S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/28/2019 - 19:00

వాయు శిల్పి చేతుల్లోబడి ఆకారాలు అమర్చుకుంటున్న
మబ్బులోంచి ఓ చినుకు
మొక్క కొమ్మలో పూవై కూర్చుంది
తుమ్మెదలై తిరిగే జాతి పారుపత్తేన్ని
ప్రతిఘటించలేక
అది మకరందమనే మధుర విషాదాన్ని నింపుకొంది
గుండెను మిళిందం కొల్లగొడుతున్నా
తావి ప్రాంతాన్ని తరంగితం చేస్తూనే వుంది
తూర్పు ప్రభాతపు తూగుటుయ్యాలలో
శబ్ద సౌష్టవమై ఊగుతున్నప్పుడు

08/28/2019 - 18:58

సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయ. మంచివారిని అందరూ పొగుడు తుంటారు. మంచివారికి మంచి జరగాలని సమాజం మొత్తం భావిస్తుంది. చెడు తలంపుల తో ఉండేవాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉండే వాళ్లు ఉంటే వారి నాశనం ఎపుడు జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తుంటారు. మంచివారు ఎపుడూ తన గురించి గాక నలుగురూ బాగుండాలని కోరుకుంటారు.

08/27/2019 - 19:33

స్వరూప స్కంధమైన ఉపనిషద్వాక్యంలా
ఆకాశ నీలిమాంతఃకరణ కారుణ్య సింధువై
నూతన యుగ ద్వారాలు చేరుకుంది..
భౌతికమైన ఆక్షేపణకు లొంగిన ఆత్మని
అభిషేకించటానికి- ఆవిష్కరించటానికి..
‘‘ప్రభు మేని పైగాలి పైసోకినంతనే
పాషాణమొకటికి స్పర్శ వచ్చె
ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక్కదానికి చెవులు కలిగె
ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన

08/27/2019 - 19:28

కోరికలే దుఃఖానికి కారణం అన్నారు బుద్ధుడు. నిజమే. కానీ కోరికలు లేని మనిషి ఎవరూ ఉండరని విజ్ఞులు చెప్తారు. ఈ కోరికలనేవి దేవతలు కూడా ఉంటాయి అనేవారు ఉన్నారు. ఎందుకంటే దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పి మరీ మహావిష్ణువు అవతరిస్తుంటాడు. ఒకవిధంగా చూస్తే అది ఆయన కోరికే కదా.

08/27/2019 - 19:27

అనఘాష్టమి శ్రీకృష్ణజన్మాష్టముల దినం శివశక్తుల సమ్మేళన సంరంభం
అర్థరాత్రి నిశీదవ్యాప్తి అవిద్యల అదృశ్యం కోటి కోడి ఆదిత్యుల వెలుపల ఆవిర్భావం
అష్టమినాటి అర్కుని సింహరాశిలోవైష్ణవ రోహిణీ నక్షత్ర సమయముంలో జననం
అనంతుని రాసక్రీడల రసమయ రహస్యం రాధేశ్యాం అంతర్యామితో తాదాత్మ్యం

08/26/2019 - 20:05

ఆకాశపు మండువా లోగిలిక్రింద
సూర్య స్నానం చేసే దేశాల గుండెలమీద
ఎత్తుగా పెరిగి
కలని
ప్రపంచంగా మార్చుకోవటం కోసం
పరిమళవౌతుంది
మదోన్మత్త మారుతాలు రెక్కలు సారించిన విహంగాలై
తవిషా తరంగాలమీద వాలాయి
ఆకాశం మబ్బు పట్టింది
చినుకు ఉయ్యాలలో కొమ్మకు పుట్టిన
మొగ్గనిసువులా
సాగుతున్న తరార్థ సంకేతమైంది..
**

08/26/2019 - 20:00

ఋగ్వేదమునందు పాదబద్ధములగు మంత్రములకు ‘ఋక్కులు’ అని పేరు. ఒక్కొక్క ఋక్కు ఒక మంత్రము. కొన్ని ఋక్కుల సమాహారాన్ని ‘సూక్తం’ అంటారు. ఋక్‌సంహితలో 10,170 ఋక్కులు వున్నాయి. 1028 సూక్తులు వున్నాయి. వీటిని 10 మండలాలుగా 8 అష్టకాలుగా వర్గీకరింపమడినవి.

08/25/2019 - 22:19

పరిత్యాగంలో ఉదయించే అందంగా
నా కోర్కెల శిఖరానె్నక్కిన దేవాలయమై
కనిపించిందివాళ
స్వేద పరిమళాల్లో ముఖరిస్తున్న శ్రామిక నాదం
ఎన్ని పూప
రాగాల్ని వినిపిస్తోందో..!
వౌనంగా వున్నంత మాత్రాన
చెట్టు మాట్లాడదనుకుంటే అది అవిద్యే
తపశ్శక్తితో తరళ సౌందర్యాన్ని
ఋతువుకందిస్తుంది
గాలి పెదవులు మెల్లిగా సోకితే
నిద్రలో గూడ
పూలు నవ్వుతాయి

08/25/2019 - 22:16

మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు. శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం. ఉపనిషత్తులో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు.

08/25/2019 - 22:14

హిందూమతానుయాయులందరూ నుదుటి యందు విభూతి, చందనం, కుంకుమగాని ధరించటం సంప్రదాయం. వీటిల్లో ఏది ధరించినా వారు హిందువులే. విభూతిధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది. అలాగే గోపీచందనధారణ విష్ణుమూర్తిని స్ఫురింపజేస్తాయి.

Pages