S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/16/2018 - 23:27

న్యూఢిల్లీ, జూలై 16: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక జోన్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం వీటి ఏర్పాటుకు సంబంధించి మరింత వెసులుబాటు కల్పించింది. హెచ్‌బిఎస్ ఫార్మా, డిఎల్‌ఎఫ్ ఇన్ఫో సహా మొత్తం 15 సెజ్ డెవలపర్లకు వీటి ఏర్పాటుకు సంబంధించి మరింత గడువును ఇస్తున్నట్టు ప్రకటించింది. వాణిజ్య వ్యవహారాల కార్యదర్శి రీటా టియోటియా సారథ్యంలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

07/16/2018 - 23:24

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఆహారధాన్యాల నిలువకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కొత్తగా లక్షా, 15వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సొంత నిధులతో నిర్మించాలని సోమవారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పాలకవర్గ సమావేశం నిర్ణయించింది.

07/16/2018 - 23:23

దొనకొండ, జూలై 16: బ్రిటీష్ కాలంలో నిర్మించిన దొనకొండ విమానాశ్రయం మళ్లీ వినియోగానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ అథారిటీ జనరల్ అసిస్టెంటు మేనేజర్ సురేష్ సోమవారం ప్రకాశం జిల్లా దొనకొండ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి సర్వే పూర్తిచేశారు.

07/16/2018 - 23:21

న్యూఢిల్లీ, జూలై 16: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాపార అనుకూల విధానాల ప్రభావం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, అలాగే వ్యాపార, వాణిజ్య పరంగా భారీ ఎత్తున లావాదేవీలు జరగడానికి దోహదం చేస్తోందని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది.

07/16/2018 - 03:58

భీమవరం: దేశ ఆక్వా ఎగుమతుల్లో సింహభాగం ఆక్రమిస్తున్న ఆంధ్రా రొయ్యలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనితో రొయ్య పరిశ్రమకు గడ్డకాలం ఏర్పడింది. ఇప్పటికే సుమారు 22 దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న ఆక్వా ఉత్పత్తులకు అమెరికా నిర్ణయం ఆశనిపాతం వంటిదే. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జరిపే ప్రత్యేక పరీక్షల్లో ఆంధ్రా రొయ్యలు ఆరోగ్యం అని తేలితేనే ఆమెరికా మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది.

07/16/2018 - 02:26

న్యూఢిల్లీ, జూలై 15: హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్ర బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల గమనం, సానుకూల ప్రపంచ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. ‘కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలపై మదుపరుల దృష్టి కేంద్రీకరణ కొనసాగుతుంది.

07/16/2018 - 02:25

పనాజి, జూలై 15: కొత్త టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడవని, కొత్తవి సృష్టించబడతాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ అన్నారు. ఉద్యోగాలు పోతున్నాయన్న అంశంపై తాను ఈ లాజిక్‌ను మాట్లాడటం లేదని, వాస్తవానికి కొత్త టెక్నాలజీ వచ్చి ఒక ఉద్యోగంపోతే అదనంగా 20 జాబ్‌లు వస్తాయని ఆయన చెప్పారు.

07/16/2018 - 02:23

న్యూఢిల్లీ, జూలై 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 25 శాతం పడిపోయి, 8.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అటు ప్రపంచ మార్కెట్‌లో, ఇటు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడం వల్లనే దిగుమతులు తగ్గాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 11.26 బిలియన్ డాలర్లు.

07/16/2018 - 02:22

న్యూఢిల్లీ, జూలై 15: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో సేవల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) రాక సుమారు 23 శాతం తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసి అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఈ విషయం వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ సేవల రంగం 8.68 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది.

07/15/2018 - 02:50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వరుసగా మూడో రోజు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ధరల పట్టిక ప్రకారం ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 76.95కు, ముంబయిలో రూ. 84.33కు పెరిగింది. కోల్‌కతా, చెన్నైలలో లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ. 79.61, రూ. 79.87కు పెరిగింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 68.61కు పెరిగింది.

Pages