S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/26/2015 - 07:00

హైదరాబాద్, నవంబర్ 25: నాణ్యతాపరమైన అంశాలపై మరోసారి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను అమెరికా ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డిఎ) హెచ్చరించింది. లోపాలను సరిదిద్దుకోకపోతే ఇకపై తమ దేశానికి వచ్చే ఔషధాలకు ఆమోదం తెలిపేది లేదని, దిగుమతులను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఓ హెచ్చరిక లేఖను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు యుఎస్ ఎఫ్‌డిఎ అందించింది.

11/26/2015 - 06:58

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో అసహనం తీవ్రతరంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్ మార్కెటీర్ స్నాప్‌డీల్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం ప్రకటించింది.

11/26/2015 - 06:58

విశాఖపట్నం, నవంబర్ 25: మీ ఇంటికి మీ ఇసుక అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక విధానం ఇప్పటికీ గాడిలో పడకపోగా, మాఫియాకు పుష్కలంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కొత్త ఇసుక విధానం భళా.. అంటూ అధికారులు, కొందరు మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం వల్ల అందులో లోటుపాట్లను సరిచేయలేకపోతున్నారు.

11/26/2015 - 06:57

హైదరాబాద్, నవంబర్ 25: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రమోటర్ పవన్ ముంజల్.. ప్రైవేట్ సంస్థల డైరెక్టర్లలో అత్యధిక వేతనాన్ని పొందుతున్న డైరెక్టర్‌గా నిలిచారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 43.91 కోట్ల రూపాయలను ఈయన వేతనంగా అందుకున్నారు. ఈయన తర్వాత ఉన్న ఇద్దరు డైరెక్టర్లు కూడా హీరో మోటోకార్ప్‌నకు చెందినవారే కావడం గమనార్హం.

11/26/2015 - 06:56

విజయవాడ, నవంబర్ 25: కడియం నర్సరీలను దేశానికే ఆదర్శ నర్సరీలుగా తీర్చిదిద్దాలని, మొక్కల పెంపక క్షేత్రాలను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ ప్రతినిధులు సిఎంను కలిశారు.

11/25/2015 - 06:29

మంగళవారం బెంగళూరులో జియోని సంస్థ సరికొత్త మొబైల్ ఫోన్ ‘మారథాన్ ఎమ్ 5’ మోడల్‌ను పరిచయం చేసింది. ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నూతన మొబైల్‌ను చూపుతున్న జియోని ఇండియా సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ ఆర్ వోహ్రా, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్లు సందీప్ కర్వా, విఘ్నేశ్ రామకృష్ణన్

11/25/2015 - 06:29

చంద్రబాబును కలిసిన విజయా బ్యాంక్ ఎండి

11/25/2015 - 06:26

రెండో రోజూ కొనసాగిన నష్టాలు
సెన్సెక్స్ 44, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణత

11/25/2015 - 06:25

రష్యా ఫైటర్ జెట్ కూల్చివేత,
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కారణం

11/25/2015 - 06:24

రూ. 2,265 కోట్లతో అదనంగా 23 శాతం వాటా కొనుగోలు

Pages