S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/30/2017 - 01:24

న్యూఢిల్లీ, జనవరి 29: త్రైమాసిక ఆర్థిక ఫలితాలతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్.. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి తదితర అగ్రశేణి సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయ.

01/30/2017 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు నిరుడు డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో తగ్గుముఖం పట్టాయి. 4,890 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్-డిసెంబర్‌లో ఇవి 6,121 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, ఆదాయం పెరగడంతో నష్టాలు తగ్గాయని సంస్థ చెబుతోంది.

01/30/2017 - 01:22

రేణిగుంట, జనవరి 29: పతంజలి గ్రూప్ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలని చూస్తున్నట్లు సంస్థ అధిపతి, యోగా గురువు రామ్‌దేవ్ బాబా వెల్లడించారు. ఆదివారం మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు చిత్తూరు జిల్లా యోగా గురువులు, బిజెపి నాయకులు, డిఎస్పీ నంజుండప్ప ఘనస్వాగతం పలికారు.

01/30/2017 - 03:15

న్యూఢిల్లీ, జనవరి 29: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జన్ ధన్ ఖాతాల లావాదేవీలు భారీగా పెరిగినది తెలిసిందే. నోట్ల రద్దుకు ముందు జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లో రద్దు తర్వాత వేలల్లో నగదు డిపాజిట్ అయ్యింది. మరికొన్ని ఖాతాల్లో నగదు నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఆ నగదంతా కూడా ఉపసంహరణ జరుగుతోంది.

01/30/2017 - 01:21

విశాఖపట్నం, జనవరి 29: రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి విశాఖలో రెండు రోజులపాటు జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలు ఎంఓయులు కుదుర్చుకున్నారు. నిరుడు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయులు జరిగాయి. వెరసి, ఈ రెండేళ్లలో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయులు జరిగాయన్నమాట.

01/30/2017 - 01:20

న్యూఢిల్లీ, జనవరి 29: బడ్జెట్‌లో పన్ను రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది దేశీయ పారిశ్రామిక రంగం. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను సాధారణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీంతో బడ్జెట్‌లో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్ణయాలు ఉండాలని కోరుతోంది.

01/30/2017 - 01:20

న్యూఢిల్లీ, జనవరి 29: కొత్త సంవత్సరంలోనూ విదేశీ మదుపరుల తీరు మారడం లేదు. దేశీయ మార్కెట్ల నుంచి నిరుడు విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటిదాకా భారత మార్కెట్ల నుంచి 5,600 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

01/29/2017 - 01:09

విశాఖపట్నం, జనవరి 28: నాల్గవ పారిశ్రామిక విప్లవం సత్ఫలితాలివ్వాలంటే పౌర ఆధారిత పరిశోధనలు విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వైఎస్ చౌదరి అభిప్రాయపడ్డారు.

01/29/2017 - 01:08

శాన్‌ఫ్రాన్సిస్కో, జనవరి 28: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంపై గూగుల్ భారత సంతతి సారథి సుందర్ పిచాయ్ విమర్శలు గుప్పించారు. ఏడు ముస్లీం దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు. ఇది అమెరికాకు వచ్చే నైపుణ్యానికి అడ్డుకట్ట వేస్తుందన్న ఆయన కనీసం 187 గూగుల్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని కూడా పిచాయ్ అన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

01/29/2017 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 28: ఆగ్నేయాసియాలోని 10 దేశాల కూటమికి పాతికేళ్లు నిండిన సందర్భంగా శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాని (ఆర్‌సిఇపి)కి పిలుపునిచ్చారు. తన సందేశంలో కూటమికి అధ్యక్షత వహిస్తున్న ఫిలిప్పిన్స్ అధ్యక్షుడికి ఈ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Pages