S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/18/2016 - 00:49

ముంబయి, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 59.24 పాయింట్లు క్షీణించి 28,005.37 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.50 పాయింట్లు దిగజారి 8,624.05 వద్ద నిలిచింది.

08/18/2016 - 00:48

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. బుధవారం తమ 3జి, 4జి వినియోగదారుల కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘కాలింగ్ కా నయా తరీకా’ అనే పేరుతో పరిచయమైన ఈ పథకంతో మొబైల్ అప్లికేషన్స్ (యాప్) నుంచి చేసే కాల్స్ 95 శాతం చౌక అవుతాయని సంస్థ తెలియజేసింది. 200 మెగాబైట్ 4జి డేటా ధర 39 రూపాయలని వెల్లడించింది.

08/18/2016 - 00:48

సాన్ జోస్ (కాలిఫోర్నియా), ఆగస్టు 17: అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ సంస్థ సిస్కో సిస్టమ్స్.. భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా సుమారు 14,000 మందిని తీసేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్కో ఉద్యోగుల్లో దాదాపు 20 శాతానికి ఇది సమానం. ఈ ఏప్రిల్ 30 నాటికి సిస్కో ఉద్యోగుల సంఖ్య 70,000గా ఉంది.

08/18/2016 - 00:46

హైదరాబాద్, ఆగస్టు 17: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన ఈ విషయమై తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌బిహెచ్‌కు ఘనమైన చరిత్ర ఉందని, నిజాం కాలం నుంచి ఈ బ్యాంకు అద్భుతమైన సేవలను అందిస్తోందని తెలిపారు.

08/18/2016 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రవాణా యాప్ ఓలా.. టాక్సీఫర్‌ష్యూర్ (టిఎఫ్‌ఎస్) వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించుకుంది. దాదాపు 18 నెలల క్రితం 200 మిలియన్ డాలర్ల (సుమారు 1,300 కోట్ల రూపాయలు)తో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా కొనుగోలు చేసింది. ప్రధాన ప్రత్యర్థి ఉబర్‌కు దేశీయ మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వాలనుకునే లక్ష్యంలో భాగంగా 2015 మార్చిలో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా సొంతం చేసుకుంది.

08/18/2016 - 00:43

న్యూఢిల్లీ, ఆగస్టు 17: లిక్కర్ తయారీ సంస్థ రాడికో ఖైతాన్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25.2 శాతం పెరిగి 21.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 17.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి నిరుడుతో పోల్చితే 3.1 శాతం పెరిగింది. 430.4 కోట్ల రూపాయలుగా ఉంది.

08/18/2016 - 00:43

న్యూఢిల్లీ, ఆగస్టు 17: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్‌డయల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 7.98 శాతం పెరిగి 38.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ నికర లాభం 36.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా నిరుడుతో పోల్చితే 6.17 శాతం ఎగిసి ఈసారి 176.29 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఇది 166.03 కోట్ల రూపాయలుగా ఉంది.

08/18/2016 - 00:42

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రుణాలు తీసుకున్నవారు వాటిని చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా ఆ రుణాల కోసం జామీనుగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు తెలిపారు. అయితే వ్యవసాయ రుణాలకు ఇది వర్తించదు. అలాగే విద్యార్థుల రుణాలకూ చెల్లదు.

08/18/2016 - 00:40

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: చంద్రన్న బీమా పథకంలో నమోదైన అసంఘటిత కార్మికులకు అదనపు ప్రయోజనాలు వర్తించనున్నాయని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ డి వరప్రసాద్ తెలిపారు. అసంఘటిత రంగంలోని రెండు కోట్ల మంది కార్మికుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంలో ప్రథమ ప్రీమియం రూ. 139 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

08/18/2016 - 00:39

గుంటూరు, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 సీజన్‌కు సంబంధించి 130 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేసేందుకు పొగాకుబోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో బోర్డు చైర్మన్ మనోజ్‌కుమార్ ద్వివేది అధ్యక్షతన 142వ పొగాకు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు సభ్యులు, ఎంపిలు గల్లా జయదేవ్, లాల్‌సింగ్ వదోడియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎపి) విజయకుమార్ తదితరులు హాజరయ్యారు.

Pages