S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/02/2017 - 00:30

ధర్మవరం, ఆగస్టు 1: ధర్మవరం పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేది పట్టుచీర. కళానైపుణ్యంతో మగువలు మెచ్చేలా రకరకాల డిజైన్లతో చేనేతన్న మగ్గంపై ఎం తో ఒడుపుగా పట్టుచీర నేస్తుంటాడు. దేశవిదేశాల్లో ధర్మవరం పట్టుచీరలకు మంచి డిమాండ్ ఉంది. ఇంత ప్రాశస్తి కలిగిన ధర్మవరం చేనేత పట్టు పరిశ్రమకు నేడు గడ్డుకాలం దాపురిస్తోంది.

08/02/2017 - 00:26

భీమవరం, ఆగస్టు 1: బ్రాండ్ ఇండియాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు విదేశాల్లో చుక్కెదురవుతోంది. యాంటి బయోటిక్స్ వినియోగిస్తున్నారంటూ రొయ్యల కంటైనర్లను వెనక్కి పంపేస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సాగు నుండి ప్రాసెసింగ్ దాకా పర్యవేక్షణ ఉంచాలని నిర్ణయించింది.

08/02/2017 - 00:23

పవర్ గ్రిడ్ కార్పొరేషన్
నికర లాభం రూ. 2,052 కోట్లు

08/01/2017 - 00:43

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ (ఎఫ్‌సిఎ) ఇండియా సోమవారం భారత్‌లో తయారైన తమ తొలి జీప్ కంపాస్ ఎస్‌యువిని
దేశీయ మార్కెట్‌కు ముంబయ వేదికగా పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 14.95 లక్షల రూపాయలు. ఆదివారం (ఆగస్టు 6) నుంచి ఈ కొత్త వాహనాల డెలివరీ ఉంటుందని సంస్థ తెలిపింది

08/01/2017 - 00:41

సిఆర్‌ఎఫ్1000ఎల్ ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్ డెలివరీలను ప్రారంభించినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) సోమవారం తెలిపింది. 1000 సిసి సామర్థ్యం కలిగిన దీని ఆన్‌రోడ్ గరిష్ఠ ధర 14 లక్షల రూపాయలు. ఈ ఏడాది మే 15న పరిచయమైన ఈ బైక్‌లో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి), యాంటి లాకింగ్ బ్రేకింగ్ (ఎబిఎస్) వ్యవస్థలున్నాయ

08/01/2017 - 00:39

ముంబయి, జూలై 31: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 3 కోట్ల రూపాయల జరిమానా వేసింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలను పాటించకపోవడమే కారణం. కాగా, రెండు కేసుల్లో ఈ జరిమానా పడగా, ఒక కేసులో 2 కోట్ల రూపాయలు, మరో కేసులో కోటి రూపాయల జరిమానా విధించింది.

08/01/2017 - 00:39

న్యూఢిల్లీ, జూలై 31: తమిళనాడులోగల సేలం స్టీల్ ప్లాంట్ (ఎస్‌ఎస్‌పి)లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్.. సోమవారం లోక్‌సభకు తెలిపారు. అయితే మొత్తం పెట్టుబడులను వెనక్కి తీసుకోబోదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, గడచిన కొనేళ్ల నుంచి ఎస్‌ఎస్‌పి ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా లేవని అన్నారు.

08/01/2017 - 00:38

న్యూఢిల్లీ, జూలై 31: దేశీయ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 37.1 శాతం పెరిగి 811 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం కూడా ఈసారి 25.6 శాతం వృద్ధి చెంది 5,955 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
టెక్ మహీంద్ర లాభం రూ. 798 కోట్లు

08/01/2017 - 00:37

న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. సోమవారం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. కోటి రూపాయల వరకు ఉన్న ఎస్‌బి అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేటును 0.5 శాతం తగ్గించి 3.5 శాతానికి చేర్చింది. ఈ నిర్ణయం 90 శాతం ఖాతాదారులపై ప్రభావం చూపనుంది.

08/01/2017 - 00:36

న్యూఢిల్లీ, జూలై 31: సహారా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని టేకోవర్ చేసుకోవాలంటూ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ను బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ ఆదేశించడంపై సోమవారం సహారా గ్రూప్.. సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)కు వెళ్లింది. దీనిపై శాట్ స్టే విధించగా, ఆగస్టు 7కు తదుపరి విచారణను వాయదా వేసింది. ఫలితంగా సహారా లైఫ్‌కు వారం రోజులపాటు ఊరట లభించినట్లైంది.

Pages