S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/08/2016 - 02:31

జొహానె్నస్‌బర్గ్, జూలై 7: ప్రపంచంలోని పలు వర్థమాన దేశాల ప్రజలకు భారత ఫార్మాస్యూటికల్ (ఔషధ) రంగం ‘జీవన రేఖ’లా భాసిల్లుతోందని అంతర్జాతీయ స్థాయిలో సేవలందిస్తున్న ఒక సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది.

07/08/2016 - 02:30

న్యూఢిల్లీ, జూలై 7: యుపిఎ ప్రభుత్వ హయాంలో రూ.46 వేల కోట్ల మేరకు ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించిన ఆరు టెలికామ్ ఆపరేటర్లకు టెలికామ్ విభాగం (డాట్) త్వరలో రూ.12,500 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేయనుంది.

,
07/08/2016 - 02:29

న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో కారు చౌకగా స్మార్ట్ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించి ఐదు నెలల క్రితం పెను దుమారంలో చిక్కుకున్న నోయిడా సంస్థ ‘రింగింగ్‌బెల్స్’ శుక్రవారం నుంచి ఈ ఫోన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గురువారం స్పష్టం చేసింది.

07/08/2016 - 02:22

గత నెల ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్‌ను గురువారం బెంగళూరులో
సన్మానించి, ‘క్రెటా’ కారును బహూకరించిన హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సిఇఓ వైకె కూ

07/08/2016 - 02:19

న్యూఢిల్లీ, జూలై 7: హెచ్‌ఐవి, హెపటైటిస్ సి ఔషధాలను తయారు చేయడానికి ఐక్యరాజ్య సమితి మద్దతుతో ఏర్పాటయిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపిపి)తో ఆరు భారతీయ కంపెనీలు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

07/08/2016 - 02:18

విశాఖపట్నం, జూలై 7: ఇంధన సామర్థ్యానికి సంబంధించిన వేర్వేరు ప్రాజెక్టులను మరింతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిపర్చేందుకు వీలుగా వెయ్యి కోట్ల రూపాయల మేర వెచ్చించాలని ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ సంస్థ (ఇఇఎస్‌ఎల్) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో విశాఖ వేదికగా జరిగిన బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సుతో ఇంధన సామర్థ్య రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది.

07/08/2016 - 02:18

కర్నూలు, జులై 7: రైల్వేశాఖ సహాయమంత్రి హోదాలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కర్నూలుకు మంజూరు చేయించిన రైలు బోగీల మరమ్మతు కర్మాగారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రైల్వేశాఖ ఉన్నతాధికారులు గురువారం పాట్నా నుంచి కర్నూలు చేరుకుని పంచలింగాల సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు.

07/07/2016 - 07:43

ఆన్‌లైన్ వినియోగదారుల్లో 26-35 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఉన్నారు.
రెగ్యులర్ షాపర్లలో 52 శాతం వాటా వీరిదే. తర్వాతి స్థానంలో 18-25 ఏళ్ల
వయసువారుండగా, షాపింగ్‌లో వీరి వాటా 38 శాతంగా ఉంది. ఇక 36-45 ఏళ్ల
వయసువారి కొనుగోళ్లు 8 శాతంగా, 45-60 ఏళ్ల వయసువారి ఆన్‌లైన్ షాపింగ్
అతి తక్కువగా 2 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా ఆన్‌లైన్

07/07/2016 - 07:41

హైదరాబాద్, జూలై 6: వాణిజ్య శాఖ పన్నుల ఆదాయంలో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 8,250 కోట్ల రూపాయల రెవెన్యూను ఆంధ్ర రాష్ట్రం సాధించింది. నిరుడు ఇదే కాలంతో పోల్చితే దాదాపు 24 శాతం వాణిజ్య శాఖ పన్నుల వసూళ్లు పెరిగాయి. ముఖ్యంగా సిగరెట్లు, మద్యం పై పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

07/07/2016 - 07:41

సత్యవేడు, జూలై 6: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని శ్రీసిటీలో జపాన్ దేశానికి చెందిన కొబెల్కో ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్, పైలాస్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమల అదనపు ఉత్పత్తి యూనిట్లకు బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. కొబెల్కో కొత్త యూనిట్లను ఆ సంస్థ డైరెక్టర్ సటోరు హోషినా ప్రారంభించగా, పైలాస్ అదనపు యూనిట్‌ను ఆ సంస్థ పైలాస్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిహికోషిమాజు ప్రారంభించారు.

Pages