S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/24/2017 - 22:55

నువ్వుల నూనె ఆహార పదార్థాల తయారీకి, ఊరగాయలకు, పిండివంటలకు, బాడీ మసాజ్‌కు, సౌందర్య సాధనాల తయారీకే కాక, దీపారాధనకూ ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనెలో ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు.

02/23/2017 - 22:13

అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉన్నది. దీని అర్థమేమిటి? చిద్రూపం శివతత్త్వమైతే, సద్రూపం శక్తి తత్త్వం. సత్ చిత్‌లు వినాభూతమైనవని చూపటం అది. దానికి రూపకల్పనమే ఆయన అర్థనారీశ్వర తత్త్వం. ‘సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నది లలితా సహస్రనామం.

02/23/2017 - 05:46

మూడేళ్ల చిన్నారి. పరుగులు పెట్టే వయసు. కాని క్యాట్‌వాక్‌లో క్యూట్‌గా నడిచి చప్పట్ల జల్లు కురిపించింది. ఇంతకూ ఎవరీ క్యూట్ మోడల్ అనుకుంటున్నారా? న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ ముద్దులొలికే చిన్నారి డ్రెస్స్ డిజైనర్ అమెరికాకు చెందిన షెర్రి హాల్. దుస్తులు డిజైన్ ప్రదర్శనలో పాల్గొంది.

02/21/2017 - 22:16

చాలామంది మాంసాహారం తింటే బలం కలుగుతుంది అనుకుంటారు. అలా అనుకుంటే.. పొరపాటే! మాంసాహారంలో లేని పోషక విలువలు శాకాహారంలో మెండుగా దండిగా వున్నాయి. పైగా ఖర్చు కూడా తక్కువే..

02/18/2017 - 21:23

చిన్నా పెద్దా అందరినీ కేరింతలు కొట్టించే హోళీ పండుగు నెలరోజుల్లో మన ముంగిటకు రానున్నది. అంతేకాదు గుడ్‌ఫ్రైడే కూడా ఏప్రిల్‌లో జరుపుకోనున్నారు. ఈ రెండు పండుగలను పురస్కరించుకుని చక్కగా ఎక్కడైనా ఆనందంగా గడపాలనుకుంటున్నారా? అయితే కోల్‌కతాలోని ఈ ప్రదేశాలు మిమ్మల్ని మరింత ఆనంద డోలికల్లో ముంచెత్తుతాయి. హాలీడే ట్రిప్‌ను తీపిగుర్తుగా మలుచుకోండి.

02/17/2017 - 22:26

మన దేశంలో మహిళలపై ప్రతి ఆరు నిముషాలకు ఒకసారి ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, దాడులకు గురైన పలువురు మహిళలు తమపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, పోలీసు స్టేషన్‌కు వెళితే, అక్కడ ఉన్న పురుష పోలీసులు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే.

02/16/2017 - 23:52

కలుపు తీసిన చేతులే కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తున్నాయి.. లక్ష్మీశర్మ 27 ఏళ్ల యువతి. బీహార్‌లోని సీతామర్హికి చెందిన ఈ యువతి బ్యాచిలర్ ఆర్ట్స్ ఫైనలియర్ చదువుతుంది. చిత్రకూట్‌లోని మహిళా సమితిలో పనిచేస్తుంది. ఆమె రిపోర్టర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంది. విలేకరిగా ఎలాంటి అనుభవం లేదు. కాని మొదటి రౌండ్‌లోనే ఎంపికైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెకు పట్టలేని ఆనందం కలిగింది.

02/15/2017 - 21:11

అమెరికా అధ్యక్ష స్కాలర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన భారతీయ సంతతి యువగాయని

02/14/2017 - 23:01

ఇల్లాలు ఎప్పుడూ కోపంగా, చిర్రుబుర్రులాడుతూ ఉం టే అందరిపైనా విసుగును ప్రదర్శిస్తూ ఉంటే ఆ ఇంట్లో శాంతి సౌఖ్యాలు లోపిస్తాయి. ఆ ప్రభావం ఇంటిల్లిపాదిపై పడుతుంది. కుటుంబంలోని వారి ఆయురారోగ్యాలు బాగుండాలన్నా, ఇల్లు వాకిలి శుచిశుభ్రతలతో కళకళలాడాలన్నా ఆ ఇంటి ఇల్లాలి నైపుణ్యంమీద ఆధారపడి ఉం టుంది. ఇంట్లో వున్న వ్యక్తులమధ్య ఆప్యాయత, అనురాగం వర్థిల్లాలంటే ఇల్లాలి వల్లనే సాధ్యమవుతుంది.

02/10/2017 - 22:52

షాన్వా పాండ్యా కేవలం వ్యోమగామి, వైద్యురాలిగానే కాదు.. మరెన్నో అంశాల్లో ప్రావీణ్యం సాధించారు. మార్షల్ ఆర్ట్ తాయ్‌క్వాండోలో 17 ఏళ్లుగా అభ్యాసం చేసి పట్టు సాధించారు. ఒపెరా సంగీతంలో ప్రవేశం ఉంది. ఇంగ్లీషు, హింది, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆమె మంచి వ్యాపారవేత్త కూడా. పీజీ చేస్తున్నప్పుడే సిలికాన్ వ్యాలీలో మేథోబృందంగా పిలిచే ‘సింగ్యులారిటీ యూనివర్శిటీ’లో ఆమెకు చోటు దక్కింది.

Pages