S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
పేజీలు: 237, వెల: రు.150
ప్రతులకు:
భోగరాజు ఉపేందర్‌రావు
ఇం.నెం.11-10-694/5
బురహాన్‌పురం, ఖమ్మం
94947 73969
*
ఏమీ తెలియదు
కలో నిజమో...
కలే కదా అనుకోలేం..
నిజమని కూడా.
ఒక గాలి వీచిపోతుంది.
నెమ్మదిగా బహు సుందరంగా
చెంపల్ని సుతారంగా తాకి...
కన్నులు మూతపడి కలలోకి వెళ్లిపోతాం
హాయ గొప్పదనం అది.
బహు జ్ఞానులు పలికేవి
అర్థాలు బోధపడని సత్యాలే కావొచ్చు
నీలి మేఘం తెలిపేది అనురాగమని కదా..
కమ్మని కల
కళ్ళు మూసుకుని మరీ చెప్పింది
అతడు
నిజం తుపాకీనే ధరించేవాడు
కళ్లల్లో
దయా, జాలీ కనబడకుండా
టోపీ ధరించేవాడు
ముఖంలో
నవ్వు కానరానియ్యకుండా
అడ్డంగా శిరస్త్రాణం పెట్టుకునేవాడు
తననెవరూ గమనించకుండా
చెట్లు పుట్టలలో కలిసిపోయే
బట్టలు వేసుకునేవాడు
గంటల తరబడి
ఊపిరి బిగబట్టి
స్వేదాన్నీ, రక్తాన్నీ ప్రవహించకుండా ఆపేసేవాడు
ప్రేమించడం
మరచిన మనసు
తన సహజ
గుణాన్ని వదిలి
పగతో రగిలిపోతుంది
ప్రశాంతంగా పారుతున్న
రక్తం కాస్తా
పగ పగ అంటూ
పరితపిస్తుంది
కులమతాలని
ఏకం చేసిన
ప్రేమని చూసి
కత్తి పగబట్టింది
నడిరోడ్డుపై దాని
గొంతుని తెంపివేసింది..
సప్తస్వరాల కోయల రాగమా
ఆమని గీతమా
సుమధుర నీ కుహుకుహుల
ఆలాపన విన నా
మది నిండా మరుమల్లెలు పూచే
కన్నుల్లో మెరుపులు మైమరపించే
అధరాలపై చిరునవ్వుల వర్షం కురిసే
కడలి తరంగమల్లే ఉత్సాహం పెల్లుబికే
మయూఖాలు మురిసి మెరిసే
మయూరాలు పురివిప్పి నాట్యమాడే
ముసి ముసి నవ్వులతో భానుడే ఎరుపెక్కె
తెల్లని వెండిమబ్బు
నురగలు తరగలై ఇలకు జారె
ఇదంతా మామూలే
అలవాటుగా వింటూన్న, కంటూన్న
విషయాలన్నీ మామూలే
ఉదయం వార్తతో ఒకింత ఉలిక్కిపడ్డానే్నను
వింటూండటం మామూలే అయనా
విస్ఫోటక విషయం హృదయ విదారకం.
ఎగిరే పక్షికి తెలుసు
నింగిలోని సౌఖ్యం
ఎంతగా అంబరాన్ని చుంబిస్తుందో
నీటిలోని చేపకు తెలుసు
నీళ్లలోన ఊపిరి
ఎంత చక్కగా నిలబడుతుందో
మట్టిలోని మొక్కకు తెలుసు
మట్టికున్న పట్టు
ఎదగడానికి ఎంతగా ఉపకరిస్తుందో
అడవిలోని జంతువుకు తెలుసు
వన విహారం
తన నైజాన్ని ఎంతగా తృప్తిపరుస్తుందో
పద్యాలు మాలగా అల్లితే
చక్కని కావ్యం ప్రత్యక్షం
కవిత్వానికి ప్రాణం పోస్తే
మది అంతా సుగంధ పరిమళం
కథగా కదిలితే
కనుల చెమరింపు తథ్యం
నవలై ప్రతిబింబిస్తే
జీవిత పాఠం సాక్షాత్కారం
నాటిక సంభాషణలు పండితే
మనుషుల్లో మార్పు అనివార్యం
గజల్గా ఉదయస్తే
పదపదంలో ప్రేమ సందేశం
అసలు తెలుగంటేనే
అందమైన సాహిత్య విన్యాసం
రంగురంగుల బొమ్మల కోసం
పసికూనలు ముచ్చటపడతారు
చేతికందితే మురిపెంగా స్పృశిస్తారు
కేరింతలు కొడతారు
అరిగపూడి పూర్ణచంద్రరావు స్మారకార్థం లయన్ డా. అరిగపూడి విజయకుమార్ సౌజన్యంతో ‘మల్లెతీగ’ కథల పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి రొటీన్ కథలకు భిన్నంగా మన సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని చక్కటి శిల్పం, కథనాలతో తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే కథల్ని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.