S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 02:03

హైదరాబాద్, మే 1: తెలంగాణకు చెందిన భారతీయ వైద్య విధాన (ఆయుష్) శాఖలో 183 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయుష్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు 11 మంది హోమియో లెక్చరర్లు, 12 మంది ఆయుర్వేద లెక్చరర్లు, ఎనిమిది మంది యునాని లెక్చర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు.

05/02/2017 - 02:01

హైదరాబాద్, మే 1: బ్రిటీషు కాలం నుంచి ఆనవాయితీగా విఐపి కార్లకు ఉన్న ఎర్ర బుగ్గల సంస్కృతి అంతమైంది. విఐపిలు ఎర్ర బుగ్గలు వాడరాదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. విఐపిలు తమ కార్లకు ఎర్ర బుగ్గలు పెట్టుకోరాదని గత నెల 18న కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఎర్ర బుగ్గలు వాడేందుకు వీలు లేదు.

05/02/2017 - 02:00

హైదరాబాద్, మే 1: జిల్లాల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సిబిఎఫ్) కు ప్రభుత్వం 23.25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు 75 లక్షల చొప్పున ఇస్తున్నామని ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య తెలిపారు. నియమావళికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఈ నిధులను వాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

05/02/2017 - 01:59

హైదరాబాద్, మే 1: కార్మికుల, ఉద్యోగుల, వేతన సాంఘిక భద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు పథకాలను ప్రారంభించినట్టు ఆయన వివరించారు.

05/02/2017 - 01:59

హైదరాబాద్, మే 1: శారీరక కొలతలు నిబంధనల ప్రకారం లేవంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2008 డిసెంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన 165 మంది అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లలో 15 మందిని తొలగించడం చెల్లదని ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది.

05/02/2017 - 01:58

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. ఈ అవార్డు గ్రహీతల ఎంపిక కోసం పది మందితో ఒక కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి చందూలాల్ నేతృత్వంలో పది మంది సభ్యుల కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.

05/02/2017 - 01:57

హైదరాబాద్, మే 1: దేశంలో విద్యా రంగంలో సామర్ధ్యాల పెంపునకు, పరిశోధనలకు, ప్రణాళికల రూపకల్పనకు ‘న్యూపా’ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు ఆ సంస్థ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ ఆర్ మాధవ మీనన్ పేర్కొన్నారు. విద్యారంగంలో ప్రమాణాలు పెరిగినా, అంతర్జాతీయ పోటీకి ధీటుగా మరింత సంస్కరించబడాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాత్రి జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 21వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

05/02/2017 - 01:53

విజయవాడ (క్రైం), మే 1: కార్మిక పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ ఉద్ఘాటించారు. టిడిపి అనుబంధ టిఎన్‌టియుసికి నేడు పటిష్ట నాయకత్వం ఉందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రన్న భీమా పథకం కింద నేడు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలవుతోందని చెప్పారు.

05/02/2017 - 01:51

విజయవాడ, మే 1:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు 250 రూపాయల చొప్పున, సాధారణ ప్రజలకు 310 రూపాయల చొప్పున సిమెంట్ బస్తాలను సరఫరా చేసేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం సోమవారం వివిధ సిమెంట్ తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చించింది.

05/02/2017 - 01:47

విజయవాడ (రైల్వేస్టేషన్), మే 1: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీద నడిచే రైళ్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా కొన్ని హాల్ట్‌లు కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 22663 చెన్నై- ఎగ్‌మూర్ నుంచి జోద్‌పూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలు స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతుందని తెలిపారు.

Pages