తాము పూర్తిగా వ్యతిరేకమని ట్రావన్‌కోర్ రాయల్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆలయంలోని అతి విలువైన సంపదను బహిరంగంగా ప్రదర్శించాలన్న అంశంపై వస్తున్న ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని వారు తెలిపారు.

07/10/2018 - 01:43

నొయిడా (యూపీ), జూలై 9: రానున్న రోజుల్లో ఫోన్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలబడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా గత రెండేళ్లలో దేశంలో ఫోన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు 120కి పెరిగాయని ఆయన అన్నారు.

07/10/2018 - 01:17

కోల్‌కతా, జూలై 9: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సర్వీసు ట్యాక్స్ (జీఎస్‌టీ)లో సింగిల్ శ్లాబ్ రేటు ఉండాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వాదన హాస్యాస్పదమని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

07/10/2018 - 01:15

పటన్‌చెరు, జూలై 9: ప్రపంచ స్థాయి పారిశ్రామీకరణను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సరళీకృత విధానాలతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామన్నారు.

07/10/2018 - 01:09

ముంబయి, జూలై 9: జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఎంతో ప్రగతి కనిపించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 277 పాయింట్లు మెరుగుపడింది. గత ఐదు నెలల కాలంలో ఇదే అత్యంత పెరుగుదల కావడంతో వాణిజ్యవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం సెనె్సక్స్ 35,934.72 అత్యధిక పాయింట్లతో ముగిసింది.

07/10/2018 - 01:07

న్యూఢిల్లీ, జూలై 9: జి 20లో సభ్యత్వం ఉన్న భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ ఎగుమతి, దిగుమతులపై అధిక పన్నులు, డ్యూటీలు విధింపు లాంటి 39 వాణిజ్య ఆంక్షలు విధించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) వెల్లడించింది. గత ఏడు నెలల నుంచి మే వరకు ఈ దేశాలు ఇతరదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ పరంగా కూడా పలు నిబంధనలు విధించినట్టు తెలిపింది.

Pages