S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/23/2019 - 00:59

‘ఆకాశంలోనే కాదు, అంతరిక్షంలోనూ సగం మేమే..’ అంటూ అమెరికా మహిళా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. ‘నాసా’కు చెందిన క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ ఇటీవల ‘స్పేస్‌వాక్’చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వారి ధైర్యాన్ని, నైపుణ్యాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనియాడారు. ఇది మార్నింగ్‌వాక్ లాంటిది కాదు. ఆషామాషీ నడక అంతకన్నా కాదు..

10/22/2019 - 01:36

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులు గట్టెక్కేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వాలు గుర్తించలేక పోతున్నాయి. రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచేందుకు రాయితీల విస్తృతి పెరుగుతున్నా వారి కష్టాలు తీరడం లేదు. జనాభాలో అత్యధిక శాతం మంది వ్యవసాయానే్న జీవనాధారంగా బతుకులీడుస్తున్న దేశం మనది. రైతుల మనుగడకు, వారి కష్టాలు తీరేందుకు ‘ఉపాయం చెప్పవయ్యా అంటే ఉరితాడు తెచ్చుకో అన్నట్లు’గా ఉన్నాయి మన పాలకుల విధానాలు.

10/20/2019 - 00:10

ప్రపంచంలో పేదరికాన్ని తొలగించేందుకు చేసిన ప్రతిపాదనలకు గాను ప్రవాస భారతీయుడైన అభిజిత్ బెనర్జీకి, ఆయన భార్య ఎస్తేర్ డుప్లో, మరో ఆర్థికవేత్త మైఖేల్ క్రెమర్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక నోబెల్ బహుమతిని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైనె్సస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ‘మేధ’కు మరోసారి నోబెల్ దక్కడం గర్వకారణం. అందులోనూ కీలకమైన సంక్లిష్ట ఆర్థిక రంగంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందడం అపురూపం.

10/18/2019 - 01:28

తెలంగాణ ప్రాంతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రగిలిపోతున్నది. ‘ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోవడం లేదు.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు వుంది కదా.. సమ్మెచేసే హక్కు మా జన్మహక్కు కదా! న్యాయమైన డిమాండ్లు తీర్చాలని సమ్మెకు దిగితే.. మొత్తం ఉద్యోగులను తొలగించామనడం చూస్తుంటే.. నియంతల రాజ్యం కన్నా భయంకరంగా పరిస్థితులు తయారయ్యాయి..’అని ఆర్టీసీ కార్మికులు విలపిస్తున్నారు.

10/15/2019 - 00:15

సూర్యాపేట, అక్టోబర్ 14: ఆర్టీసీ సమ్మెపై రాష్టమ్రంత్రులు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మంత్రుల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

10/15/2019 - 00:03

ఏం తిన్నామో అనేదే కాదు, ఎలా తిన్నామనేది కూడా ముఖ్యమే. ఎంత మంచి ఆహారమైనా చేతులు పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఏటా అక్టోబరు 15న విశ్వవ్యాప్తంగా చేతుల పరిశుభ్రత దినోత్సవం పాటిస్తారు. మన చేతులు ఎన్నో బాక్టీరియాలు, వైరస్‌లకు నిలయం. మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ రకరకాల వస్తువులను తాకుతుంటాం.

10/13/2019 - 02:12

అలలను చీల్చుకుని మోసుకెళ్తున్న పడవ ఓ నీటి జ్ఞాపకం
మనం అలసిపోవాలే తప్ప పడవ అలసిపోదు
ఆకాశాన్ని నెత్తికెత్తుకున్న కొండలా
చెట్లను అమాంతం మోసుకెళ్తున్న నేలలా ఉంది పడవ

10/13/2019 - 02:11

ఈసారి దసరా సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజులు సెలవులు ఇచ్చినా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సంతోషం లేకుండాపోయింది. ఓవైపు విష జ్వరాలు విజృంభించాయి, మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. విష జ్వరాలు వ్యాపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాధిగ్రస్తులతో కిక్కిరిసిపోయాయి.

10/11/2019 - 01:06

నేనెప్పుడో
నా వాళ్ళని వదిలేసా
మీకోసం
మీవాళ్ళ కోసం

మీ గమ్యమే
నా గమ్యమైంది

మీరు ఏ రాత్రి ఎక్కడ
పడకేస్తారో
అక్కడే నా పడక
నేనేమో నా వాహనంలో
మీరేమో మీ ఇంట్లోనో
మీ బంధువుల ఇంట్లోనో

నా మార్గం
నా గమ్యం
నా చేతుల్లో లేదు
నా వాహనమే
నాకూ నా వాళ్లకు
ఆహార ప్రదాయిని

10/08/2019 - 01:57

ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ అనేక హామీలను గుప్పించడం సహజం. అలాగే వైసీపీ కూడా ‘నవ రత్నాలు’ అంటూ ముందుకొచ్చింది. వారి మ్యానిఫెస్టోలో గ్రామ సచివాలయాలు అనే అంశం మిగతావారికంటే భిన్నంగా ఆసక్తికరంగా ఉండటం ఒక ప్రత్యేకత.

Pages