S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/06/2017 - 00:19

హైదరాబాద్, ఆగస్టు 5: పది రూపాయల నాణేలు చెల్లవంటూ వస్తున్న పుకార్లపై హైదరాబాద్ ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రీజినల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యన్ స్పందించారు. వీటిని తీసుకునేందుకు నిరాకరించే వారిపై చర్యలు తీసుకుంటామని, పది రూపాయల నాణేలు చెల్లుతాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నాణేలు చెల్లుబాటు అయ్యేలా చూడాలని బ్యాంక్ అధికారులను ఆయన ఆదేశించారు.

08/06/2017 - 00:18

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) జాబితాలోని 18 శాతం శ్లాబ్ పరిధి నుంచి 12 శాతం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించినట్టు తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.

08/06/2017 - 00:18

న్యూఢిల్లీ, ఆగస్టు 5: నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. అర్వింద్ పనగరియా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తాను తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోతున్నానని ఈ నెల 1న పనగరియా ప్రకటించినది తెలిసిందే. 31న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు. దీంతో ఈయన స్థానంలో రాజీవ్ కుమార్‌ను కేంద్రం నియమించింది.

08/05/2017 - 02:10

న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిధుల సమీకరణపై గట్టిగానే దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలను విక్రయించి ఖాజానాకు ఆ సొమ్మును తరలించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఇలా 72,500 కోట్ల రూపాయలను అందుకోవాలని నిర్దేశించుకున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు రక్షణ రంగ సంస్థల్లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని చూస్తోంది.

08/05/2017 - 02:09

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సంస్కరణలకు ముగింపు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. గత నెల జూలై 1న చారిత్రక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో మున్ముందు మరిన్ని సంస్కరణలు ఉంటాయని, దీనికి విశ్రాంతి ఉండబోదని శుక్రవారం ఇక్కడ తెలిపారు.

08/05/2017 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 4: శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వృద్ధులు, 5 లక్షల రూపాయల ఆదాయానికి దిగువన ఉన్నవారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

08/05/2017 - 02:08

ముంబయి, ఆగస్టు 4: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 87.53 పాయింట్లు పుంజుకుని 32,325.41 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.75 పాయింట్లు పెరిగి 10,066.40 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు రోజులు సూచీలు నష్టాలకే పరిమితమైనది తెలిసిందే.

08/05/2017 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 14 శాతం పెరిగి 40.42 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 31.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,155.21 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 4,855.50 కోట్ల రూపాయలుగా ఉంది.

08/04/2017 - 00:27

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీదారు బిఎమ్‌డబ్ల్యు.. గురువారం దేశీయ మార్కెట్‌లోకి సరికొత్త 320డి ఎడిషన్ స్పోర్ట్ కారును తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 38.6 లక్షల రూపాయలు. ట్విన్‌పవర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంటుందని సంస్థ ఈ సందర్భంగా తెలిపింది

08/04/2017 - 00:26

ఇటలీకి చెందిన సూపర్‌బైక్ తయారీదారు డుకాటి.. గురువారం భారతీయ మార్కెట్‌కు స్క్రాంబ్లర్ కేఫ్ రేసర్ మోడల్ బైక్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 9.32 లక్షల రూపాయలు. యూరో 6 దశలో వచ్చిన దీనిలో ట్విన్ సిలిండర్ 803 సిసి ఇంజిన్ ఉందని సంస్థ తెలిపింది.
ఢిల్లీ, ముంబయ, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి డీలర్‌షిప్‌లలో బైక్ లభిస్తుంది

Pages