S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/22/2018 - 06:37

బొట్టుబొట్టుగా కారుతోంది నెత్తురు
ఆ వస్త్రం రుధిర నదిలో ముద్దయ్య
పాదాల మీదుగా లోహ చెప్పుల మీదుగా
రక్త బిందువులను నేలపైకి రాలుస్తోంది

10/22/2018 - 06:34

కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ, యానాం సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి ప్రతి ఏటా ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఎంపికయ్యారు. అక్టోబరు 28న సా. 5 గంటలకు యానాంలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో శ్రీకాంతశర్మకు పదివేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

10/15/2018 - 07:08

నీ చూపు ఇంకా విస్తృతం కావాలి
ఎప్పటికీ రాని - ఎవ్వరూ కనరాని
రేపటి కోసం రేయింబవళ్లు
ఎంతకాలమని - ఆ ఎదురుచూపు?
ఇంకెంత సేపని ఈ ఏవగింపు
మేలుకో కళ్లు తెరు
వర్తమాన వాస్తవాన్ని
చేదైనా, తీపైనా, ఏమైనా
తనివితీరా ఆహ్వానించు!
తపన తీరా అనుభవించు!
గతమెందుకు అవగతమవ్వాలి?
గతంలోని అనుభవసారాన్ని
వెతుక్కునే ప్రయత్నంలో వృథాగా

10/15/2018 - 07:07

అరచేతిలో
వైకుంఠం చూడలేకున్నా
దిక్కుచూపే ఐదువేళ్ల
హస్త సాముద్రికాన్ని
భవిష్యత్ చిత్రపటాన్ని
దర్శించే ఆశాజీవుల
భ్రమావరణంలో
ఇక దిక్కులే మాసిపోతే?
మీటలు నొక్కి నొక్కి
దిక్కు తెలిపే చేతివేళ్లు
రోజూ బట్టలుతికే వేళ్లు
ఆస్తిపాస్తుల లావాదేవీల
నడుమ నలిగిన
బొటనవేలి ముద్రలు
బయోమెట్రిక్ హాజరీపై

10/15/2018 - 07:12

మిత్రమా,
ఈ క్షణం నీకొక New Gen కవితని వినిపించాలె
నువ్వు రెడీనా... ఇక ఇను

10/01/2018 - 00:23

మా వాకిట్లో వున్న వటవృక్షం
చీకట్లో వెలుగులు చిమ్ముతుంది
వెనె్నల్లో వనె్నలు చిగురిస్తుంది
కనె్నపిల్లలా గారాలు పోతుంది
కన్నతల్లిలా కరుణ కురుస్తుంది

10/01/2018 - 00:16

ఎప్పటికైనా తప్పదు కదా
మనసు బీడుపడిన నేలగా ఎంతకాలం?
తన్మాత్రలు పూసరవెల్లులై
పరిగెట్టినంత దూరం
ఒకే ఒక్క కల కోసం నిరీక్షిస్తూ
ఇంకెంత జీవితాన్ని కోల్పోతావ్!
నీ కళ్లని స్వప్న దర్శనానికి డొనేట్ చేసినప్పుడే
ప్రపంచం నీనుండి దూరమైపోయంది
ఎవరి పెదవులపై
రెండు చిరునవ్వు పూల కోసం
జీవితాన్ని పంచుపర్వతంలా కరిగించావో

10/01/2018 - 00:12

కులమేంటి? కులమేంటి?
కులం లొసుగేంటి?
కులం గొప్పతనపు పొగరేంటి?
కులం.. కులం..
మనిషికీ మనిషికీ మధ్య
ఎందుకీ వ్యాకులం!

కులం వివక్షను గళంలో
గరళంలా నింపుకోక
ఎలుగెత్తి ఆక్షేపించు!

కులగజ్జి దురదాకు
ఒళ్ళంతా పూసుకుని
విషం రసితో సమాజాన్ని
విషతుల్యం చేసే
మానసిక చెండాలులకు
సరైన బుద్ధి చెప్పు
ఏమాత్రం ఉపేక్షింపక!

09/24/2018 - 04:44

చెట్టుకేం తెలుసని?
బొట్లు బొట్లుగా
ఆకాశపు ముంచేతి మీద రాలడం తప్ప
నీడకింద కుక్క మూలుగుతూ

అప్పుడప్పుడు
పాములు కూడా మొరుగుతాయ
నీలాగా నాలాగా లోపలికో బయటికో
మొరిగి మొరిగి ఆకాశానికి వేలాడే
భూమిలో ఇంకిపోతాయ

ఇంటికి బొక్క పడటంతో
నగ్ననామ సంవత్సరం ఉదయంచింది
గోడమీద బల్లి పాకిన చారలు
వెక్కిరిస్తూ నా కంట్లో...

09/24/2018 - 04:42

సౌరభాలు వెదజల్లే
అనాఘ్రాత పుష్పరాజసాలు
విషం చిమ్మబడ్డ
తోడేలు తుమ్మెద రెక్కల్లో
చిక్కుకుని సంవేధించబడతాయ్
తెలిమంచు పొరలా మనసుని తాకుతూ
తొలకరి చినుకుల పారవశ్యపు కోరల్లో
ఆదమరుస్తూ అందం!
వ్యక్తిత్వ ఉనికిని చాటే
భావప్రకటనా స్వేచ్ఛని తిరస్కృతిగా భావించే
మూర్ఖభ్రమరాల ప్రతీకార
ప్రతిఘాతం - యాసిడ్ దాడి
హృదయమూ దేహమూ

Pages