S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 00:46

దెయ్యం అందంగా వుండడం ఏమిటి? అని అనుకుంటున్నారా... నిజమే దెయ్యాలంటే మనలను భయపెడతాయని తెలుసు.. కానీ ఈ దెయ్యం మాత్రం చూసినవారిని తన ప్రేమలో పడేస్తుంది? మీరు ఒక్కసారి ఆ దెయ్యాన్ని చూశారంటే.. అబ్బా అంత అందంగా వుంది అనుకోవలసిందే! నిజం... ఇంతకీ రెజీనా దెయ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది కదా.. అక్కడికే వస్తున్నా..

12/01/2016 - 00:44

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమా ఈనెల విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత ఆయన నటించే సినిమాపై క్లారిటీ వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని, ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు, ప్రీపొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

12/01/2016 - 00:57

సర్వమంగళం అనే పిరికివాడు క్రమంగా ధైర్యాన్ని కూడకట్టుకొని సర్వేష్‌గా ఎలా మారాడు అన్న అంశంతో రూపొందిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందని దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎస్‌ఆర్‌ఎఫ్ పతాకంపై సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

11/30/2016 - 23:48

పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత దేశంలో ఈ అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం క్యూలు కడుతూనే ఉన్నారు. ఇకమీదట క్యూలు లేకుండా ఉండటానికి డిజిటలైజేషన్ పద్ధతిలో నగదు మార్పిడి, చెల్లింపులు జరుపుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ చెల్లింపులు, చెక్ లేదా డిడి రూపంలో చెల్లింపులు జరగాలని సూచిస్తోంది.

11/30/2016 - 23:46

కరెన్సీ రద్దువల్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల మూలంగా జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. నిజం చెప్పాలంటే ఇది అనాలోచిత, అప్రజాస్వామిక చర్య. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం.

11/30/2016 - 23:45

సంస్కరణలు తేకుండా నల్లధనాన్ని నిర్మూలించడం ఎలా సాధ్యం? అసలు నల్లధనం నిర్వచనం ఏమిటో తేలాలి. ఒక వ్యక్తి తక్కువ ధరకు మార్కెట్‌లో ఒక వస్తువు లేదా ఒక ప్లాటు కొన్న కొన్ని నెలలకో సంవత్సరాలకో మంచి రేటు వస్తుంది. దాన్ని విక్రయిస్తే, వచ్చిన లాభాన్ని నల్లధనం అంటారా? అనేది ముందుగా తేల్చాలి.

11/30/2016 - 23:44

నల్లధనం బయటపెడతానంటే అందరూ స్వాగతించాం. కాని నల్లకుబేరుల జాబితా బహిర్గతం చేయలేదు. అంతకంటే మించి నల్లమార్కెట్ పుంజుకుంది. మార్కెట్లో గందరగోళం, అయోమయం. ఏ క్షణాన ఏ రూల్స్ ప్రకటిస్తారో తెలియదు. మన ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న ఆకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దుచేయడంవల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోంది.

11/30/2016 - 23:42

నోట్లను రద్దుచేయడం వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అమలు చేసేందుకు చేపట్టిన విధానం మాత్రం సరైంది కాదు. భారతదేశంలో కొంతమంది బడాబాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయాలని ప్రభుత్వం భావించడంలో తప్పులేదు. దేశంలో ప్రతి పౌరుడి ఆదాయం చట్టానికి లోబడి ఉండాలన్నది కేంద్రం ఉద్దేశంగా స్పష్టమవుతోంది. నీతివంతమైన పాలనను ప్రజలకు అందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచించి ఉండవచ్చు.

11/30/2016 - 23:41

పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్న విషయం అవాస్తవం.

11/30/2016 - 23:40

నల్లధనాన్ని నిర్మూలించేందుకు 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాగానే ఉంది కానీ రెండు వేల రూపాయల నోటును ఎందుకు తెచ్చినట్లు? ఇది నల్లధనాన్ని ప్రోత్సహించడం కాదా? స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకుని రావడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకోవడానికి పెద్దనోట్లను రద్దు చేసింది.

Pages