S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 00:34

న్యూఢిల్లీ, మే 1: పార్లమెంట్ సభ్యుడు, బిజెపి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిని ముట్టడించి ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను (సోదరులను) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

05/02/2017 - 00:34

షేఖ్‌పురా/లఖిసరాయ్, మే 1: బిహార్‌లోని సరాయ్ స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న వారిని అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొన్న సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రామ్‌పూర్‌ఘాట్-గయ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన కొంతమంది ప్రయాణికులు ఫుట్‌వోవర్ బ్రిడ్జి ఎక్కకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశారు.

05/02/2017 - 00:33

న్యూఢిల్లీ, మే 1: దేశ సరిహద్దులో, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సమీక్షించారు. ప్రధానంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఇద్దరు జవాన్లు మృతిచెందిన ఘటనపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అక్కడ పరిస్థితులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

05/02/2017 - 02:26

శ్రీనగర్, మే 1: కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుల్గామ్‌లో సోమవారం ఒక బ్యాంకు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఉగ్రవాదులు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు బ్యాంకు అధికారులతో పాటు మరో ఐదుగురు పోలీసులను హత్య చేశారు.

05/02/2017 - 00:32

చెన్నై, మే 1: డిఎంకె అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె.స్టాలిన్ సోమవారం వెల్లడించారు. వచ్చేనెలలో 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్న కరుణానిధి అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది అక్టోబర్ నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

05/02/2017 - 00:30

న్యూఢిల్లీ, మే 1: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా షేర్ చిన్నది.. లాభం పెద్దది అనాల్సి వస్తోంది. అవును.. స్టాక్ మార్కెట్లలో బడా సంస్థల షేర్ల కంటే చిన్న, మధ్యశ్రేణి షేర్లే.. మదుపరులకు పెద్దగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. బ్లూచిప్ సూచీ షేర్లలో పెట్టుబడులతో పోల్చితే స్మాల్, మిడ్-క్యాప్ సూచీల షేర్లలో పెట్టుబడులతో ఆకర్షణీయమైన లాభా లు అందుతున్నాయి.

05/02/2017 - 00:28

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 976.48 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 695.78 కోట్ల రూపాయలుగా ఉంది.

05/02/2017 - 02:14

ముంబయి, మే 1: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. వివిధ కాలపరిమితి గల తమ టర్మ్ డిపాజిట్ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కోటి రూపాయల దిగువన ఉన్న మధ్య, ధీర్ఘకాలిక డిపాజిట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీంతో రెండు నుంచి మూడేళ్ల డిపాజిట్లకు ఎస్‌బిఐ ఇచ్చే వడ్డీరేటు 6.25 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు ఇది 6.75 శాతంగా ఉంది.

05/02/2017 - 00:27

న్యూఢిల్లీ, మే 1: రాయితీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర సిలిండర్‌కు దాదాపు 2 రూపాయలు పెరిగింది. అలాగే లీటర్ కిరోసిన్ ధర కూడా 26 పైసలు పెరిగింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం.. నెమ్మదిగా వంటగ్యాస్, కిరోసిన్‌లపైనా ఇలా కొద్దికొద్దిగా పెంచుతూ తొలగించాలని చూస్తోంది.

05/02/2017 - 00:27

నల్లమాడ, మే 1: ఈ ఏడాది మామిడి దిగుబడి ఎక్కువ రావడంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని భావించిన మామిడి తోటల కొనుగోలుదారులకు చుక్కెదురైంది. మార్కెట్ మాయగాళ్లు ధర తగ్గించేసి దోపిడీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 47 వేల హెక్టార్లలో మామిడితోటలు సాగు చేశారు. హెక్టారుకు 9 టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా జిల్లాలో మామిడి వ్యాపారంపైనే ఆధారపడ్డ కుటుంబాలు 2 లక్షలకుపైగా ఉన్నాయి.

Pages