S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/13/2017 - 00:34

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ తమ సంస్థ కొత్త చైర్మన్‌గా అనుబంధ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిఇఓ నటరాజన్ చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

01/13/2017 - 00:32

భీమవరం, జనవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆనంద గ్రూప్ సంస్థ ద్వారా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు, గొంతేరు డ్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఫుడ్‌పార్కు డైరెక్టర్ ఉద్దరాజు జోగిరాజు స్పష్టంచేశారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆక్వా రైతాంగానికి ఉపయోగపడే ఫుడ్ పార్కుపై విషప్రచారం చేస్తున్నారన్నారు.

01/13/2017 - 00:30

న్యూఢిల్లీ, జనవరి 12: మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)-సహారా రిఫండ్ ఖాతాలో ఫిబ్రవరి 6వ తేదీలోగా మరో 600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని లేదంటే జైలుకు వెళ్లాలని సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్‌కి సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది.

01/13/2017 - 00:28

న్యూఢిల్లీ, జనవరి 12: నాసిరకం సేవలందించే టెలికాం ఆపరేట్లపై జరిమానాలు విధించే అధికారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్)కు ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీలు విధించడానికి మార్గం సుగమమైంది.

01/13/2017 - 00:28

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీ నిబంధనలకు సంబంధించిన సిఫారసులను ఫిబ్రవరి నెలాఖరులోగా ఖరారు చేయాలని టెలికామ్ నియంత్రణా సంస్థ (ట్రాయ్) యోచిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా వినియోగదారులు చౌకగా ఫోన్‌కాల్స్ చేసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది.

01/13/2017 - 00:26

న్యూఢిల్లీ, జనవరి 12: భారత జాతీయ జెండాను అవమానించే విధంగా త్రివర్ణాలను ముద్రించి తయారు చేసిన డోర్ మ్యాట్ల అమ్మకాలను అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ‘అమెజాన్’ ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) ధ్రువీకరించింది.

01/13/2017 - 00:24

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాల్లో భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 2 శాతం తగ్గవచ్చని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ పరిమాణం భారీగా తగ్గడమే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది.

01/12/2017 - 08:32

గాంధీనగర్, జనవరి 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే కొద్దివారాల్లో ఈ సమస్య పరిష్కారం అవగలదన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. జిఎస్‌టిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గట్టిగా ప్రయత్నిస్తున్నది తెలిసిందే.

01/12/2017 - 08:30

ముంబయి, జనవరి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల మధ్య మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, విద్యుత్ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 240.85 పాయింట్లు ఎగిసి రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకుతూ 27,140.41 వద్ద స్థిరపడింది.

01/12/2017 - 08:29

వాషింగ్టన్, జనవరి 11: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ జిడిపి వృద్ధిరేటును ప్రపంచ బ్యాంక్ బుధవారం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతానికే పరిమితం కాగలదని అంచనా వేసింది. ఇంతకుముందు ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.6 శాతంగా, ఆపై ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.8 శాతంగా ఉండగలదని అభిప్రాయపడింది.

Pages