S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/12/2018 - 20:13

ఆకాశం చిల్లులు పడ్డట్లుగా వర్షం కుండపోతగా కురుస్తూంది
ఈ భూతలమంతా వరదై పొంగిపారుతూ ఉంది
అసలే పాతమిద్దె .. పగుళ్లతో రంథ్రాలుపడి
కారీ కారీ , నాలాగే వృద్ధాప్యంతో కునారిల్లుతోంది
ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఈ ఇల్లంటే నాకు ప్రాణం, ఇది మా అమ్మ ప్రేమ కానుక
ఈ ఇల్లే అమ్మ తర్వాత నాకు అమ్మ అయ్యింది
ఇక్కడే తారతమ్యాల విలువలు తెలుసుకున్నాను

07/11/2018 - 20:36

ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకుమా
...
అవును మరి.. ఆ ఎవరో ఎవరు?
నువ్వే ఎందుకు కాకూడదు?
ఆ గురజాడ అంశ నీదే
ఆ కందుకూరి ప్రశంస నీదే
ఆ రాజారామమోహన్‌రాయ్ పొగడ్త నీకే
ఈ సమాజంలోని రుగ్మతలను
రూపుమాపేందుకు
జన్మించిన అపర మానవతామూర్తి వి నీవే
కదులు కదంతొక్కు పదం పాడు
ఉరకలెత్తు పరుగులు తీయ్

07/10/2018 - 20:48

కన్నవారని వీ డదోరుూ
మాతృమూర్తి మనతానుబంధం!
ఎక్కడికి పోదోరుూ
ఎదలోని అమ్మదనం!

శ్వాసవిడిచి మేను వదిలి
స్వర్గం చేరినా కన్న బిడ్డల
ఆలనాపాలనా
అదృశ్యరూపంలో
పరిరక్షించునోరుూ

సబ్యత సంస్కారం
సంస్కృతి సంప్రదాయాలని
విస్మరించి నివ్వదోరుూ

పదిమందికి తన సంతానం
మార్గదర్శిని
గావిస్తోందోరుూ

07/09/2018 - 22:27

* మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతియ్యని ధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకొంటే జీర్ణవ్యవస్థ బాగా ఉంటుంది. మలబద్ధక సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా దరిచేరవు.

07/08/2018 - 22:10

అమ్మే ఒక బాసైనప్పుడు తన కంటి సైగే ఒక
భావమైనప్పుడు ఆమె చిరునవ్వే ఒక అందమైనప్పుడు
తన పెంపకమే ఒక జీవితమైనప్పుడు ... అన్నింటికీ
అమ్మే ఒక పోలికైనప్పుడు.. అమ్మకి వేరే పోలికలెందుకు?
కనిపించని దైవానికి వేరే రూపమెందుకు?

07/06/2018 - 21:09

వినాయకచవితి రోజు అనయ కుటుంబ సభ్యులంతా వినాయకుడికి పత్రితో పూజ చేశారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా భోజనం అయ్యాక టీవీ చూస్తున్నపుడు అనయ అడిగింది.
‘‘అతను ఎవరు? అంతా ఎందుకు ఏడుస్తున్నారు?’’
‘‘అది ఏడుపు కాదు, సంతోషం. అతను సంవత్సరం క్రితం తీర్థయాత్రకు వెళ్లినపుడు తప్పిపోయాడు’’ అనయ తండ్రి చెప్పాడు.

07/05/2018 - 21:13

ప్రతిరోజు హుషారుగా ఉండే రవళి ఈరోజెందుకో డల్‌గా కనిపించింది రవళి తల్లికి.
‘తల్లీ రవళీ ఎందుకిలా డల్‌గా ఉన్నావు’ రవళితల్లి అంజని
‘ఏం లేదమ్మా! ’ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రవళి
‘లేదు అంటూనే సంకోచంగా ఉన్నావు. నీ మనసులో విషయం నాకు చెప్తే నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుందేమో కదా’అంజని
‘నాకే తెలియడం లేదు. నువ్వు ఏం చెప్తావు ’ రవళి

07/04/2018 - 23:45

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గుడ్లు, ప్రొటీన్స్, హెర్బల్ షాంపులవలన శిరోజాలు పుష్టిగా అందంగా పెరుగుతాయని భ్రమపడతారు. కానీ ఇది కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.
నార్మల్ హెయిర్ గలవారు కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చక్కని ఫలితం పొందవచ్చు.

07/04/2018 - 23:28

మనసుతో పెనవేసుకుని..
హృదయ సాగరం నుండి
అలల్లా ఎగిసిపడుతూ
కనుల గడపను తాకి..
మెలమెల్లగా బయటకు
వచ్చే కన్నీళ్లు..
వేదనకే కాదు
ప్రమోదానికీ ఆనవాళ్లు!
ఎంత గొప్పవి కన్నీళ్లు..
ఒక్క చుక్క వృథా కాదు
అవి జారిపడే ముందు..
కనీసం.. కళ్లను క్షాలితం చేస్తాయి!
ఎంచక్క
అవి చెక్కిళ్లపై
మృదువుగా చేసే సంతకాలు..

07/03/2018 - 21:18

ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది బాలింతల ప్రాణాలను కాపాడే సామర్థ్యమున్న అత్యద్భుత ఔషధాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) తెలిపింది. ‘హీట్ స్టేబుల్ కార్మెటోసిన్’గా వ్యవహిస్తున్న ఈ ఔషధం తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందనీ, వెయ్యి రోజుల వరకూ నిలువ ఉంటుందనీ డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది.

Pages