S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/29/2018 - 19:45

అప్పుడు నారాయణుని నాయకత్వాన వారంతా దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మ చెప్పిన విధంగా అతనిని వరం కోరారు. మహర్షి ప్రశాంత దృక్కులతో వారిని చూసి వారికి మేలు చేయదలచి వెంటనే తన ప్రాణాలు వదిలివేశాడు. దేవతలు అతని శరీరంలోని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేయించారు.

11/28/2018 - 18:38

కనుక ఒక్క కుమారుని పొందడానికి ఇవ్వండి స్వీకరిస్తాను. గాలవుడు గుర్రాలను తీసుకొని కన్యను ఇచ్చాడు. రాజు ఆమెతో ఆనందంగా వనాల్లో విహరించాడు. ఆ సమయంలో అతనికి గరుడుడు కన్పించాడు. అతను గాలవుని చూసి ఆగి ఇలా అన్నాడు. ‘‘ద్విజోత్తమా! నీవు ఈ పనిలో కృతకృత్యుడవు అవటం చాలా సంతోషంగా ఉంది. దానికి గాలవుడు ‘‘ఇంకా ఈ కార్యంలో నాల్గవ భాగం మిగిలి ఉంది’’ అన్నాడు.

11/27/2018 - 18:37

వారు అలా వెళ్తూ ఉండగా విశ్వామిత్రుడు కన్పించి గాలవునితో ఇలా అన్నాడు. ‘‘గాలవా! నీ అంతట నీవుగా ఇస్తానన్న గురుదక్షిణ ఇవ్వటానికి కాలం సమీపిస్తున్నది. నేను నీ దక్షిణ కోసం నిరీక్షిస్తున్నాను’’.

11/26/2018 - 18:52

కశ్యప ప్రజాపతి జలాన్ని జలజంతువులను రక్షించడానికి ఈ దిక్కును వరుణునికి పట్ట్భాషేకం చేశాడు. ఇక్కడే అస్తాద్రి ఉంది. అది సూర్యుని ప్రతిదినము గ్రహిస్తుంది. ఈ దిక్కునే దితి గర్భం నుండి మరుత్తులు పుట్టారు. సూర్యచంద్రులను సంహరించాలని సంకల్పించిన రాహువు మొండెము ఈ దిక్కులోనే సముద్రంలో ఉంటుంది. ఇక్కడి నుండే సూర్యుని తిరోగతి ప్రారంభవౌతుంది. ఇక్కడ వరుణాలయంలో మూడు లోకాలకు సరిపడా నీరు నిలువచేయబడింది.

11/25/2018 - 22:14

ఒకప్పుడు యమధర్మరాజుకు ఆకలి వేయగా అతను వశిష్ఠుని రూపం ధరించి విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. విశ్వామిత్రుడు అతనికి మంచి పాయసాన్ని పెట్టాలని తలచి వంట ప్రారంభించాడు. కాని ధర్ముడు ఆకలికి తాళలేక ఇతర మహర్షులకు పెట్టిన భోజనాన్ని ఆరగించాడు. ఇంతలో వడివడిగా విశ్వామిత్రుడు వేడి అన్నాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు ధర్ముడు ‘‘నేను భోజనం చేశాను. నీవు అక్కడే ఉండు’’ అని వెళ్లిపోయాడు.

11/23/2018 - 18:17

అప్పుడు వారు క్రింద లోకాలో ఏడవదైన రసాతలానికి వెళ్లారు. గోమాత సురభి అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఆమె తన పొదుగు నుండి పాలను ప్రవహింపజేస్తూ ఉంటుంది. నారదుడు ఆ లోకం గురించి ఇలా చెప్పాడు. ‘‘ఈ గోమాత పాలు చాలా శ్రేష్ఠమైనవి. ఈమె క్షీరధారలతో ఏర్పడినదే క్షీరసాగరం. ఈ సాగరం నుండి వచ్చే నురుగును త్రాగుతూ ఫేనపులనే మహర్షులు ఈ రసాతలంలో నివసిస్తూ ఉంటారు. వారు తీవ్రతపస్సులు చేస్తారు.

11/21/2018 - 18:49

దేవతలకు అధిపతి అయిన దేవేంద్రునికి మాతలి రథసారథి. ఆయన కుమార్తె లోకోత్తర సౌందర్యవతి. ఆమె పేరు గుణకేశ. ఆమెకు యుక్తవయస్సు వచ్చాక మాతలి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అతను ఈ విషయమై భార్యతో చర్చిస్తూ ఇలా అన్నాడు. ‘‘గొప్ప వంశంలో పుట్టిన శీలవతి, సౌందర్యవతి అయిన కన్య మాతృవంశాన్ని, పితృవంశాన్ని అత్త వారింటిలోని సత్పురుషులను సందేహం లో పడవేస్తుంది.

11/20/2018 - 20:12

భయం పోయిన ద్రౌపది నర్తనశాల కాపలావాళ్లను పిలిచి ఇలా అంది. ‘‘రండి, చూడండి! పరస్ర్తీని కామించిన ఈ కీచకుడిని నా పతులైన గంధర్వులు ఏమి చేశారో చూడండి! ఇక్కడ చచ్చి పడి ఉన్నాడు’’.
కాపలావాళ్ళు వెంటనే లోపలికి కాగడాలతో వచ్చి అక్కడ చచ్చి మాంసం ముద్దగా పడిఉన్న కీచకుడిని చూశారు. అతని స్థితిని చూసి వారు గంధర్వులే ఈ పని చేశారని నిశ్చయానికి వచ్చారు.

11/19/2018 - 19:13

అతని మాటలు విన్న ద్రౌపది ఇలా అన్నది. ‘‘్భమసేనా! నేను నా దుఃఖాన్ని మరిచిపోలేక నీ దగ్గర దుఃఖించాను. కాని యుధిష్ఠిరుని నిందించడం లేదు. కేకయ రాజకుమారి తనకంటే అందమైన నన్ను చూచి కీచకుడు ఎక్కడ మోహపడతాడో అని నిత్యం కలత పడుతోంది. కీచకుడు పాపాత్ముడు. నిత్యం నా దగ్గరకు వచ్చి నన్ను వేధిస్తున్నాడు. నేను వాడితో ‘కామాంధుడా కీచకా! నేను వీరులైన ఐదుగురు గంధర్వులకు పత్నిని.

11/19/2018 - 03:44

ఆమె ఇంకా ఇలా అంది. ‘‘రాణీ! ఈ రోజే నీవు నీ తమ్ముడికి జీవశ్రాద్ధం పెట్టించు. నీ తమ్ముణ్ణి కన్నుల నిండుగా చూసుకో. ఇక అతని ప్రాణాలు ఉండవు. నా భర్తలలో ఒకడు అత్యంత ఆగ్రహం కలవాడు. ఈ భూమీద అతనితో సమానమైన బలం గలవాడు ఇంకొకడు లేడు. అతనెందుకో కోపించక ఊరుకున్నాడు’’ రాణితో ఇలా చెప్పి సైరంధ్రి కీచకవధ కోసం వ్రతదీక్ష పూనింది. ఎవరు ఎంత బ్రతిమాలినా ఆమె ఒంటిమీద ధూళి కూడా తుడుచుకోలేదు. స్నానం చేయలేదు.

Pages