S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/24/2019 - 22:52

సృష్టిలోని అన్ని జీవరాసులలో మానవజన్మ అత్యుత్తమమైనది. గత జన్మల పుణ్యఫలంవల్లనే జీవి మానవుడిగా జన్మిస్తాడు. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి తన మనస్సును అదుపులో ఉంచుకొని ఏకాగ్రతతో దైవాన్ని ప్రార్థిస్తూ తనలోని మనోనేత్రంతో ఆ దైవాన్ని చూడగలిగితే మానవుడు మహనీయుడు కాగలడు. ఇది అంత సులభం కాదు.

06/20/2019 - 19:53

యోగం అన్నమాట పవిత్రమైంది. అత్యంత శక్తివంతమైంది. ‘ఎవరైనా ఏదైనా వస్తుందనుకొన్నది రాలేదని బాధపడుతుంటే నీకా యోగం ఉంటే తప్పక వస్తుందిలే అని అంటుంటారు. యోగం అన్నమాట ఎన్నో అర్థాలనిస్తుంది. ‘యోగం’ అన్న మాటకే ధ్యానం, ఉపాయం, కూడిక, కూర్పు, ప్రయత్నం, కవచం, అపూర్వవస్తుప్రాప్తి అనే అర్థాలున్నాయి.

06/18/2019 - 22:52

విధాత 84 లక్షల జీవరాశులను సృష్టించిన ఈ సృష్టిలో మానవ జన్మ మిక్కిలి శ్రేష్ఠమైనది. 84 లక్షల జీవరాశులనగా ఆవు ఒక్కటి, ఎద్దు ఒకటి, జింక ఒకటి, గొర్రె ఒకటి, చీమ ఒకటి మొదలైనవి. వీటిలో ఒక్కొక్క జంతువు క్రింద లక్షలాది జంతువులుద్భవిస్తాయి. ఇప్పటి మానవుని క్రింద పృధ్విలో 750 కోట్ల మానవులు (సుమారు) ఉన్నారు.

06/18/2019 - 22:46

పల్లవి లాలి లలితాబాల లాలి శ్రీ లీల
లాలి లాలిత విశ్వ లీలా విలోల
శ్రీమణి ద్వీపాన జెలువారు తల్లీ!
సామ్రాజ్యముల నొసగు శ్రీతకల్పవల్లీ!
ఏ మణుల మంచంబు నేర్పరుపలేను
నా మనసు మంచాన శయనించ వమ్మా

06/17/2019 - 19:07

శిరిడీ సాయ బాబా అపుడపుడు తన దగ్గరకు వచ్చిన వారికి చెప్పిన నీతులే ఏకాదశ సూత్రాలు. వీటిని ప్రతిరోజు ఓసారి మనసారా మననం చేసుకొంటే బాబా తత్వం అర్థమవుతుంది. అపుడే మనిషిలోని అంతర్యామిని అనే్వషించే నేర్పు కలుగు తుంది. భిక్షాటనలో బాబా తెచ్చిన భిక్షను అంతా కలిపి ముందు కాస్త పక్షులకు, తన దగ్గరే ఉండే నల్లకుక్కకు, చీమలకు దోమలకు పెట్టేవాడు. ఆ తరువాత భక్తులకు పెట్టేవాడు.

06/16/2019 - 22:30

పేదవరాని గానరు పెద్దవారు
కాస్త దయఁ జూపరేమి రుూ కాలమందు
బండబారిన మనసులు నిండె జగతిఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం:డబ్బున్న పెద్దవారి దృష్టికి పేదవారు రారు. కాస్తంతైనా వారిపైన జాలి చూపరు. బండబారిన మనసులుకల్గిన మనుషులతో ఈ జగమంతా నిండిపోతోంది చూడవయ్య ఓ సూర్యదేవ!
తరతరాలకు సరిపడు ధనముగూడ
బెట్టి యుం దృప్తిచెందక మట్టిఁ గలియు

06/16/2019 - 22:23

శా. నీ మాయామయమైన రుూ ప్రకృతినే నిత్యమ్ముగా నెంచి చే
తో మూఢత్వము చేత కొందరును యేదోలెమ్ము పోనిమ్ముగా
నీ మాకెందుకటంచు కొందరును తల్లీ కర్మబంధమ్ములన్
తామే యాత్మకు అల్లుకొందురుగదా తన్మూలమున్ గానకన్

06/14/2019 - 20:01

వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే అయినప్పటికి, ప్రజలు మరిచి పోయిన అంశాలను తిరిగి ఉటంకిస్తూ, బౌద్ధమతంలోని మంచి సిద్ధాంతాలను చేర్చి, అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు.

06/13/2019 - 18:40

శాఖోపశాలుగా చీలిపోయి అస్తవ్యస్తంగా వున్న హిందూమతాన్ని ఒక త్రాటిమీదకు తెచ్చి వైదిక ధర్మాన్ని ఆదిశంకరులు పునరుజ్జీవింప జేశారు. శతాబ్దాలపాటు వైదిక ధర్మం అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచేటట్లు చేయడానికి వీలుగా నాలుగు దిక్కులా ఆమ్నాయాలను స్థాపించి భారతదేశం ప్రపంచానికి తలమానికంగా ఉండేటట్లు శ్రమించి విజయం సాధించారు. అద్వైత సిద్ధాంతమే లోకకల్యాణానికి దిక్సూచియని నిరూపించారు.

06/12/2019 - 19:52

చిత్తమందున స్వాస్థ్యమ్ము విత్తుమాత్ర
మైన లేదాయె సంసార మనెడి సాలి
గూడునంజిక్కుకుంటినే తోడు నీవె
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

Pages