S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/28/2017 - 00:36

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. మంత్రి అశోగజపతిరాజుతో ముఖాముఖి కార్యక్రమాన్ని పారిశ్రామిక సంఘం సిఐఐ సోమవారం ఇక్కడ నిర్వహించింది.

02/28/2017 - 00:34

బార్సిలోనా, ఫిబ్రవరి 27: భారతీయ మార్కెట్‌కు నోకియా 3310 మొబైల్ మళ్లీ వస్తోంది. సరికొత్త అవతారంతో దీన్ని దేశీయ మార్కెట్‌కు హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ సంస్థ పరిచయం చేస్తోంది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల కోసం నోకియాతో హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ పదేళ్ల బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది తెలిసిందే.

02/28/2017 - 00:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: డిజిటల్ చెల్లింపులకు ఊతమిస్తూ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి.. విస్తృత స్థాయిలో ఉన్న తమ ఏజెంట్లకు పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) మిషన్లను అందించాలని యోచిస్తోంది. యేటా దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల ప్రీమియంను ఎల్‌ఐసికి ఉన్న లక్షలాది మంది ఏజెంట్లు వసూలు చేస్తున్నారు.

02/28/2017 - 00:28

ముంబయి, ఫిబ్రవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్చి డేరివేటివ్ సిరీస్ తొలిరోజే సూచీలు నిరాశపరచగా, ఈ వారం కాంగ్రెస్ ఎదుట అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించనున్న క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.

02/28/2017 - 00:28

విజయవాడ, ఫిబ్రవరి 27: కృష్ణపట్నం పోర్టు డిప్యూటి కమిషనర్ ముసులూరు శ్రీకాంత్‌కు ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూసిఒ) సర్ట్ఫికెట్ లభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపి కస్టమ్స్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపి కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్.. డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌ను అభినందించారు.

02/28/2017 - 00:27

తడ, ఫిబ్రవరి 27: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడను సోమవారం జపాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సందర్శించింది. ఆ శాఖ రీజినల్ అఫైర్స్ డిడి తోరుయూ నేతృత్వంలో విచ్చేసిన ఈ బృందానికి శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికి శ్రీసిటీలోని వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి ప్రత్యేకతలను వివరించారు.

02/28/2017 - 00:25

హైదరాబాద్, ఫిబ్రవరి 27: సాంకేతిక విప్లవం, వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ మధ్య సంస్థల యాజమాన్యాలు తమ నాలెడ్జ్‌ను పరిపక్వం చేసుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక సంఘం సిఐఐ అభిప్రాయ పడింది. నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌కు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలంది. రెండు రోజుల సిఐఐ నేషనల్ నాలెడ్జ్ సదస్సు సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

02/27/2017 - 00:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: స్థూల ఆర్థిక గణాంకాలు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తీరు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నడిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఇతర ప్రభావిత అంశాలేవీ లేకపోవడంతో యుపి అసెంబ్లీ ఎన్నికలు మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడు తున్నారు.

02/27/2017 - 00:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రభుత్వరంగ బ్యాంకులు మంగళవారం మూతబడే అవకాశాలున్నాయి. వివిధ డిమాండ్ల పరిష్కారార్థం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బియు) బంద్ నిర్వహించే వీలుంది. యుఎఫ్‌బియు.. 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

02/27/2017 - 00:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్.. కర్నాటకలో తమ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూమిలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 6 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది ఆర్సెలార్ మిట్టల్ సంస్థ.

Pages