S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/04/2017 - 00:25

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఆటో స్వదేశీ అమ్మకాలు గత నెలలో నిరుడుతో పోల్చితే 7 శాతం పడిపోయాయి. ఈ జూలైలో 3,07,727 యూనిట్ల అమ్మకాలు జరిగితే, పోయినసారి జూలైలో 3,29,833 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కాగా, మోటార్‌సైకిల్ విక్రయాలు 7 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 4 శాతం తగ్గగా, ఎగుమతులు కూడా 8 శాతం క్షీణించాయి.

08/04/2017 - 00:24

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఈ ఏప్రిల్-జూలై నెలల్లో 155.4 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే నిర్దేశిత లక్ష్యానికి ఇది 12.6 మిలియన్ టన్నులు తక్కువ కావడం గమనార్హం. ఈసారి 168 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాది 80 శాతం వాటా.

08/04/2017 - 00:24

నిజామాబాద్, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించి పసుపు బోర్డును సాధించుకోవాలనే అకుంఠిత దీక్షతో నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు (ఎంపి) కల్వకుంట్ల కవిత ముందుకెళ్తు న్నారు. ఎంతో పట్టుదలతో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

08/04/2017 - 00:22

ముంబయి, ఆగస్టు 3: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస రికార్డు లాభాల్లో కొనసాగిన సూచీలు బుధవారం కూడా నష్టాలకే పరిమితమవగా, గురువారం ఈ నష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

08/04/2017 - 00:20

మహేశ్వరం, ఆగస్టు 3: దేశంలోనే పరిశ్రమల స్థాపనలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో గురువారం హార్డ్‌వేర్ పార్కులో కల్యాణి స్ట్రాటజిక్, రాఫిల్, అడ్వాన్స్డ్ సిస్టంను కెటిఆర్ ప్రారంభిం చారు.

08/04/2017 - 00:19

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, కంటైనర్స్, మొబైల్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, యంత్రాలు తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు రెండు ప్రైవేట్ సంస్థలతో రాష్ట్ర ఐటి శాఖ ఒప్పందం కుదుర్చుకున్నది.

08/04/2017 - 00:18

హైదరాబాద్, ఆగస్టు 3: భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా ముందుకెళుతోంది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన మోటరోలా స్టోర్స్ మోటో హబ్‌లను ప్రారంభించింది. ఈ హబ్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ పేర్కొంది. నొయిడాలో రెండు, ఇందిరాపురంలో ఒకటి, ముంబయిలో మూడు హబ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది.

08/04/2017 - 00:18

హైదరాబాద్, ఆగస్టు 3: అథెంటిక్ పోర్చుగీస్ క్యుసిస్ రెస్టారెంట్ బార్సెలోస్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. బార్సిలోస్ బిజినెస్ హెడ్ రోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ పెరిపెరి గ్రిల్డ్ చికెన్ మొదలుకుని బ్లాక్ బర్జరు, స్టీక్స్, స్పెటాడాస్, సిజ్లర్స్‌తో కూడిన మెనూ అబ్బురపరుస్తుందని తెలిపారు.

08/04/2017 - 00:17

45 శాతం దిగజారిన
ఇండియన్ ఆయల్ లాభం

08/03/2017 - 01:17

ముంబయి, ఆగస్టు 2: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను ఎట్టకేలకు తగ్గించింది. 10 నెలల విరామం తర్వాత రెపో, రివర్స్ రెపోలను పావు శాతం దించింది. నిరుడు అక్టోబర్‌లో తగ్గగా, మళ్లీ ఇంత కాలానికి ఇప్పుడే తగ్గించారు. ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులో ఉండటంతోనే వడ్డీరేట్లను తగ్గించడానికి మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) ఏకగ్రీవంగా అంగీకరించింది.

Pages