S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/01/2016 - 07:52

మామిడికుదురు, ఆగస్టు 31: కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో ప్రభుత్వరంగ ఒఎన్‌జిసి సంస్థ నిర్వహించిన డ్రిల్లింగ్‌లో అపార చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇ-1400-17 రిగ్గుతో ఇక్కడ డ్రిల్లింగ్ నిర్వహించారు. 3,500 మీటర్ల మేర డ్రిల్లింగ్ అనంతరం బహుళ జోన్లతో కూడిన రిజర్వాయర్లు వెలికిచూశాయి. వీటిలో 35 సంవత్సరాల వరకు వినియోగించుకునే సామర్థ్యం ఉంది.

09/01/2016 - 07:52

న్యూఢిల్లీ, ఆగస్టు 31: మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీ).. తమ స్పోర్ట్స్ చానెల్ టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్‌కు అమ్మేసింది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ డీల్‌లో భాగంగా జీకి సోనీ పిక్చర్స్ దాదాపు 2,579 కోట్ల రూపాయల (385 మిలియన్ డాలర్లు)ను చెల్లించనుంది.

09/01/2016 - 07:51

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ).. బుధవారం 11 సిమెంట్ తయారీ సంస్థలపై 6,700 కోట్ల రూపాయలకుపైగా జరిమానాను విధించింది. జైప్రకాశ్ అసోసియేట్స్‌పై అత్యధికంగా 1,323.60 కోట్ల రూపాయల జరిమానా పడటం గమనార్హం. ఆ తర్వాత అల్ట్రాటెక్‌పై 1,175.49 కోట్ల రూపాయల జరిమానా వేసిన సిసిఐ.. ఎసిఎల్‌పై 1,163.91 కోట్ల రూపాయలు, ఎసిసిపై మరో 1,147.59 కోట్ల రూపాయల జరిమానా విధించింది.

09/01/2016 - 07:50

ముంబయి, ఆగస్టు 31: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లోనే ముగిశాయి. సోమ, మంగళవారాల్లో నమోదైన లాభాలను బుధవారం కూడా సూచీలు కొనసాగించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 109.16 పాయింట్లు పుంజుకుని 13 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 28,452.17 వద్ద నిలిచింది.

09/01/2016 - 07:50

అనకాపల్లి (రూరల్), ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌లో 18 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే, వాటిలో ఆరు కనుమరుగైపోయాయి. 12 ఫ్యాక్టరీల్లోనూ క్రషింగ్ నిలిచిపోయిన ఫ్యాక్టరీలు ఎనిమిది ఉండగా, కేవలం నాలుగు ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. దీంతో షుగర్ ఫ్యాక్టరీల కార్మికులు, రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

09/01/2016 - 07:49

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జిడిపి వృద్ధిరేటు 6 త్రైమాసికాల కనిష్టానికి పతనమైంది. 7.1 శాతంగా నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్‌లో 6.6 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ దరిదాపుల్లోకి వృద్ధిరేటు ఇప్పుడే దిగజారింది. మరోవైపు వౌలికరంగ ప్రగతి జూలై నెలలో 3.2 శాతానికి దిగజారింది. అంతకుముందు నెల జూన్‌లో 5.2 శాతంగా నమోదవడం గమనార్హం.

08/31/2016 - 07:42

ముంబయి, ఆగస్టు 30: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 13 నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుని 28 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 8,700 స్థాయి ఎగువన స్థిరపడింది.

08/31/2016 - 07:40

సత్యవేడు/తడ, ఆగస్టు 30: అమెరికా వాణిజ్య ప్రతినిధి ఫిలిప్ ఎ మిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు శ్రీసిటీ అధ్యక్షుడు రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికి శ్రీసిటీలోని వౌలిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. పెప్సికో, కోల్గేట్, క్యాడ్‌బర్రీ, కెలాగ్స్ వంటి భారీ పరిశ్రమలతో సహా 10కిపైగా అమెరికా కంపెనీలు ఇక్కడే ఏర్పాటయ్యాయన్నారు.

08/31/2016 - 07:40

న్యూఢిల్లీ, ఆగస్టు 30: విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

08/31/2016 - 07:39

జోధ్‌పూర్, ఆగస్టు 30: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) ఇండియా.. మంగళవారం భారతీయ మార్కెట్‌లోకి జీప్ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ పేరిట రెండు ఎస్‌యువి (స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్) మోడల్స్‌ను పరిచయం చేసింది. వీటిలో నాలుగు రకాలుండగా, అత్యంత లగ్జరీ వాహనమైన గ్రాండ్ చెరోకీ వేరియంట్‌లోనే మూడు రకాలున్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రాంగ్లర్ ధర 71.59 లక్షల రూపాయలుగా ఉంది.

Pages