S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/19/2018 - 21:10

ఈ మధ్యకాలంలో ఊబకాయులు ఎక్కువౌతున్నారు. కార్పోరేట్ స్కూల్స్, కాలేజీలు, ఆఫీసు వర్క్ లాంటి వాటితో లింగ భేదం లేకుండా మనుషులందరిలో ఎక్కువగా స్థూలకాయులు తయారు అవుతున్నారు. దానికి కారణం కేవలం సరైన వ్యాయామం, సరైన తిండి లేకపోవడమే. తినే తిండిలో కూడా క్రమబద్దం లేకుండా రాత్రి పొద్దుపోయన తర్వాత తినడం, జింక్ పుడ్ ఇన్‌స్టంట్ పుడ్ లాంటి వల్ల శరీరం క్రమం లేకుండా పెరిగిపోతోంది.

04/18/2018 - 22:27

** కొబ్బరిపాలను ఎప్పటినుంచో ప్రిజర్వేటివ్స్ వాడి నిల్వచేసే సంగతి అందరికీ తెలిసిందే..
ఈ పాలతో వంటలు కూడా వండుకోవడం చాలామంది కేరళీయులకు అలవాటే.. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొబ్బరినీళ్లను కూడా పొడిరూపంలో
తయారుచేస్తున్నారు.

04/17/2018 - 22:10

‘‘బాల్యంలో వేసిన పునాది భవిష్యత్‌కు, బంగారు బాట ఇస్తుంది’’. శర్వాణికి చిన్నతనంలో పద్యాలు ఎక్కువ నేర్పేవారు. కృష్ణశతకము, కుమారి శతకము, దాశరథి శతకము, వేమన శతకము, సుమతీ శతకము పద్యాలు చదివించేవారు. దీనివల్ల నాలుక బాగా తిరిగి స్పష్టత రావడమేగాక భాషపై పట్టు వచ్చి, మేథాశక్తి, పేర జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. బాల్యంలో నేర్పించినవి తొందరగా జ్ఞాపకం ఉంటాయి. తేలిగ్గా నేర్చుకుంటారు.

04/15/2018 - 22:38

విరిసీ విరియని
పసిమొగ్గలపై
కసాయి విచ్చుకత్తులా?
ఇదెక్కడి న్యాయం?
ఇప్పుడున్న చట్టాలు..
స్వార్థపరుల చేతిలో చుట్టాలా?
సవరణలు, లొసుగులు,
బ్లాక్‌మెయిలింగ్..
అరాచకులకు ఆయుధాలా!?
ఇదేనా మన భారతదేశం?
ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని
భారతమాతే శోకించేంతగా
మారిన పరిస్థితికి కారణం ఎవరు?
చట్టాలా? శిక్షలా?

04/13/2018 - 22:26

ఈ ప్రాంతంలో చాలామంది మహిళలు రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లు కావాలని కోరుకుంటారు. అందరూ ఇలానే అనుకుంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే మహిళల పరిస్థితి ఏంటి? అందుకే ముందు మహిళల ఆలోచనా విధానం మారాలి. ఇప్పుడిప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇంకా పెరగాల్సి ఉంది. మహిళలు కెరీర్‌లో ఉన్నతిని సాధించాల్సిన అవసరం ఉంది.

04/12/2018 - 22:21

జీవితంలో గెలుపు సాధించాలంటే సత్యము, ధర్మము అనే చక్రాలూ
పట్టుకోవాలి. నీతి నియమాలు ఉంటే చాలు. అన్ని రంగాల్లో విజయావకాశాలు
ఉన్నట్టుగా భావించవచ్చు. దేనినైనా పాజిటివ్ వేవ్‌లో ఆలోచించి సంతోషాన్ని , ఆనందాన్ని ఎదుటివారితో పంచుకోగలిగే నేర్పు ఉంటే చాలు...

04/11/2018 - 22:30

ఆఫీసుకు అప్పుడే వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వచ్చి కూర్చున్న మంజుల తనకు ఫోన్‌కాల్ వచ్చిందని ప్యూన్ వచ్చి చెప్పడంతో వెంటనే లేచి వెళ్లి ఫోన్ అందుకుంది. అవతలి వైపు నుంచి రమ గొంతు వినిపించింది. ‘ఏంటి ఇంత ఉదయమే ఫోన్ చేశావు. ఆఫీసుకు రావడం లేదా ’అని అంది మంజుల.

04/10/2018 - 21:08

మహిళలకు కొన్ని విద్యలు జన్మతః అబ్బుతాయి. వారికి అన్ని విద్యలూ దగ్గరుండి నేర్పించాల్సిన అవసరం లేదు. వంట చేయడం, పిల్లల్ని పెంచడం, ఇంటిని చూసుకోవడం.. వంటి విద్యలన్నీ పూర్వకాలం నుండీ మహిళలు చేస్తూనే వస్తున్నారు. వంటిల్లు తీర్చిదిద్దినంత మాత్రాన మహిళలు వ్యాపారాన్ని పరుగులు పెట్టించలేరనుకుంటే మాత్రం పొరబాటే.. అంతరిక్షం దగ్గరి నుండీ వంటింటి వరకూ మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించారు నేటి మహిళలు.

04/09/2018 - 21:16

పసిపిల్లలు దేవుళ్ళతో సమానం, బాల వాక్కు బ్రహ్మవాక్కు అని ఆర్యులు నిర్దేశించారు. అలాంటి పిల్లలకు నేడు భద్రత, భవిష్యత్, భరోసా కరువైపోయింది. ముఖ్యంగా బాలికల విషయంలో భద్రత అనేది పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. బాలికలపై శారీరక, లైంగిక, మానసిక, భావోద్వేగ సంబంధమైన హింసతోపాటు వేధింపులు పెచ్చరిల్లుతున్నాయి.

04/08/2018 - 21:45

త్యాగగుణానికి మారుపేరు భారతీయులు. ఇక్కడ పుట్టిన వారికి బాధ్యతను, త్యాగగుణాన్ని వేరొకరు నేర్పించాల్సిన అవసరంలేదన్నది వాస్తవం. దీనిని ఎవరూ నేర్పించరు ఇది పిల్లల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మరి పిల్లలు ఏమి నేర్చుకుంటారో ఏమి చేతల్లో చూపిస్తారో వారిష్టం కదా.
*

Pages