S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/12/2019 - 00:02

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అని కొందరు వాదనకు దిగుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు (డిఎమ్‌కె, మజ్లీస్ మినహా) సమర్ధించాయి. అయినప్పటికీ కొన్ని కుల సంఘాలు, కొందరు వ్యక్తులు ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటూ నిరసన గళం విప్పటం ప్రారంభించారు.

02/10/2019 - 03:21

ఈనెల 1న కేంద్రం రూ. 27.84 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, మధ్యతరగతి ప్రజలకిది ఎంతో ప్రయోజనకరమైనదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించినా, మరో రకంగా ఆలోచించినా బడ్జెట్ బడ్జెట్టే..

02/08/2019 - 22:29

వరుసగా 13వ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ పేరుతో ప్రచురించిన వార్షిక నివేదిక తెలుపుతోంది. ప్రపంచ వ్యా ప్తంగా రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్రాలు తిరోగమనంలో ఉండడం పట్ల ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు మెరుగవుతున్న దేశాల సంఖ్య కన్నా, తిరోగమనంలో పడుతున్న దేశాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.

02/07/2019 - 00:23

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’లో కొన్ని పథకాలు జనాన్ని మెప్పించేలా ఉన్నాయి. ఈ తరహా బడ్జెట్‌ను 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉంటే బాగుండేది. ఉత్తరాదిన కాంగ్రెస్ విజయంతో పాటు, దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి రగులుతోందని సంకేతాలు రావడంతో భాజపా తన వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు.

02/06/2019 - 00:35

కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ విచారణకు హాజరు కావల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇటు తృణముల్ కాంగ్రెస్, అటు బీజేపీ వర్గాలు నైతిక విజయం తమదంటే తమదేనని ప్రకటించుకున్నాయి. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదేశాలను ఉల్లంఘించడం నేరమా? కాదా?? దర్యాప్తునకు సహకరించమని పదే పదే సీబీఐ కోరుతున్నా కోల్‌కతా పోలీసు కమిషనర్ ఎందుకు నిరాకరిస్తున్నారు?

02/02/2019 - 23:53

మహాభారత యుద్ధం ఫలితంగా పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం నశించిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ద్రౌపదీ వస్త్రాపహరణ ఉదంతం. నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపది పాలిట చేసిన దుర్మార్గం. ఇలాంటి సంఘటనలు ఆధునిక భారతంలో కూడా జరిగాయి. తమిళనాడు శాసనసభలో గతంలో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను డీఎంకే పార్టీ వారు వస్త్రాపహరణం చేశారు. ఫలితంగా డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జైలులో చిప్పకూడు తినవలసి వచ్చింది.

02/01/2019 - 21:56

ఎక్కడో మంగళూరులో కాథలిక్ క్రైస్తవ కుటుం బంలో పుట్టి, క్రైస్తవ ఫాదర్ కావాలని ఆయన భావించాడు. నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నిధులను సేకరించే నేతగా, ముంబైలో తిరుగులేని నాయకుడిగా పేరొందిన ఎస్కే పాటిల్‌ను 1967 ఎన్నికల్లో ఓడించి జాతీయ స్థాయిలో ఆయన సంచలనం సృష్టించాడు. అతనే విలక్షణమైన రాజకీయ నేత- జార్జి ఫెర్నాండెజ్.

01/31/2019 - 00:25

ప్రియాంకా వాద్రా రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర నిర్వహిస్తారన్న విషయం తేటతెల్లమైంది. ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. ఒకప్పుడు నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారంటే పెద్ద చర్చ జరిగేది. అయితే, ఇపుడు ప్రియాంక రాజకీయ రంగప్రవేశంపై ప్రజలు ఆసక్తిని కనపరచడం లేదు. ఎవరైతే ఏంటి?

01/30/2019 - 02:06

హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, దాడులు జరిగినపుడు తక్షణం స్పందించే తత్వం అంతకంటే తీవ్రమైన సంఘటనలు జరిగినపుడు మాత్రం చాలామందిలో ఉండటం లేదు. అదేదో మనకు పట్టనట్టు వ్యవహరిస్తుంటాం. స్వల్ప విషయాల్లో పట్టింపు లేకపోవడం మిగిలిన విషయాల్లో ఉదాసీనతకు దారితీస్తుంది. దీనికి కారణం ఆయా అంశాలపై సమగ్ర అవగాహన లేదా ఆసక్తి లేకపోవడమే.

01/27/2019 - 01:55

‘మీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఎక్కడికి వెళ్లాడు?’ అంటూ మీడియా ప్రతినిధులంతా కలసి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ (కాంగ్రెస్)ను ప్రశ్నించారు.
‘సకుటుంబంగా ఓ పెళ్లి వేడుకకు వెళ్లాడు.’
‘ఆ పెళ్లి మండపం ఎక్కడ ఉంది?’
‘ఎక్కడో ఉంది.. అది ఆయన వ్యక్తిగత కార్యక్రమం.’

Pages