S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 07:29

డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్, ఈ-వ్యాల్లెట్లు, అంతర్జాల బ్యాంకింగ్ విధానం, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ యాప్స్‌లను త్వరితగతిన విస్తరించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను ఈ కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

12/01/2016 - 07:27

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోను సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతాన్ని ప్రసారం చేసేటప్పుడు స్క్రీన్‌పై జాతీయ పతాకం కనిపించాలని, ప్రేక్షకులందరూ లేచి నిలుచుని గౌరవాన్ని ప్రదర్శించాలని కూడా స్పష్టం చేసింది.

12/01/2016 - 07:25

న్యూఢిల్లీ, నవంబర్ 30: జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే చర్యల్ని రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. ఈ ఖాతాల నుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు విధించింది. తమ ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలు నింపిన ఖాతాదారులు నెలకు పదివేలు తీసుకోవచ్చు. కానీ, వివరాలివ్వని ఖాతాదారులు నెలకు 5 వేలకు మించి తీసుకోవడానికి వీలుండదు.

12/01/2016 - 07:23

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రాలో వరుసగా మూడోసారి విద్యుత్ చార్జీలను వడ్డించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపి డిస్కాంలు మొత్తం రూ.7177 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రెవెన్యూ లోటుపై ప్రతిపాదనలను ఏపి డిస్కాం విద్యుత్ అధికారులు బుధవారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి)కి ప్రతిపాదనలు సమర్పించాయి.

12/01/2016 - 07:22

హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ, ఆంధ్రల మధ్య కృష్ణా జలాల వినియోగంపై చర్చించేందుకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు బుధవారం ఇక్కడ జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య సమావేశం ఎలాంటి పరిష్కార మార్గాలు కనుక్కోలేకపోయంది. పోతిరెడ్డిపాడు నుంచి 53 టిఎంసి శ్రీశైలం జలాలను మాత్రమే వినియోగించుకున్నామని ఆంధ్ర ప్రకటించగా, 61 టిఎంసి ఏపీ తరలించుకుపోయిందని తెలంగాణ ఆరోపించింది.

12/01/2016 - 07:20

విజయవాడ, నవంబర్ 30: వెలగపూడిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నుంచి అధికారికంగా పరిపాలన ప్రారంభించారు. బుధవారం ఉదయం సరిగ్గా 11.45గంటలకు సచివాలయానికి చేరుకున్న ఆయనకు ఉద్యోగులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఉద్వేగంతో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వెలగపూడి సచివాలయం నుంచి పరిపాలన సాగించటం తనకు రెండో మజిలీ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.

12/01/2016 - 07:18

విజయవాడ, నవంబర్ 30: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులకు ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల రూపాయల మేరకు నగదు చెల్లించనున్నారు. నగదు లేకుండానే రేషన్ సరకులను తీసుకువేళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

12/01/2016 - 07:17

విజయవాడ, నవంబర్ 30: తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్ల కాలంలో ఇప్పటికి రికార్డుస్థాయిలో 52 వేల 500 జీవోలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇప్పటివరకూ రాష్ట్ర పాలనకు 52 వేల 500 జీవోలు ప్రభుత్వం జారీ చేసింది.

12/01/2016 - 06:59

న్యూఢిల్లీ, నవంబర్ 30: జాతీయ రహదారులపై టోల్‌గేట్ వసూళ్లు మళ్లీ మొదలవుతున్నాయి. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి టోల్‌గేట్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది తెలిసిందే. కాగా, డిసెంబర్ 15 వరకు పాత 500 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

12/01/2016 - 06:57

ముంబయి, నవంబర్ 30: అంతర్జాతీయ మార్కెట్‌లో పుంజుకున్న చమురు ధరలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 258.80 పాయింట్లు పెరిగి 26,652.81 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.35 పాయింట్లు అందుకుని 8,224.50 వద్ద నిలిచింది.

Pages