S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/01/2016 - 04:17

న్యూఢిల్లీ, జూన్ 30: ఆర్‌బిఐ గవర్నర్ పదవికి మూడేళ్ల కాలం చాలా తక్కవని రఘురామ్ రాజన్ అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న పద్ధతులు భారత్‌లో కూడా అనుసరిస్తే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు లాంటి అంశాలపై ఆర్థిక శాఖపై పార్లమెంటు స్థారుూ సంఘం సమావేశమై చర్చించింది.

07/01/2016 - 04:14

ముంబయి, జూన్ 30: బ్రెగ్జిట్ భయాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుదుటపడిన నేపథ్యంలో దఏశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా నాలుగో రోజు కూడా లాభాల బాటలో సాగాయి. సెనె్సక్స్ 245 పాయింట్లు పెరిగడంతో సూచీ తిరిగి 27 వేల పాయింట్ల దరిదాపులకు చేరుకుంది.

07/01/2016 - 04:14

న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తోడ్పాటును అందించేందుకు 100 కోట్ల డాలర్ల (దాదాపు 6,750 కోట్ల రూపాయల) రుణాన్ని అందజేస్తామని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు.

06/30/2016 - 07:05

ఒంగోలు, జూన్ 29: అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్ ఉన్నప్పటికి వేసవికాలంలో సాగుచేసిన సాగు మాత్రం రోగాల పాలవుతోంది. ఇది వర్షాకాలం సాగుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వర్షాకాలం ఆక్వాసాగు గణనీయంగా తగ్గే అవకాశాలుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారక ద్రవ్యం తగ్గనుంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోయనది తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

06/30/2016 - 07:01

న్యూఢిల్లీ, జూన్ 29: జాతీయ ఖనిజ అనే్వషణ విధానాని (ఎన్‌ఎమ్‌ఇపి)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఖనిజాల అనే్వషణ కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) గుర్తించిన 100 బ్లాకులను ప్రభుత్వం వేలం వేయవచ్చని ఓ సీనియర్ అధికారి అన్నారు.

06/30/2016 - 06:59

న్యూఢిల్లీ, జూన్ 29: ఎప్పట్నించో వేచిచూస్తున్న వేతన పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం.. దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనీర్లకు వేతనాన్ని పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించింది.

06/30/2016 - 06:58

విజయవాడ, జూన్ 29: ఆంధ్ర రాష్ట్రంలో వేరుశనగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. మునుపెన్నడూ లేని ఉత్పత్తి సాధ్యమైంది. 2014-15లో రాష్ట్రంలో 4.93 లక్షల మెట్రిక్ టన్నుల వేరుశనగ ఉత్పత్తి కాగా, 2015-16లో 8.03 లక్షలకు పెరిగింది. అంతకుముందుతో పోల్చితే 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగింది. హెక్టారుకు సరాసరి 1,027 కిలోల దిగుబడితో జాతీయ స్థాయిలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.

06/30/2016 - 06:57

ముంబయి, జూన్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపునకు మోదీ సర్కారు ఆమోదం పలకడం.. మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించింది. అలాగే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న అంచనాలూ కలిసొచ్చాయి.

06/29/2016 - 00:48

న్యూఢిల్లీ, జూన్ 28: ‘నల్లధనం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఇదే చివరి అవకాశం. దీన్ని ఉపయోగించుకుని నిశ్చింతగా ఉండండి.’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వన్-టైమ్ కంప్లియెన్స్ విండో ద్వారా బయటికొచ్చిన ఈ నల్లధనం వివరాలను ఏ ఇతర దర్యాప్తు సంస్థలకో, అథారిటీలకో ఇవ్వబోమని స్పష్టం చేశారు.

06/29/2016 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 28: ఔషధరంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 1,569.41 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆరంభంలో మొదలుపెట్టిన ఈ షేర్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా దాదాపు 51 లక్షల షేర్లను తిరిగి రెడ్డీస్ ల్యాబ్ చేజిక్కించుకుంది.

Pages