S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/14/2017 - 00:24

ముంబయి, జనవరి 13: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలను అందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో కదలాడినప్పటికీ దేశీయ ఐటిరంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మదుపరులను మెప్పించలేకపోవడంతో చివరిదాకా ఆ లాభాలు కొనసాగలేకపోయాయి.

01/14/2017 - 00:23

న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల వృద్ధిరేటును అందుకున్నాయి. గత నెల డిసెంబర్‌లో 5.71 శాతం వృద్ధితో 23.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్, ఔషధ రంగాల ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ లభించింది. అయితే డిసెంబర్‌లో దిగుమతులు కూడా గతంతో పోల్చితే 0.47 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 10.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

01/14/2017 - 00:22

న్యూఢిల్లీ, జనవరి 13: విమానయాన విస్తరణలో భాగంగా దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. ప్రముఖ విదేశీ విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి భారీ ఎత్తున విమానాలను కొనుగోలు చేస్తోంది. 1,50,000 కోట్ల రూపాయలతో 205 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను స్పైస్‌జెట్ అందుకుంటోంది. భారతీయ విమానయాన రంగంలో అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు.

01/14/2017 - 00:20

చిత్రం.సరికొత్త మోడల్ కారు ఇగ్నిస్‌ను దేశీయ మార్కెట్‌కు శుక్రవారం పరిచయం చేస్తున్న
మారుతి సుజుకి ప్రతినిధులు

01/14/2017 - 00:18

చిత్రం..అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయర్స్‌లో తమ నూతన టూవీలర్ ఇగ్నిటర్‌ను ఆవిష్కరిస్తున్న హీరో మోటోకార్ప్ సిఎండి పవన్

01/14/2017 - 00:15

ముంబయి, జనవరి 13: దేశీయంగా మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్.. శుక్రవారం రుణాలపై వడ్డీరేట్లను 0.70 శాతం వరకు తగ్గించింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు చాలావరకు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

01/14/2017 - 00:14

హైదరాబాద్, జనవరి 13: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 18న ఇక్కడ జరిగే ‘డిజి ధన్ మేళా’లో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ఎంజె అక్బర్ పాల్గొంటున్నారు. శుక్రవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.

01/13/2017 - 02:49

చిత్రం.. న్యూఢిల్లీలో గురువారం ఎయర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

01/13/2017 - 00:37

ముంబయి, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 107 పాయింట్లు పెరిగి రెండు నెలల గరిష్ఠస్థాయికి ఎగువన 27,247.16 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8,400 పాయింట్ల స్థాయిని దాటింది. ఇంధన, ఐటి, బ్యాంకింగ్ రంగాల స్టాక్స్ మంచి లాభాలు ఆర్జించాయి.

01/13/2017 - 00:35

ముంబయి, జనవరి 12: దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం లాభాల పంట పండింది. రెండో త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 10.9 శాతం వృద్ధితో రూ.6,778 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభాలు రూ.6,110 కోట్లుగా ఉన్నాయి.

Pages