S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/30/2016 - 23:17

భర్త ఇచ్చిన చేయుత... అత్తింటివారు ఇచ్చిన ప్రోత్సాహం ఐదు పదులు దాటిన ఆ ఇల్లాలిని పర్వాతారోహకురాల్ని చేసింది. వాస్తవానికి నలభై ఏళ్లు దాటిన మహిళలు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కాని 46 ఏళ్ల వయసులో ఆఫ్రికాలో అతి ఎతె్తైన పర్వతమైన కిలిమంజారో శిఖరాన్ని ముద్దాడింది. ఆ మరుసటి సంవత్సరమే యూరప్‌లోని అత్యంత ఎతె్తైన పర్వతాన్ని అధిరోహించారు. తదనంతరం అంటార్కిటికాలోని ఎత్తయిన పర్వతమైన విన్సన్‌ను అధిరోహించారు.

03/29/2016 - 21:18

అందాల కాశ్మీర్‌లోయలో నవ శకానికి నాంది పలుకుతూ తొలిసారి ఓ మహిళ అధికార పగ్గాలు చేపట్టేందుకు అడుగు ముందుకు వేసింది. రాజకీయ చదరంగంలో పావులు కదిపే సత్తా తమకు మాత్రమే సొంతం అని అనుకుంటున్న ఉగ్రవాద, పురుషాధిక్యానికి సవాల్ విసురుతూ న్యాయ శాస్త్రంలోనే కాదు రాజకీయంలోనూ ఎత్తుకు పైఎత్తులు వేయగలనని నిరూపించుకునేందుకు తల పండిన రాజకీయ పార్టీలతో తలపడేందుకు సిద్ధమైన ఆ మహిళా నేతే మెహబూబా ముఫ్తీ.

03/27/2016 - 07:53

అందంగా కనిపించాలంటే ముందు మనం ఆరోగ్యంగా వుండాలి. ఆరోగ్యం లేని అందం, ఆశయం లేని ఆవేశం వ్యర్థం. ఓసారి నా వద్దకు 35 ఏళ్ల న్యాయవాది వచ్చాడు. అతనికి రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకల్లా తలపోటు మొదలవుతుంది. ఆ పోటు ఎంత ‘పంక్చువల్’గా వస్తుందంటే అది రాగానే మధ్యాహ్నం ఒంటిగంట అయిందని అతనికి అర్థమైపోతుంది. కొన్నాళ్లుగా తలపోటు భరించలేనంతగా వస్తోందని చెప్పాడు.

03/25/2016 - 20:55

ఏ విషయంలోనైనా ‘అతి’ ఎక్కువైతే అనర్థదాయకం అని పెద్దలు చెబుతుంటారు. చిన్నపిల్లల పెంపకానికి సంబంధించి కూడా ఈ మాట వర్తిస్తుంది. పిల్లల పెంపకం అన్నది తల్లిదండ్రులకు నేడు నిజంగా కత్తిమీద సాము లాంటిదే. వారిని అతిగా గారాబం చేసినా, వారి పట్ల మరీ కఠినంగా వ్యవహరించినా పేరెంట్స్ తప్పే అవుతుంది.

03/24/2016 - 23:02

ము ప్ఫై ఏళ్ళు నిండకుండానే ఉస్సురస్సురంటూ నిట్టూర్చేవారికి చక్కని స్ఫూర్తి.. కాస్త వయసు మళ్లగానే ఇంకేం చేయలేం.. మూలన కూర్చొని ముచ్చట్లాడుకోవడం తప్ప అనుకునేవారికి మార్గదర్శకురాలు ఈ బామ్మగారు. ఇంతకీ ఈ బామ్మగారు సాధించిన ఘనకార్యమేంటని అనుకుంటున్నారా..?

03/23/2016 - 23:26

మహనీయులంతా విలువైన పుస్తకాలలోని జ్ఞానాన్ని సంపాదించే తమని తాము తీర్చిదిద్దుకున్నారు. నేడు ఆధునిక టెక్నాలజీ యువతలో పుస్తక పఠనంపై మక్కువ పెంచలేకపోతుంది. ఫేస్‌బుక్‌లో పలకరింపులు, వాట్సప్‌లో భావాలను పంచుకోవటంతోనే కాలం గడిచిపోతోంది. మన చెంతనే ఉండే నేస్తం పుస్తకం. ఈ నేస్తాన్ని చేరువ చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు. దీని వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునే సత్తా మనలో కొరవడుతుంది.

03/22/2016 - 21:52

నీలి రంగులో కనిపించే ఆకాశం ఆరోజు సప్తవర్ణాలు కలబోసినట్లు చిద్విలాసం చేస్తోంది. ఆడ మగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చిందేస్తూ, కోలాటాలాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే రోజు. గౌరవసూచకంగా నిలబడిన పెద్దలను సైతం రంగుల ప్రపంచంలోకి దింపేసి చిన్నపిల్లలను చేసేస్తారు. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తూ సంతోషం వెల్లివిరుస్తోంది.

03/22/2016 - 21:50

ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో వినూత్నంగా, ఘనంగా జరుపుకుంటారు. మధురకు దగ్గరగా ఉంటే ఈ పల్లెసీమలోని పల్లెపడుచులు ఆనందంగా హోళీని ఆడటమే కాదు మగవారిని కర్రలతో కొట్టడం ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ రాధారాణి అనే దేవాలయం ఉంది. తెల్లారేపాటికి గ్రామంలోని యువతీ యువకులు ఇక్కడకు చేరుకుంటారు. ఆడవాళ్ల చేతిలో కర్రలు ఉంటాయి. ఈ మహిళలు, యువతులంతా గోవర్థన గ్రామంలోని యువకులను కర్రలతో కొడతారు.

03/22/2016 - 21:48

పశ్చిమబెంగాల్‌లో హోలీని బసంత ఉత్సవం పేరుతో నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే జానపద ఉత్సవం ఇది. శీతాకాలంలో చెట్లన్నీ పూలు, పచ్చటి ఆకులతో కళకళలాడుతుంటాయి. అలాగే పంటలు కూడా ఇళ్లకు చేరుకుంటాయి. అందుకే బసంత ఉత్సవం స్వీట్లు, రంగులు, నృత్యాల కలబోతగా నిర్వహిస్తారు. కొత్త బియ్యంతో చేసిన స్వీట్లు హోలీ రోజున బెంగాల్‌వాసులు తప్పకుండా చేస్తారు. చౌ, నట్వా లాంటి నృత్యాలు ఆడతారు.

03/22/2016 - 21:46

పంజాబ్‌లో హోలీ రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆనందపూర్ సాహిబ్‌లో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. పౌరుషానిక ప్రతీకగా నిర్వహించే మొహల్లాలోనూ రంగులు చల్లుకుంటారు. చరణ్ గంగా నదీ ప్రవాహపు సవ్వళ్లు వినిపిస్తుండగా సిక్కులు కత్తిలాంటి ఆయుధాలతో చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి.

Pages