S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/16/2016 - 07:56

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహిళలకో శుభవార్త. మహిళల కోసం ప్రత్యేకంగా దివాఆన్‌డ్యూటీ.కామ్ పేరిట డిజిటల్ పబ్లికేషన్ (వెబ్‌సైట్) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హోటల్ ఆవాస్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో సెలబ్రిటీ త్రిధాచౌదరి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫ్యాషన్ బ్లాగర్స్ సాయి రోనక్ ప్రభృతులు వేడుకలో పాల్గొన్నారు.

09/16/2016 - 07:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు కొంత మంది బ్యాంకర్లు జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్ చేస్తుండటంపై వివాదం చెలరేగుతుంటంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో నిర్వహించనున్న త్రైమాసిక సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

09/16/2016 - 07:55

సత్యవేడు/తడ, సెప్టెంబర్ 15: థాయ్‌లాండ్ దేశానికి చెందిన అత్యున్నత శ్రేణి వ్యాపారవేత్తల బృందం శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను సందర్శించింది. ఆ దేశ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అథారిటీ గవర్నర్ వీరపాంగ్ చేయపర్ నేతృత్వంలో 21 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

09/16/2016 - 07:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టి అనుబంధ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ ఐపిఓ బిడ్డింగ్‌ల చివరి రోజయిన గురువారం మధ్యాహ్నానికి 1.43 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. 72,80,000 షేర్లకు గాను 1,04,33,712 షేర్లకు బిడ్లు వచ్చాయి. గత జూలైలో ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ ఐపిఓ మార్కెట్‌లోకి వచ్చినప్పటినుంచి ఎల్‌అండ్‌టి గ్రూపునుంచి మార్కెట్లోకి వచ్చిన రెండో సంస్థ ఇది.

09/16/2016 - 07:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: భారత్‌లో కొన్ని రకాల ఐఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్ ఇండియా గురువారం వెల్లడించింది.

09/15/2016 - 16:30

ముంబయి: వరుసగా రెండో రోజు గురువారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.97 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 28,412 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,742 వద్ద ముగిశాయి.

09/15/2016 - 05:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్ ఏకమవుతున్నాయి. ఎయిర్‌సెల్‌తో తమ వైర్‌లెస్ టెలికామ్ వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఆర్‌కామ్ బుధవారం అంగీకరించింది. దీంతో 65,000 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులతో దేశీయ టెలికామ్ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కలయికతో ఏర్పడే సంస్థ ఆవిర్భవించనుంది.

09/15/2016 - 05:49

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 14: విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తిస్థాయిలో హిందీ భాష అమలుకు కృషి చేస్తున్నం దుకుగాను ప్రతిష్ఠాత్మక రాజభాషా పురష్కారం దక్కింది. స్టీల్ ప్లాంట్ సిఎండి, ఇతర అధికారుల కృషి, పట్టుదల వలన కర్మాగారంలో అన్ని విభాగాల్లో హిందీ భాష అమలు జరుగుతోంది.

09/15/2016 - 05:48

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)ను ఈ నెల 19వ తేదీన జారీ చేయనుంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను 300 రూపాయల నుంచి 334 రూపాయల మధ్య నిర్ణయంచింది.

09/15/2016 - 05:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: టోకు ద్రవ్యోల్బణం గత నెలలో రెండేళ్ల గరిష్ఠానికి ఎగిసింది. పప్పు్ధన్యాలతోపాటు కొన్నిరకాల తయారీ ఉత్పత్తుల అధిక ధరల కారణంగా ఆగస్టులో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.74 శాతంగా నమోదైంది. ఇక అంతకుముందు నెల జూలైలో ఇది 3.55 శాతంగా ఉంటే, నిరుడు ఆగస్టులో మైనస్ 5.06 శాతంగా ఉంది. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మైనస్‌లోనే ఉన్నది తెలిసిందే.

Pages