S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/06/2019 - 18:55

మీ మూడవ తాత హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించినవాడు కదా. అతడు గదాదండం పట్టుకొని ఎవరైనా శత్రువులున్నారా అని విశ్వమంతా వెదికాడు. కాని ఆయనకు భయపడి ఆ విష్ణువు దాక్కొన్నాడు. కొన్నాళ్ల తరువాత పందిరూపంలో వచ్చి మీ తాతను ఆ విష్ణువు మట్టుపెట్టాడు.

05/05/2019 - 23:12

ఆ మహోత్సవం తరువాత అక్కడి వచ్చిన వారినందరినీ కూర్చోబెట్టి కపట వటువు విశేషాలను అడిగి తెలుసుకొన్నాడు. ఆ సమయంలో విప్రులు ఎలా ఉన్నారో అడిగి అడిగి మరీ కనుకొన్నాడు. దానాలు ఇవ్వడంలో ఏ ఏ రాజులు మేటి అని ఏమీ తెలియని అమాయకునివలె వారిని అడిగాడు. వారంతా ముక్తకంఠంతో బలి చక్రవర్తినే దానాలు ఇచ్చే మహాదాత, మహోన్నతుడని పొగిడారు.

05/03/2019 - 18:58

‘‘దేవా! మహానుభావ! సమస్త్భువనాలను నీ కడుపులో దాచుకున్నావు. ఈ లోకాలకు ఆది అంతమూ నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కడతేరటానికి కారణం నీవే. సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని చేజార్చుకుని ఎంతో కాలంలో దేవతలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వారిని కాపాడడానికి నీవే దిక్కు.

05/02/2019 - 19:22

కాలరీతిని ఎవరూ పసికట్టలేరు. కాలానికి ఎవరూ ఎదురువెళ్లలేరన్న నిజం తెలిసిన బృహస్పతి 34దేవేంద్రా! మనసును దిటవుపరుచుకో. ఎల్లవేళలా మంచినే జరుగదు. కాలవైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. నేడు బలికి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు దక్కాయి. వారి దీవెనల బలం పెరిగింది. అంతేకాక భృగువంశబ్రాహ్మణులు వీనికి శక్తినిచ్చారు. శుక్రాచార్యుని ప్రియశిష్యుడైనాడు.

05/01/2019 - 19:36

హరిభక్తుడైన ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చినాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. విశ్వజిద్యాగానితో రత్నకచిత సువర్ణకంకణాలు, ఖడ్గమూ లభించాయి.

04/30/2019 - 18:46

ఏకాదశి. విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అదితి తన భర్తచేత ఉపదేశం పొందిన పయోవ్రతం నియమానుసారం చేస్తోంది. ఈ ఏకాదశి మరింత నియమంగా అదితి మొట్టమొదట తన భర్తను పూజించింది. తరువాత మహావిష్ణువు ప్రీత్యర్థం పయోవ్రతాచరణలో భాగంగా మహావిష్ణువుకు క్షీరాభిషేకం నిర్వహించింది. పాలునివేదన చేసింది. ఆ పాలనే ప్రసాదంగా తాను తీసుకొంది.

04/29/2019 - 22:57

అపుడు స్వామిని చూచేవారికి భయం కలిగింది. లోకభయంకరుడైన రాక్షసుని తుదికాలం వచ్చిందని తెలుసుకొన్న దేవతలు, దానవులు,విద్యాదరులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, పణులు, చారణులు, యక్షులు, కినె్నరులు, పన్నగులు, ప్రజాపతులు, వైతాళికులు,విష్ణు సేవకులు, గరుడులు, నారదాదులు, త్రిమూర్తులూ, త్రిమాతలు.. సర్వలోకం ఇక్కడే వచ్చిందానన్నట్లు ఆకాశమంతా వీరితో నిండిపోయింది..

04/29/2019 - 22:55

అంతటా నిండి ఉన్న సర్వేశ్వరుడు హిరణ్యకశిపుని ఆగడాలు మితిమీరాయి ఇక జాగు చేయక మట్టుపెట్టాలన్న ఉత్సాహంతో ఆ స్తంభంలోనే నారసింహరూపంలో ఉన్నాడు. ఆ స్తంభమూ ఎన్నో వేల యేండ్ల తపస్సు చేసినానేమో ఇంతకు పూర్వం ఆ పరంధాముడు నన్నావేశించి ఉన్నాడు.

04/25/2019 - 22:47

అసలు మన హృదయంలోనే ఉంటాడు. భక్తులు ఎవరు ఎక్కడ ఏ రూపంలో కావాలంటేవారికి ఆరూపంలోనే కనిపిస్తాడు. రూపాలన్నీ ఆయనవే కనుక ఏరూపం లో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తాడు. ఇందులో నీకు ఏమాత్రం సందేహం అక్కర్లేదు తండ్రీ అని మరోసారి బుద్ధి చెప్పాడు.

04/24/2019 - 22:48

వీడు నాలుగు కాలాల పాటు బతికి బట్టకట్టగలడా? ఆ విష్ణువెక్కడ ఉన్నాడో అతడు వస్తాడో రాడో కానీ నేడు ఎదురుగా ఈ దానవేశ్వరుడు కబంధ హాస్తాలు చాస్తున్నాడే ఈ మూర్ఖుని చేతిలో ఈ బాలకుడు అంతం చెందుతాడా అని కొంతమంది వ్యధ చెందుతున్నారు. కానీ ఏమీ చేయలేక దానవరాజు భయపడి ఆత్రుతతో వేదనతో చూస్తున్నారు.

Pages