S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/19/2020 - 23:34

కాబట్టి ఈ కొండ చాల మహిమాన్వితమైనది. ఎఱుక జాతివారు ఈ కొండపై తిరుగాడే సమయాల్లో వారి చేతుల్లో ఉన్న ఇనుప పనిముట్లు బంగారుగా మారిపోతాయి. శబరులు వేటాడి మృగాన్ని చంపి ఈ కొండమీదకు రాగానే ఆ జంతువులు తిరిగి బ్రతుకుతూ ఉంటాయి. ఈ కొండపై గల ఆహారపదార్థాల్ని తినే వారికి వ్యాధులు- ముసలితనం-మరణం తొలగి వజ్రకాయమేర్పడుతుంది.

01/16/2020 - 22:38

తనయందు పవ్వళించిన నీలవర్ణుడైన శ్రీమహావిష్ణువు నల్లని ప్రతిబింబం సముద్రజలమంతటా వ్యాపించిందేమో! సూర్యుడికి భయపడిన చీకటి ఎక్కడికి పారిపోలేక సముద్రంలోనే అడగిపోయిందేమో, తనలోనే ఉన్న బడబాగ్ని జ్వాలలు మండటం చేత సముద్రగర్భమంతా మాడిపోయిం దేమో! నేరేడు పండు రంగువంటి ఆకాశనీలిరంగు తన జలంలో ప్రతిబింబిస్తూ ఉందేమో!

01/14/2020 - 23:11

ఇట్టి ఈ యువతులు ఉలిముట్టని లింగాలై పోవడం (శివభక్తులు కావడం) చిత్రమే. బంగారు పదకాలు- మొలనూళ్లు (మొలకు ధరించే బంగారు త్రాళ్లు), భుజాలకు ధరించే వంకీలు, బంగారునాణాలు, అంగదాలు- ముంగరలు- ఉంగరాలు మణిహారాలు మొదలైనవి తెచ్చి యిస్తామని రాజకుమారులు తన చెలుల ద్వారా చెప్పించినా వీరు వారితో పల్కనైనా పల్కడం లేదు. అయ్యో! ఆ సొమ్మంతా వ్యర్థంగా పోయిందే కదా.

01/13/2020 - 23:18

వేకువ జామున విటుని చేతినుండి తాంబూలాన్ని తీసుకోరాదు. ఒకవేళ తీసుకుంటే అది నోటిలో ఊరేజలాన్ని ఉమ్మి వేయాలి. కారణం ఎవరు ఎవరికైనా మందుపెట్టే సమయమదే కాబట్టి.

01/13/2020 - 04:57

ఆ స్థితిలో వారు నత్కీరుడు రచించిన నూరు పద్యాలను కంఠస్థం చేసి నిత్యవ్రతంగా చదివే వారు. శ్రీకాళహస్తీశ్వరుడే తమకు భర్తయని నిశ్చయబుద్ధితో ప్రవర్తించే వారు. వారి స్థితిని చూచి మదనవిద్యా ప్రవీణురాలయిన తల్లి మాణిక్యవల్లి కుమార్తెల వద్దకు వచ్చి యిలా అంది.
మాణిక్యవల్లి కూతుళ్లకు వేశ్యాధర్మాల్ని ఉపదేశించుట

01/09/2020 - 22:40

మాణిక్యవల్లి బిడ్డలిద్దరికి ఒంటికి నలుగు పెట్టి వేడినీళ్లతో స్నానం చేయించి మెత్తని తెల్లని వస్త్రంతో తడి ఒత్తేది. కాలివ్రేళ్లపై నున్న మట్టిని తీసి బొట్టు పెట్టేది. కంటికి కాటుక పెట్టేది. కడుపుకు బిడ్డల్ని హత్తుకునేది. చనుపాలు త్రాగించేది. జోల పాటలు పాడి జోకొట్టేది. ఏడుపుల నివారించి కుదుట పరచేది. తలకు చిట్టాముదాన్ని పట్టించేది. రక్షకొఱకై మంచం మీద ముష్టి చెట్లకొమ్మల్ని కట్టేది.

01/09/2020 - 02:12

ఆశ్వాసాంతము
మునిజనుల మనస్సులనే పక్షుల్ని వశపరచుకొనే వల వంటివాడా! సావయవమైన శరీరం లేనివాడా! ప్రపంచంతో సంబంధ ముండియు లేనివాడా! పంచభూతాల యందు సమష్టిగా ఉండే అగణ్యమైన ఆత్మస్వరూపా! ప్రఖ్యాతమైన తత్త్వస్వరూపా! పరమార్థస్వరూపా! స్వీయమైన హర తేజస్సుచే పుక్కిలింపబడిన బ్రహ్మాండ రచన చేసినవాడా! సంసారమనే సర్పం పాలిటి గరుత్మంతుడైన వాడా! శ్రీకాళహస్తీశ్వరా !

01/08/2020 - 04:26

నత్కీరుని సుబ్రహ్మణ్య స్వామి రక్షించుట

01/07/2020 - 22:27

ఇంకా కొంచెం దూరం శక్తి కూడదీసికొని వంగివంగి కొన్ని అడుగులు వేసాడు. కాళ్లుకాయలు కాయగా అడుగు ఆమడదూరంగా బాధపడ్డాడు. క్రమంగా కుష్ఠవ్యాధి తీవ్రమై శరీరంనుండి చీము-నెత్తురు కారసాగింది. ఈగలు ఝుమ్మని మూగసాగాయి. అతి కష్టంగా నడుస్తూ ఆ కవీశ్వరుడు ఎతె్తైన శిఖరాలు గల పర్వతాలు కలిగి నిర్మానుష్యప్రదేశమూ మరియు బహుక్రూర మృగాల సంచారం చేత భయంకరమైన అరణ్యంలో చిక్కుకొని దిక్కు తెలియక దీనావస్థలో పడిపోయాడు.

01/02/2020 - 01:38

అప్పుడా గుడిలోని ఈశ్వరుడు దయతో ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించే రాజుమీద అరవభాషలో శృంగార రసబద్ధంగా ఒక పద్యాన్ని వ్రాసి యిచ్చి శివబ్రాహ్మణునితో ‘దీనిని రాజసభలో చదువు. రాజుమెచ్చి నీకు వేయి మాడలిస్తాడు. దానితో నీకు దినవెచ్చం (దినవ్యయం) లభించి సుఖంగా ఉండగలవు. కొంత కాలానికి కఱవు తొలగిపోతుంది. జనులందరికి హర్షం కలిగే విధంగా వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి. ప్రజలకు సంతోషం కలుగుతుంది’.

Pages