S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/23/2019 - 19:30

మనిషిగా ఎదిగి
ఉడుపథంలోకి అడుగుపెట్టాలని
శిథిల శిశిరాంగాలమీద సుమ సమూహాలు చల్లాలని
పరిణామ సత్యాలన్ని అక్షరాలుగా మార్చి
అందరికీ అందించాలని
కలల్ని
అలల్ని
ఏకంచేసి ఏక్‌తారను మీటుతున్నాను..
అరణ్యాల అంతశే్చతనలో ఋతుఘోషలు
ఈ దేశపు హృదయస్పందనగా
నా బాహువుల్ని ఆక్రమించాయి
ఒక్కక్షణ ప్రభని- అనుక్షణ

08/22/2019 - 19:15

చిన్ని కృష్ణుడు చిద్విలాసుడు చిన్మయుడు చిన్ననాడు చేయనికొంటె పనులులేవు. ప్రతిదానిలోను అంతో ఇంతో మర్మం ఉండేది. మర్మజ్ఞులు మర్మం తెలుసుకొని ఆనంద పరవశులయ్యేవారు. పామర జనం కృష్ణలీలలన్నిటినీ ఏకరువు పెట్టుకుని తన్మయత్వం చెంది తమఇంట నడిచే చిన్నారులే శ్రీకృష్ణులని తాద్యాత్మం చెందేవారు. అట్లాంటి వాటిల్లో ..

08/22/2019 - 19:12

భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం ఎనె్నన్నో మహిమలు చూపే మహావిష్ణువు కోసం ఒకానొక కాలంలో పృశ్నిసుతపుడు అనే దంపతులు ఇరువురు తపస్సు చేసారు. విష్ణువు వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాళ్లు ‘నీవే మాకు పుత్రుడివై జన్మించు’ అని అర్థించారు. మాకు లభించిన ఏ జన్మలో నైనా నీవే మాకు పుత్రుడివై పుట్టుతూ మా పుణ్యపాపనాశనం తర్వాత నీ సాయుజ్యాన్ని మాకివ్వలసిందని ప్రార్థించారు.

08/21/2019 - 18:54

‘‘ఆంధ్ర వాల్మీకి’’ హస్తంబునందు నిలిచి
రూప్యములు వేనవేలుగా ప్రోగుచేసి
దమ్మిడైనను దానిలో దాచికొనక
ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయ చిప్ప.

08/21/2019 - 18:52

నిరీక్షణ ఏదీ కూడా నిస్తేజమైన నిర్వీర్యమైన
భావ ప్రకటన కాదు
అలసిపోయిన ప్రపంచం
తుఫానుల గర్భవాసానపుట్టినవాడికోసం
ఎదురుచూట్టమంటే
క్షణాలన్నీ
ఆత్మశిక్షణలో అభ్యం జనించటమే..
బాధలు
అశ్రువుల్ని బంధించవు
ఐతిహాసిక క్షేత్రాల్లో కర్తవ్యాన్ని ప్రవహింపజేస్తాయి
ఈ ఝురీ తరంగాలే నన్నిపుడు
ఝంఝామరుత్సంహితలోకి నెట్టేశాయి

08/20/2019 - 19:20

కలియుగం దైవం వేంకటేశ్వరుడు. ఈ వేంకటనాథుని దర్శించని వారు ఎవరూ ఉండరు. గోవిందా అని ఆర్తితో పిలిస్తే చాలు పరుగెత్తుకుని వచ్చి ఆపదలను తీర్చి ఆపద్బాంధవుడుగా పేరిన్నకగన్నవాడు వేంకటేశ్వరుడు. స్వామి కలియుగంలో మానవులందరితో చక్కగా మాట్లాడేవాడని అంటారు. కాని కలిప్రభావం ఎక్కువౌతున్న తరుణంలో పరమాత్మ అయిన పరంధాముడు విగ్రహరూపి యై స్వరాన్ని రక్షిస్తూ నిల్చున్నాడు.

08/20/2019 - 19:19

ప్రాచీవృత్తంలో
ప్రభాతం పసిదిగా వున్నపుడు
నేను
సనాతన గంగలో మునుక స్నానం చేస్తున్నాను..
సంధ్యాకాల సౌందర్యంలో భూమి
మునిగిపోతున్న క్షణాల్ని
ఏరుకుపోవటానికొచ్చింది
నీలినీడలు మెదిలే తన విశాల నేత్రాలు విప్పి
రాత్రి...
నిశి నిశ్శబ్దము పెనవేసుకున్న పరిసరాలలో
నక్షత్రాలను కప్పేసిన చెట్లు
పొడవాటి పొగనీడలై మిణగురుల్ని పూస్తున్నాయి

08/19/2019 - 19:14

శాశ్వతమైన శబ్దం
శతాబ్దపు పొలిమేరల్లో
అర్థం మార్చుకుంటున్న
ఆధునిక నాగరికతకు
లొంగిపోవటాన్ని చూస్తున్నాను..

08/19/2019 - 19:12

మనిషి ఆశానిరాశల మధ్య జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి ఆశాజీవే. గొప్ప సంపన్నుడైనా, బీదరికంలో బతుకుతున్నా సరే ఏదో ఒక ఆశ మనిషికి ఉంటుంది. ఆశను సాధించాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తారు.

08/18/2019 - 22:18

అట్టివారిని గుర్తుపట్టటం కష్టంగాదా?’’అని మనసులో తర్కించుకొనుచుండగా, అదే సమయంలో ఋతుపర్ణుడు తన భుజంనుండి ‘ఉత్తరీయం’ జారి క్రిందపడినట్లు చూచాడు. వెనువెంటనే ఋతుపర్ణుడు
‘‘బాహుకా! రథం ఇంచుక ఆపుము! వార్‌ష్ణేయుడు దిగి నేలపైబడ్డ నా ఉత్తరీయం తెస్తాడు’’ అని అన్నాడు. అందుకు

Pages