S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/06/2019 - 02:00

అక్టోబర్ 1నాటికి చైనా విప్లవం విజయవంతమై 70 ఏళ్లు గడిచాయి. ఈ 70 ఏళ్ల వార్షికోత్సవాన్ని ప్రజలంతా జరుపుకోవాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. చైనా విప్లవం విజయవంతమైందని ఆయన ఇపుడు మరోసారి గుర్తుచేశారు.

10/02/2019 - 02:15

పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టు గాంధీజీ చిన్నతనం నుండే మన దేశ స్వాతంత్య్ర పరిరక్షణ కోసం ఎంతో కృషిచేశారు. నీతి, నిజాయితీ, సత్యం, అహింస, పరమధర్మం ఆయన ప్రధాన ఆశయాలు. సత్యం, ధర్మం, శాంతి మార్గంలో గాంధీజీ ఆదర్శ జీవితం గడిపి, అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. నిత్యం చిరునవ్వుతోనే జీవితమంతా గడిపారు.

10/02/2019 - 02:14

పరాయి పాలన చెర నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి కృషి చేసిన మహానుభావులలో మొదటగా స్మరించదగినవారు మహాత్మాగాంధీ. సత్యం, అహింస సిద్ధాంతాలతో సామాన్య ప్రజల్లో సైతం జాతీయ భావాలను రేకెత్తించి బ్రిటీష్ వారి గుండెల్లో గుబులు పుట్టించిన దృఢ చిత్తుడు ఆయన. బ్రిటీష్ పాలకుల నియంతృత్వ పాలనకు కళ్ళెం వేసిన మహామేధావి. వివేకం, వివేచనతో లక్ష్యసాధనలో విజయం సాధించిన ధీశాలి గాంధీజీ.

10/02/2019 - 02:12

బాపూజీ.. మీ ‘స్వప్నసౌధం’ బీటలువారింది
మీ అహింస ‘ఆయుధం’ తుప్పుపట్టింది
మీ ఆశయ బాటన ‘పల్లేర్లు’ మొలిచినయ్
మీ స్వతంత్ర భారతం ‘దోపిడీ’ పాలయింది

ఇనే్నళ్లు గడిచినా...
మీ కలలు ‘కల్లలే’ అయినాయ్
దేశమాత కంట ‘కన్నీళ్లే’ మిగిలినయ్

అదేంటో.. ప్రతి ఏటా...
మీ జయంతులు, వర్ధంతులు
మొక్కుబడిగా జరుపుతున్నారు
మర్నాడే.. ఎవరికీ పట్టనట్టు వెళ్తున్నారు

10/01/2019 - 00:03

చాలామందిమి హిందీ భాషను ఇష్టపడతాం. హిందీ సినిమాలు చూస్తాం. హిందీ పాటలు వింటాం. మరి హిందీనెందుకు జాతీయ భాషగా అంగీకరించం? ఈ సందేహం చాలామందిని వదలడం లేదు. జాతీయ భాషగా హిందీ వద్దనే వాదనకి సూత్రప్రాయంగా అవునన్నా, సంపూర్ణంగా నిస్సందేహంగా మద్దతు పలకడం లేదు. జాతీయ భాష వాదన తెచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన వాదన విడిచిపెట్టి, అబ్బే అలా అనలేదు..

09/29/2019 - 02:35

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ‘నోబెల్’ శాంతి పురస్కార గ్రహీత, పాకిస్తాన్ సాహస యువతి మలాలా యూసఫ్‌జియా మరోసారి ప్రధాన వార్తల్లోకి వచ్చింది. 370వ అధికరణాన్ని రద్దుచేయడం అన్నది పాకిస్తాన్‌కు జీర్ణించుకోలేని విషయం అన్న సంగతి అందరికీ తెలిసిందే.

09/27/2019 - 21:47

సమాజానికి, సాహిత్యానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉం టుంది. సమాజంలో నెలకొని ఉన్న సమస్యలే సాహిత్యరూపంలో ప్రతిబింబిస్తాయి. వివిధ రకాల అణిచివేతల వల్ల, సంఘర్షణల వల్ల సమాజంలో ఉద్యమాలు ప్రారంభవౌతాయి. ఉద్యమాల ప్రభావం సాహిత్యంపైన, సాహిత్య ప్రభావం ఉద్యమాలపైన తప్పనిసరిగా పడుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం, హరిజనోద్ధరణ ఉద్యమం ఇందుకు నిదర్శనాలు.

09/25/2019 - 02:55

ఆదివారం.. అమెరికాలోని హ్యూస్టన్ నగరం.. తెలుగువారితో పాటు సుమారు 50వేల మందికి పైగా ప్రవాస భారతీయుల నోట మార్మోగిన ‘హౌడీ మోడీ’ నినాదం. ఉత్తేజ పూరిత మానవ హారం.. మహాద్భుత సన్నివేశం.. ప్రపంచం ముందు పెరిగిన భారత్ బలం.. వీగిన విష ప్రచారం.. అంతిమంగా ఇదొక కొత్త అధ్యాయం..

09/24/2019 - 03:28

ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యం అందించాలని జాతీయ ఆరోగ్య విధానాన్ని 2017లో కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంపూర్ణ ఆరోగ్య ఫలాలను అందించడమే ఈ విధానం లక్ష్యం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అత్యాధునిక వైద్య సేవలందించడమే జాతీయ ఆరోగ్య విధానం సంకల్పం.

09/22/2019 - 03:45

భారతీయుల జీవనానికి ఆధ్యాత్మికత ఆలంబన. మన సమాజ అస్థిత్వానికి ఆధారం వేదాలు. వేద నిర్దేశానుసారం మన సమాజ జీవనం వికసించింది. వేదం అంటే తెలియబడినది అని అర్థం. విద్య అంటే తెలుసుకోదగినది అని అర్థం. భారతీయ వాంజ్ఞయంలో మొదటిసారిగా ఉపనిషత్తులు విద్య గురించి చెప్పాయి. ఈ ఉపనిషత్తులలో 34 రకాల విద్యలను గురించిన చర్చ ఉంది. చాందోగ్యోపనిషత్తులో ప్రాణవిద్య గురించి ప్రస్తావన ఉంది.

Pages