S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 01:47

కాకినాడ, మే 1: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయపరంగా అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్), బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ ఉద్యానవన పంటల అభివృద్ధి, అధిక ఉత్పత్తి సాధన కోసం 2003 నవంబరులో మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది.

05/02/2017 - 01:46

కడప, మే 1: పసుపు, మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఓ పక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పరిహారం చెల్లిస్తుంటే మరోపక్క వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దొంగదీక్షలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం కడపలో విలేఖరులతో మాట్లాడుతూ సిమెంటు ధర పెంపుపై జగన్ దీక్ష చేస్తే బాగుంటుందన్నారు.

05/02/2017 - 01:45

తిరుపతి, మే 1: ఏర్పేడు వద్ద గత నెల 21న జరిగిన దుర్ఘటనలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందవరం సర్పంచ్ చిరంజీవులు నాయుడుతోపాటు మరో ఏడుగురు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇసుక మాఫియా అగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మునగలపాల్యెం గ్రామస్థులు 16 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డ సంఘటన గత నెల 21న జరిగిన విషయం పాఠకులకు విదితమే.

05/02/2017 - 01:44

హైదరాబాద్, మే 1: అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు.

05/02/2017 - 01:44

ఆదోని, మే 1: వాడి-గుంతకల్లు రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వేలైన్ విద్యుదీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ ఓజా పేర్కొన్నారు. ఆదోని రైల్వేస్టేషన్‌ను సోమవారం తనిఖీచేసిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వాడి- గుంతకల్లు స్టేషన్ల మధ్య జరుగుతున్న విద్యుదీకరణ పనుల్లో పురోగతి ఉందన్నారు. ప్రస్తుతం సూగూరు వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు.

05/02/2017 - 01:54

హైదరాబాద్, మే 1: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేములపల్లి వినీల ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ బ్రోకర్ అయిన భర్త విక్రమ్ విజయసింహ పెట్టిన వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో వినీత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

05/02/2017 - 01:42

హైదరాబాద్, మే 1: అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై, కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడం, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సెల్వరాజన్ నాగలక్ష్మిపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకుగానూ ఆమెకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రెండు వేల జరిమానాను విధించింది.

05/02/2017 - 01:38

హైదరాబాద్, మే 1: హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- మహబూబ్‌నగర్ మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

05/02/2017 - 01:34

హైదరాబాద్, మే 1: ‘రోడ్లపై గుంతలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు పూడ్చేయాలని గతంలో అనేకమార్లు చెప్పాను. అయినా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. నెల సమయం ఇస్తున్నా. మే నెలాఖరుకు రోడ్లపై గుంతలు పూడ్చాలి. జూన్‌లో రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తా. అప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారిని అక్కడిక్కడే సస్పెండ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

05/02/2017 - 01:31

ఢిల్లీ/ హైదరాబాద్, మే 1: ఐఎస్‌ఐఎస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. యువతను రెచ్చగొట్టేందుకు పోలీసులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారమిచ్చారా? అధికారమిస్తే దానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

Pages