S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/19/2016 - 06:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకులు సహా, భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబి) విలీన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది.

09/18/2016 - 06:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ స్థితి గతులను వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) సంస్కరణ సమూలంగా మార్చేస్తుందని కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి పికె.సిన్హా శనివారం పేర్కొంటూ, ఈ పరోక్ష పన్నును వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘ఓవర్ టైమ్’ పనిచేస్తూ శరవేగంగా పరుగులు తీస్తోందని తెలిపారు.

09/18/2016 - 06:08

చిత్తూరు, సెప్టెంబర్ 17: ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ రైతులు పంటపై ఆశలు వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఈపంటకు అనుకూలంగా వర్షం కురవడంతో పాటు రైతులు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయడంలో అధికార యంత్రాగం ప్రత్యేక చొరవ చూపడంతో రైతులు ఉత్సాహంతో పంట సాగుపై దృష్టి పెట్టారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరుణ దేవుడు కనె్నర్ర చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

09/18/2016 - 06:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి) తమ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించుకుంది. మొండి బకాయిలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఈ బ్యాంకు తన ప్రతిష్టను పెంచుకునేందుకు ఈ చర్య చేపట్టింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పంజాబ్ నేషనల్ బ్యాంకును ‘అందరి బ్యాంకు’గా అభివర్ణించాడు.

09/18/2016 - 06:07

ముంబయి, సెప్టెంబర్ 17:ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ హెచ్‌పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ సంస్థ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ద్వారా 361 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని అనుకుంటోంది. వ్యాపార పెట్టుబడి అవసారలు, అప్పుల్లో కొంత భాగాన్ని తీర్చడం కోసం ఈ నిధులను ఉపయోగించుకోవాలని ఆ కంపెనీ భావిస్తోంది. ప్రతి షేరు రూ. 175-200 ప్రైస్ బ్యాండ్‌తో ఉండే ఈ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమయి 26వ తేదీతో ముగుస్తుంది.

09/18/2016 - 06:06

ముంబయి, సెప్టెంబర్ 17: ద్రవ్యోల్బణం పెరుగుదల, జూలై నెలలో పారివ్రామిక ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం లాంటి పలు కారణంగా రెండు వారాలుగా లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం నష్టాల్లో ముగిశాయి. ఆగస్టు నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 3.74 శాతానికి పెరగడం తెలిసిందే.

09/18/2016 - 06:06

పారిస్, సెప్టెంబర్ 17: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం చమురు కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, వినియోగదారులు మాత్రం ధరలు తగ్గడంపై చాలావరకు సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంక్షోభం ఈ ఏడాది చివరికి సడలవచ్చని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) అభిప్రాయ పడింది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్) ఉత్పత్తి స్తంభనకు అంగీకరించినా, సరఫరాలపై దాని ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఐఇఏ పేర్కొంది.

09/17/2016 - 17:15

దిల్లీ: దేశీయ మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర రూ. 44,975గా ఉంది. కేజీ వెండి ధర రూ. 125 తగ్గడంతో రూ. 45వేల దిగువకు చేరింది. బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగి 31వేల మార్కును దాటింది. రూ. 40 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,040కు చేరింది.

09/17/2016 - 06:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అక్టోబర్ 4వ తేదీన జరిగే ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుదలను దృష్టి ఉంచుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తెలిపారు. ద్రవ్యోల్బణ తగ్గుదలతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందా?

09/17/2016 - 06:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలో పప్పు ధాన్యాల సాగుకు ఊతమిచ్చి ధరలను అదుపులో ఉంచేందుకు వీలుగా రైతులకు తక్షణమే మరింత కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Pages