S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/18/2018 - 23:28

పోటీ ప్రపంచంలో
పిల్లల మధ్య
ద్వేషం, అసూయలను
నూరిపోస్తున్నారు..

గారాబం మాటున
సంతానానికి
కష్టం, సర్దుబాటు
సహనం వంటి
గుణాలు తెలియకుండా
అలవకుండా పెంచుతున్నారు..

06/17/2018 - 21:41

నాకు నీవు నీకు నేను
చిన్న నాటి బాసలు
బతుకుబడిలో
కనుమరుగైనాయా
నాటి జ్ఞాపకాల దొంతర్లు
దులిపితే దొంతర్లుగా
నీ జ్ఞాపకాలే
నీ ఆత్మీయతానురాగాల ఝరులే
ప్రేమను పంచే నీ కనులు
కమనీయమైన ఊసులు చెప్తుంటే
కాలం కరిగిపోయింది
నిన్నటి సిరులు
నేటి గిరులుగా మారినా
రానున్న కాలంలో
మానవత్వపు సిరులు
కావాలని నీ పోకడలే

06/17/2018 - 21:40

అబలలు అని అణిచేసి
అనాదిగా అన్యాయం చేసి
ఆడవారంటే
వంటింటి కుందేలని
నస్ర్తి స్వాతంత్య్ర మర్హత
మను శాస్త్రం అన్నదని
మహిళల మనోభావాలను
మచ్చికతో మగవారే తమకు
నచ్చినట్లు దెబ్బతీసి
మగవారి విజయం వెనుక
మగువలు దాగుంటారని
పొంగవేసి లొంగదీసి
కోరికతో కృంగదీసి
సంప్రదాయ సంకెళ్లను
సుదతిని బలి చేసి
పురుషాధిక్య పౌరుషాన్ని

06/15/2018 - 22:16

నన్ను కన్నతల్లీ.. నీకు వందనం
కడుపులో ముద్దగా ఉన్న నన్ను
పెద్దగా చేసి..
నాకు జీవితాన్నివ్వాలని
ప్రాణం పోసి..
కడుపులో కదులుతున్న
ప్రతిసారి నీ కళ్ళలో కలిగే ఆనందం
నన్ను చూడాలని మురిపిస్తూ ఉండే నువ్వు..
ఆడపిల్లనని తెలియగానే ఒక్క
క్షణం కూడా ఆలోచించకుండ..
నా ప్రాణం తీస్తున్నావు..
అమ్మ నీవు కూడా ఒక ఆడతల్లికే పుట్టావు కదా..

06/15/2018 - 22:13

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే..
కఠినమైన చట్టాలున్నాయంటారు
కనిపిస్తే ‘కాల్’ చేయమంటారు
స్కానింగ్ సెంటర్ల కనికట్టు
విషయంలో..

భ్రూణ హత్యల పేరుతో
ఆడ శిశువుల పిండాన్ని
అదిమేసి చిదిమేసిన
బాధ్యులెవరు?

06/14/2018 - 22:09

ఎక్కువ సంపాదించి తరతరాలకు తరగని గనులను కూడబెట్టాలనుకొంటే తర్వాతి తరాలను పనికిమాలిన వారిగా మీరు చూడబోతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరికి కావాల్సిన వాటిని వారికి అందచేస్తాడు. ప్రతి మనిషి వారి వారికున్న శక్తి యుక్తులను బట్టి వాఠు ప్రవర్తిస్తుంటారు. అంతేకాని రాబోయే తరాలకు కూడా మేమే సంపాదించి పెట్టేస్తాం అనుకుంటే మరి ఆ రాబోయే తరం వారు ఏపని చేయకుండా కూర్చోవాలా?

06/14/2018 - 22:56

కన్నతల్లి కన్న మిన్న
లేదు జన్మభూమి సోదరా
చేయి చేయి కలుపుదాము
కదలిరమ్ము సోదరీ
కర్మభూమి ధర్మభూమి
భరతభూమి మనదేశం
ఇక్కడ జన్మించడమే
మనకు గర్వకారణం
సిరి సంపదలు, సౌభాగ్యాలు
సంగీత సాహిత్యాలు
చిరస్థాయిగా ఘనతను చాటే
చిత్ర శిల్ప సౌందర్యాలు
పుణ్యగిరులు, పవిత్ర ఝరులు
వెలకట్టలేని ఖనిజ సంపదలు
ప్రపంచానికే గురువై ఇచ్చిన

06/14/2018 - 00:28

**నాలుగైదు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులా చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు తెల్ల నూలు తువ్వాలు కనీసం 2, 3 గంటలు లేదా రాత్రంతా ఉంచి ఉదయానే్న శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ తల స్నానం కుంకుడు రసంతోనో సీకాయ నానబెట్టి రుబ్బిన రసంతోనో చేయాలి. ఇలా రెండు రోజులకోమారు వారంపాటుచేస్తే పేలే కాక వాటి గుడ్లు కూడా చచ్చిపోతాయి.

06/12/2018 - 22:12

జీవులన్నింటిలో
ఒకే విధంగా ఉంటుంది
జన్మనిచ్చిన తల్లిప్రేమ!

కన్న ప్రేగుకు కష్టమొస్తే..
కంటతడి పెడుతుంది!
తట్టుకోలేదు..
కన్న తల్లి మనసు!

06/12/2018 - 21:51

వానకాలం వచ్చేసినట్టే అనుకోవచ్చు. జూన్ వచ్చింది. స్కూల్స్ తెరిచారు. స్కూల్‌కు పిల్లలు వెళ్లే వేళ చినుకులు పడేవేళ ఒక్కటిగా ఉంటుంది. తిరిగి స్కూలు మూసి పిల్లలకు ఇంటికి తిరిగి వచ్చేవేళకు మళ్లీ మబ్బులు పట్టి చినుకులు తయారు అవుతాయ.

Pages