S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/16/2017 - 00:21

న్యూఢిల్లీ, జనవరి 15: త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, రాబోయే బడ్జెట్‌పై మదుపరుల అంచనాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పవర్ తదితర అగ్రశేణి సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయ.

01/16/2017 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 15: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరను 42 పైసలు, డీజిల్ ధరను 1.03 పైసలు చొప్పున పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలోనే పెంపు అనివార్యమైందని ఓ ప్రకటనలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తెలిపింది.

01/16/2017 - 00:19

రాజమహేంద్రవరం, జనవరి 15: విదేశీ వంట నూనెలు స్వదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వంట నూనెలను దేశీయంగానే తయారు చేసి, విక్రయంచాలన్న కల.. కలగానే మిగిలిపో తోంది. స్వయం సమృద్ధి సాధించేందుకు గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం కేవలం 10 శాతానికే పరిమితమైంది. 90 శాతం అవసరాలు విదేశీ వంట నూనెలపైనే తీరుతున్న పరిస్థితి.

01/16/2017 - 00:18

న్యూఢిల్లీ, జనవరి 15: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. భారతీయ చిహ్నాలు, ప్రతీకలపట్ల వ్యవహరిస్తున్న తీరును కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ రకమైన చులకన భావాన్ని సహించబోమని, మార్పు రాకపోతే ఇబ్బందులేనని హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ మేరకు ఆదివారం అమెజాన్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారతీయ చిహ్నాలు, ప్రతీకల గురించి చులకనభావాన్ని వీడాలని హితవు పలికారు.

01/16/2017 - 00:07

ముంబయి, జనవరి 15: హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ లిమిటెడ్ (హెచ్‌సిసిబిఎల్).. దేశీయంగా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. అహ్మదాబాద్, నెల్లూరుల్లో ఈ రెండు ప్లాంట్లు రానున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్‌సిసిబిఎల్.. 26 బాట్లింగ్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. దేశీయంగా కోకా-కోలా బాట్లింగ్ తయారీలో దాదాపు 65 శాతం హెచ్‌సిసిబిఎల్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

01/16/2017 - 00:05

న్యూఢిల్లీ, జనవరి 15: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. సంస్కరణల బాట పట్టింది. రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌ల్లో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించింది. అంతేగాక బ్రోకర్ ఫీజునూ తగ్గించింది.

01/16/2017 - 00:05

న్యూఢిల్లీ, జనవరి 15: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రభుత్వం తప్పక గౌరవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి జరిగిన పరిణామాల్లో ఆర్‌బిఐలో కేంద్రం జోక్యం పెరిగిపోయిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ యునైటెడ్ ఫోరమ్..

01/16/2017 - 00:04

న్యూఢిల్లీ, జనవరి 15: కొత్త సంవత్సరంలోనూ విదేశీ మదుపరుల తీరు మారడం లేదు. దేశీయ మార్కెట్ల నుంచి నిరుడు విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల తొలి పదిహేను రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి 3,809 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

01/14/2017 - 00:27

బెంగళూరు, జనవరి 13: దేశీయ రెండో అతిపెద్ద ఐటిరంగ సంస్థ.. ఇన్ఫోసిస్ లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతం పెరిగింది. 3,708 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,465 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 17,273 కోట్ల రూపాయలుగా, పోయినసారి 15,902 కోట్ల రూపాయలుగా ఉంది.

01/14/2017 - 00:24

బీజింగ్, జనవరి 13: ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారైన చైనా.. వరుసగా రెండో సంవత్సరం ఎగుమతుల క్షీణతను చవిచూసింది. 2016లో చైనా ఎగుమతులు 7.7 శాతం పడిపోయాయి. 2015లోనూ 2.8 శాతం మేర చైనా ఎగుమతులు దిగజారాయి. ఈ క్రమంలో నిరుడు మరింతగా దేశీయ ఎగుమతులు పతనం కావడంపట్ల చైనా ఆందోళనలో పడింది.

Pages