S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/31/2019 - 22:11

భారతీయ ప్రాచీన ఆర్ష విద్యలకు నెలవై, హైందవ సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, వరదాయిగా, భక్తిముక్తి ప్రదాయినిగా తెలుగునేలపై వాసికెక్కిన గోదావరీ తీరస్థ పవిత్ర తీర్థరాజం ధర్మపురి క్షేత్రంలో పురాణ ప్రవచన కార్యక్రమం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

05/31/2019 - 22:07

గో సముదాయమొక్క పరిగోష్ఠము జూచిన జాలునింక స
భ్యాసవశమ్ము వోలె సమయమ్మును తప్పక వచ్చి చేదుగా
నీ సరి మానవుండు తన మీమము నింత తలంప డేలకో
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

05/31/2019 - 22:01

అసుర వౌతమోగుణ మునంతకు నంతకు లోగొనంగ హృ
ద్వాసము జేయు, దాని నడపందగు యత్నము జేయు రాజసం
బీసమఘర్షణమ్ము వికసింపగ నీయదు శుద్ధ సత్వమున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

05/19/2019 - 22:13

చూసెడు రుూ ప్రపంచ గతి చూసిన చందముగాదు లోపలున్
మూసిన వింతలేవొ యవి ముందర నిల్చుని మోసగించెడున్
చేసెడు రీతి యొక్కటియు జెప్పెడు నీతులు తద్విరుద్దముల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

05/17/2019 - 22:54

తే.గీ. చేయలనేయ్య నిత్యాభిషేకములను
తిరగ లేనయ్య నీ దివ్య గిరుల చుట్టు
ఆత్మలో ఁ జేతు నీ జపమదియుఁ గనుమ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నిత్యాభిషేకాలను చేయలేను. మహత్తరమైన నీ గిరుల చుట్టూ తిరుగలేను. విడువక మనస్సులోనే నీ నామ స్మరణ చేస్తాను స్వామీ.
తే.గీ. నమక చమకాలు వల్లింప నలవికాదు
లింగమూర్తివి నిన్ను గాలింగనంబుఁ

05/17/2019 - 22:53

రంజాన్ మాసం అనగానే పవిత్రమైన భావాలు అంకురిస్తాయి. ఈ మాసం నిండా దానాలు, ధర్మాలు చేస్తుంటారు. అల్లాను నమ్మేవారంతా ఉపవాసం ఉంటూఉంటారు. ఉపవాస కాలంలో లేనివారికి తమకు చేతనైనంత దానం చేసి వారికి ఎంతో తోడ్పాటును ఇస్తారు. ఈ మాసం 30 రోజులు గడిచిన వెంటనే షవ్వాల్ మాసం ఆరంభవౌతుంది. ఈ షవ్వాల్ ప్రారంభమైన రోజునే ఈదుల్ ఫిత్ అన్నమాట. అంటే ఇది ముస్లిం సోదరులకు అతి ముఖ్యమైన, పెద్ద పండుగు.

05/17/2019 - 22:48

దాసుడి తప్పులన్నియును దండముతో సరిగాదె గావునన్
దాసుడ నీదు పాదముల దాపుల జేరినవాడ మంత్ర వి
ద్యాసముపాసనా విధిని యర్చన జేయుదు భక్తితోడ సఏ
వాసర వాసినీ ప్రధితవాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

05/17/2019 - 04:01

సీ. సమ్మతిఁగార్యముల్ చక్కదిద్దంగను ఁ
బూనంగ వలయును పుణ్యశాలి
శోభనముం గూర్ప సూక్తులు హృదయాన
నిలపుకోవలయును నిత్యసత్య
విజయ ధ్వజము నెత్తి విలసిల్ల గావలె
స్థైర్యమాయుధమవ్వ సమర సింహ
సద్గుణ వ్యాప్తికి సతతంబుఁ బూనిక
వహియింప వలయును మహితమూర్తి

05/17/2019 - 03:57

గ్రాసము మేసి జంతువు సుఖంబుగ తృప్తిని జెందుగాని పే
రాసనుబొంది మానవుదయాచిత పెన్నిధి నంది గూడ సం
తోసము జెందలేడు గద ! దోసము, మోహము, లోభమే కదా
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ

05/15/2019 - 23:28

నా సరిబోంట్లు నేస్తములు నాకిక యెవ్వరు లేరు తల్లి యే
దో సరి లెమ్మటంచు మది దోచిన తీరున బోవజాల సా
వాసము నీవె నాకు సముపాసన నీ పద సేవలే యికన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

Pages