S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 21:43

ఇంటికి ఎవరొస్తున్నారో ముందుగానే తెలుసుకోవడం మంచిదే. అవసరమైతే అప్రమత్తంగా ఉండొచ్చు కూడా. మన ఇంటికి ఎవరొస్తున్నారో సదరు వ్యక్తి ఫర్లాంగు దూరంలో ఉండగానే తెలిపే ‘డ్రైవ్ వే డోర్‌బెల్’ మార్కెట్లోకి వచ్చింది. పేరులో ఉన్నట్టే ఇదో డోర్‌బెల్. దీనిని ఇంటికి దారితీసే మార్గంలో ఏర్పాటు చేస్తే, కారు ఆ డోర్‌బెల్‌ను దాటిన వెంటనే అందులో ఉండే రిమోట్ సెన్సర్లు ఇంట్లో ఉన్న వ్యవస్థకు సంకేతాలు పంపిస్తాయి.

12/01/2016 - 21:41

ఇరవై రెండేళ్ల దివ్యషా సంతోషానికి ఇప్పుడు అవధుల్లేవు!
కష్టానికి గుర్తింపు లభించినప్పుడు ఎవరికైనా అంతే!
పట్టరాని ఆనందంతో గంతులేస్తాం కదూ?

12/01/2016 - 21:37

స్పోర్ట్ షూస్ తయారీలో అగ్రగామి సంస్థ ఆడిడాస్ తాజాగా ‘అల్ట్రా బూస్ట్ అన్‌కేజ్డ్ పార్లే’పేరిట కొత్తరకం బూట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడముచ్చటగా ఉన్న ఈ బూట్లను రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారంటే నమ్మలేం. న్యూయార్క్‌కు చెందిన ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి పర్యావరణ హితమైన ఈ బూట్లకు ఆడిడాస్ రూపకల్పన చేసింది. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

12/01/2016 - 21:35

మార్కెట్లో రకరకాల వేరబుల్ డివైస్‌లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా అథ్లెట్లకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదే కోవలో వచ్చిన ఇన్‌బాడీ బాండ్ (inBody Band) వేరబుల్ డివైస్‌ను ఆల్ ఇన్ వన్‌గా చెప్పవచ్చు. అనేక సెన్సర్లు, యాక్సెలోమీటర్లతో రూపొందించిన ఈ డివైస్...హార్ట్ రేట్ చెబుతుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తే, మీరు ఎన్ని అడుగులు వేశారో లెక్కగడుతుంది. ఎంత దూరం నడిచారో కొలుస్తుంది.

12/01/2016 - 21:33

రుద్ర నారాయణ్ ముఖర్జీ పేరు చెబితే జార్ఖండ్‌లోని సిందూర్పూర్ అనే కుగ్రామంలో ఎవరూ గుర్తు పట్టరు. కానీ, ‘రూరల్ సైంటిస్ట్’ అని అడిగి చూడండి. అందరూ రుద్ర గురించే చెబుతారు. అతని గురించి, అతను సాధించిన విజయాల గురించి వివరించేందుకు క్యూ కడతారు.

12/01/2016 - 21:15

అంగారకుడు పాలించే లోకానికి ఊర్థ్వమైన స్థానంలో వసించు’’ అని వరాలు అనుగ్రహించి నీలగ్రీవుడు దేవతా సమూహంతో పాటు బ్రహ్మదేవుణ్ణి కూడా తలచాడు.
స్మరణమాత్రం చేత ఏతెంచిన ఆ బ్రహ్మాది దేవతాతతి చేత ఆ బృహస్పతికి దేవతాచార్య పదవీ సామ్రాజ్యానికి పట్ట్భాషేకం చేయించాడు. అనంతరం చంద్రేశ్వరుడి దక్షిణ దిక్కున విశే్వశ్వరుడికి నిరృతి దిక్కున బృహస్పతి ప్రతిష్ఠ చేసిన బృహస్పతీశ్వర లింగంలో ప్రవేశించాడు.

12/01/2016 - 21:14

ధర్మమనే ఆయుధం చేతిలో పట్టుకుని ఎంతటి కీకారణ్యంలో అయనా నడువవచ్చు. క్రూరమృగాలను సైతం మచ్చిక చేసుకోవచ్చు. కనుకనే హిరణ్యకశ్యపాది రాక్షసులు ఎంతటి ప్రమాదకరమైన వరాలను కోరినా ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు అతి సులభ ప్రయత్నమే చేస్తాడు.

12/01/2016 - 21:12

వనే్న యేనుగు తోలు దుప్పటము బువ్వాకాల కూటంబుచే
గినే్న బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
నిన్నీలాగున మంటయుందెలిసియున్ నీ పాద పద్మంబు సే
ర్చె న్నారాయణుడెట్లు మాన సముదా శ్రీకాళహస్తీశ్వరా!

12/01/2016 - 21:11

‘‘అంటే.. ఇద్దరం కలిసి ఏ ఊరైనా వెళ్లి కొన్ని రోజులుండి వద్దామంటావా?’’ అంది సాహిత్య ఆశ్చర్యపోతూ.
‘‘అవును తప్పేం ఉందీ? మనం వెళ్లాలని అనుకోవాలే గానీ అదేమంత వీలుకాని విషయం కాదుగా..?’’
‘‘నీ మనసులో ఏం ఉందో నాకర్థం కావడంలేదు. రోజూ కాకపోయినా కనీసం వారానికి రెండు మూడుసార్లు మనం కల్సుకుని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా! పరాయి చోటికి వెళ్లి మాత్రం అంతకంటే ఏం చేస్తాం?’’ అంది సాహిత్య.

12/01/2016 - 21:01

బాలకృష్ణ కథానాయకుడిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి సన్నివేశాన్ని ఆర్‌ఎఫ్‌సిలో బాలకృష్ణ, శ్రీయ, హేమామాలినిపై చిత్రీకరించారు.

Pages