S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/27/2019 - 01:55

సూర్యరథంమీది ఊరేగుతున్న నా ఆత్మ
పరంపరాగత తరంగ శీకరోద్భాసిత మిథున ప్రపంచమై
తనని తాను అలంకరించుకున్న వాస్తవం
వర్ణమిశ్ర ఫలకంమీద
రేయింబవళ్ళనే రెండక్షరాలను దిద్దుకుంటూ
సంధ్యను మండిగం మీద నిలుపుతుంది
ఈశాన్నాగేయాల మధ్య తారిష తరంగాల మీద తేలి
మానవ చరిత్రకు మేలుకొలుపు పాటను వ్రాస్తున్న జ్యోతిషాంపతిని
చూడలేని వాడు ప్రభాతాన్ని ప్రాంతీయ ద్వేషం చేసి

11/27/2019 - 00:54

‘చంద్రవౌళి స్పీకింగ్... రుూజ్ జ్వాలా దేర్...?’- అని ఫోన్లో కంచు గొంతుకతో అడిగే మాజీ ఐఏఎస్ అధికారి కొద్దిరోజుల క్రితం శాశ్వతంగా కన్నుమూశారు. ఎనభై రెండేళ్లు జీవించిన ఆ బడుగు జన బాంధవుడు తన చివరిరోజుల్లో అనారోగ్యానికి గురైనందున ఆయనను కలవడానికి వెళ్లే నాలాంటి సన్నిహితులతో ఎక్కువగా సంభాషించలేకపోయేవారు.

11/26/2019 - 23:32

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన భారత రాజ్యాంగం పార్లమెంటులో ఆమోదం పొంది నేటికి సరిగ్గా డెబ్బయి ఏళ్ళు పూర్తయ్యాయి. దేశానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్న రాజ్యాంగం ఇప్పుడు వృద్ధమూర్తి. ఇంట్లో వృద్ధుల్ని ఆశ్రమంలో చేర్పించి, వారి పుట్టినరోజు నాడు కేక్ కోసి గౌరవం తెలిపే తీరులోనే రాజ్యాంగం ప్రస్తుతం పాలకవర్గాలతో గౌరవం పొందడం బాధాకరం.

11/24/2019 - 02:03

నేడు భోగరాజు జయంతి
*

11/20/2019 - 02:10

గత నెల పదిహేను రోజులుగా జరుగుతున్న ఆర్.టి.సి. సమ్మె రెండు మదించిన ఆంబోతుల మధ్య యుద్ధమన్నట్టుగా కొనసాగుతుంది. ఆవులావులు కొట్లాడితే లేగల కాళ్ళిరిగినట్టు సమ్మె ఫలితమెలా ఉన్నా ఈ రెండు ఆంబోతులకేమీ కాదు. కాళ్ళిరిగి, తలలు పగిలి ఆకలి మంటల్లో మాడిపోయేది సామాన్య కార్మికులు. ఇప్పటికే నలభై మంది వరకు కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటులతో మరణించారు. అయినా ఈ ఆంబోతులు దిగిరావు.

11/19/2019 - 00:38

బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలు ముగిసాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల (బ్రిక్స్) వార్షిక సదస్సు బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో ఇటీవల ముగిసింది. ఇందులో భాగంగా జరిగిన బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచంలోనే పెట్టుబడులకు భారతదేశం ఎంతో అనుకూలమైనదని, పెట్టుబడిదారులకు స్నేహహస్తం అందిస్తోందని చెప్పారు.

11/18/2019 - 21:56

1867లో కొంతమంది కెమికల్ ఇంజనీర్లు సాధించిన విజయం అది. అప్పటికే వారు పదేళ్ళుగా పెట్రోలియం నుండి కొన్ని హైడ్రోకార్బన్ అణువులను వేరుచేసి, వాటిని ఒకదానికొకటి అతికించడం ద్వారా సన్నటి దారపు పోగులను రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు. అలా వచ్చిన దారపు పోగులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో డ్రింక్ బాటిల్స్, బార్బీ బొమ్మలు ఇంకా రకరకాల వస్తువులను తయారుచెయ్యవచ్చని ఆ ఇంజనీర్ల ఆలోచన.

11/17/2019 - 04:06

ఈఒక్క విద్యాసంవత్సరమే వందలకొద్ది పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండి మరికొన్ని వందల పాఠశాలలు మూసివేత అంచున ఉన్నాయి. సంఖ్య పడిపోవడానికి, మూసివేతకు చేరుకోవడానికి ప్రభుత్వ విధానాలు ఎంత కారణమో, ఉపాధ్యాయులలోని వృత్తి బాధ్యతా రాహిత్యం, నిబద్ధత లోపించడమూ అంతే కారణం.

11/13/2019 - 01:50

స్వ ర్గీయ కాళోజీ నారాయణరావు ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ను నేను గత పది-పదిహేనేళ్లలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! మొన్నీ మధ్య చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి తనకా పుస్తకం చదవాలని ఎనే్నళ్లగానో ఉన్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదన్నాడు. అప్పుడనిపించింది..

11/11/2019 - 23:12

‘జనాభా లెక్కల్లో పేర్కొన్నట్టు తెలుగులో సంతకం చేయగలవారందరూ చదువు వచ్చినవారే.. అని ఒప్పుకున్నా, తెలుగువారిలో చదువున్నవారు వేయింటికి డెబ్బయి ఐదుగురు మాత్రమే. అంటే వేయిమందికి 925 తెలుగువారు మాత్రమే సంతకమైనా చేయలేరు అన్నమాట.

Pages