S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/08/2017 - 22:21

‘వెర్రి వెయ్యి విధాలు’ అని మన పెద్దలు ఊరకనే అనలేదు. వెర్రితో ఒళ్ళంతా టాటూలు (మనం వాటినే పచ్చబొట్లు అంటాం) వేయించుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించింది ఒక మహిళ. ఆమె పెద్దగా చదువుకోలేదనుకొంటే పొరపాటే అవుతుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడం విశేషం. ఆమె ఎవరో కాదు అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చార్లెట్టే గుటెన్‌బర్గ్. ఆమె రచయిత. అంతేకాకుండా పర్సనల్ ట్రైనర్‌గా కూడా పనిచేస్తున్నారు.

02/07/2017 - 22:59

అబ్బాయలకే పరిమితమైన బైక్ రైడింగ్‌లో ఈ నలుగురు మహిళలు సత్తా చాటారు. సామాజిక చైతన్యం కోసం చేసిన వీరి సాహసయాత్ర ప్రధాని నుంచి పదుగురి మన్ననలు అందుకుంది. ‘‘బాలికలను రక్షించండి - చదివించండి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో 39 రోజులలో 10 దేశాలను బైక్‌లపై చుట్టివచ్చారు. మహిళలు అంటే ‘‘అబలలు కాదు సబలలు’’ అని నిరూపించారు.

02/05/2017 - 03:22

వ్యాపారం చేయాలనే లక్ష్యం, తపన ఉంటే విజయం సాధించటం సులువే. వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు ఎంతోమంది సామాన్య, మధ్యతరగతి గృహిణులు ఆర్థికస్థిరత్వం సాధించేందుకు తపనపడుతుంటారు. సరైన వేదిక, ఆసరా దొరికితే చాలు స్వావలంబన దిశగా అడుగులు వేస్తారు. ఇలాంటి వారికి స్వయం సహాయక సంఘాలు ఆశాదీపంగా నిలిచి వెలుగునందిస్తున్నాయి. చీకటి రోజులను దాటుకుని చిన్న వ్యాపారంతో చిరు వెలుగులోకి వచ్చిన మహిళలు ఎందరో.

02/03/2017 - 23:09

క్యాన్సర్‌పై యుద్ధం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఇది వస్తే ఆశలు వదులుకునేవారు. కాని నేడు ఆధునిక వైద్యంతో క్యాన్సర్ కొమ్ములను విరిచేస్తున్నారు. క్యాన్సర్‌పై ఈ ఏడాది సరికొత్త నినాదం తీసుకున్నారు. ఎలాంటి క్యాన్సర్ అయినా కావచ్చు, భవిష్యత్తుమీద దృష్టిపెట్టి సానుకూల దృక్పథంతో జీవిస్తే దీనిపై విజయం సాధించటం సులువే. అందుకే ఈసారి మనం ‘‘పోరాడగలం..

02/02/2017 - 22:02

లోకసాక్షి సూర్యభగవానుని కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘసుద్ధ సప్తమి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని సూర్యుని జయంతిగా చెబుతారు. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమినాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కునకు మళ్లించే రోజు.కశ్యప ప్రజాపతి సూర్యునకు రథము, సారథి, గుర్రములను ఇచ్చి లోకాధిపత్యం ఈ రోజు కలిగించాడు కాబట్టే ఈ రోజు రథసప్తమి అంటారు అని ఒక భావన.

02/02/2017 - 02:05

ఆముదం అంటేనే చాలామందికి ఎలర్జీ. ఒకప్పుడు చిన్న పిల్లలకు ఉగ్గు తాగించేవారు. ఈ ఉగ్గులో ఆముదం ఉండేది. పిల్లలకు కడుపు నొప్పి రాకుండా పెద్దలు ఈ పనిచేసేవారు. కాని నేడు పిల్లలకు ఆముదం తాగిస్తే వైద్యులే యికోవటం లేదు. అన్నింటికీ మందులే. ఆముదం తాగిన మొహంలా పెట్టావని కూడా కొంతమంది ఎగతాళి చేయ టం చూస్తుంటాం. కాని ఈ ఆముదం వల్ల ఎన్నో ఉప యోగాలు ఉన్నాయ.

02/07/2017 - 23:20

కుటుంబంలో భార్యాభర్తల కలహాలకు, అత్తాకోడళ్ళ కీచులాటలకు, తల్లిదండ్రుల పిల్లల మధ్య పొడచూపే మనస్పర్థలకు, అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్ళ తగాదాలకు ఎక్కువ శాతం ఈర్ష్యాసూయలు కారణం అవుతుంది.

01/28/2017 - 22:28

స్ర్తిలు శారీరకంగా దుర్భలులు అయితే కావచ్చు కానీ, వారు మానసికంగా, మేధస్సు పరంగా పురుషులకన్నా ఎన్నో రెట్లు బలవంతులు. ఈ విషయం అనేకసార్లు రుజువయింది కూడా. ఇప్పటి వరకు పరిశోధించి నిపుణులు వెలిబుచ్చిన పలు అంశాలు మహిళలు ఎంత దృఢతరమైన మానసికశక్తి గలవారో, వారెంతటి కష్టనష్టాలకు ఓర్చుకుంటారో అర్ధమవుతుంది.

01/27/2017 - 22:03

ప్రేమ.. ఇది అన్ని వయసులవారికి, అన్ని వర్గాలవారికీ అవసరం. పెళ్లివరకు ప్రేమ ఒకలా.. ఆ తర్వాత మరోలా మారకూడదు. ప్రేమించి పెళ్లిచేసుకున్నవారే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిచేసుకున్నవారు కూడా అనుబంధం మరింత పటిష్టంగా ఉండాలంటే నిత్యం ప్రేమతోనే మెలుగుతుండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలో ఓసారి ప్రేమగా చదివేద్దాం మరి...

01/26/2017 - 21:35

పూర్వం ఆబాలగోపాలాన్నీ ఆనందింపజేసి, దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మలాట. అప్పుడు కళాకారుల జీవనోపాధికి ఢోకావుండేది కాదు. సినిమా విజృంభణతో ఆదరణ కరవైంది. కొంతమంది వేరే వృత్తుల్లోకి మరలిపోగా, అభిమానం ఉన్న కళాకారులు వృత్తేనే దైవంగా భావించారు. ‘బొమ్మ’లకు ఆధునికి సోయగాలు దిద్ది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.
**

Pages