S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 06:35

మచిలీపట్నం, నవంబర్ 30: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారమైన 1వ తేదీ వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. నెలరోజుల కష్టానికి తగ్గ జీతం అందుతుందో, లేదో తెలియదు. బ్యాంకుల్లో దాచుకున్న కొద్దిపాటి నగదు చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో 1వ తేదీని అధిగమించడం ఎలా?.. అనేది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అంతుపట్టడం లేదు. నెలలో ప్రారంభ రోజైనా అన్ని చెల్లింపులకూ చివరి రోజే.

12/01/2016 - 06:34

విజయవాడ (క్రైం), నవంబర్ 30: పెద్ద నోట్ల రద్దు అవకాశంగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు నల్లధనాన్ని వైట్ కరెన్సీగా మారుస్తామంటూ రియల్ ఎస్టేట్ ఆఫీసును అడ్డాగా మార్చుకుని అక్రమాలకు పాల్పడే క్రమంలో నిందితులు 11మందిని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 7,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసిపి సత్యానందం తెలిపారు.

12/01/2016 - 06:33

విజయవాడ, నవంబర్ 30: బ్యాంకు ఖాతాదారులు తమ నగదు లావాదేవీలను ఇంటివద్దనే చేసుకునే విధంగా మొబైల్ ఎటియం వాహనాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. బుధవారం కాళేశ్వరరావు మార్కెట్ ఆంధ్రా బ్యాంకు జోనల్ కేంద్రం వద్ద నాలుగు మొబైల్ ఎటియం వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు.

12/01/2016 - 06:33

విజయవాడ, నవంబర్ 30: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైయ్యే భూసేకరణలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలను గుర్తించి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెట్రో ప్రాజెక్టుపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

12/01/2016 - 06:32

విజయవాడ, నవంబర్ 30: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలన చేపట్టి రూ. 1000 కోట్లతో గురుకుల భవనాలను నిర్మిస్తూ ముందుకు సాగుతోందని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎపిఇడబ్ల్యుఐడిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/01/2016 - 06:30

సరూర్‌నగర్, నవంబర్ 30: జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ ఆకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధిపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి చైర్మన్ ఆల్లం నారాయణ అధ్యక్షత వహించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం జిఓ 225ను విడుదల చేసిందని అన్నారు.

12/01/2016 - 06:29

హైదరాబాద్, నవంబర్ 30: ప్రతిభ కనపర్చిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదుశాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తామని, అందుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాధికార సంస్థ(శాట్స్) చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

12/01/2016 - 06:29

హైదరాబాద్, నవంబర్ 30: క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా నగదు చెల్పించులకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు.

12/01/2016 - 06:28

హైదరాబాద్, నవంబర్ 30: మున్సిపల్ కమిషనర్ ఎంకెఐ అలీని కమిషనర్, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సరెండర్ చేయాలని వికారాబాద్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. బుధవారం కౌన్సిల్ హాలులో ఏర్పాటు మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శాటిలైట్ టౌన్‌షిప్ పథకం కింద పట్టణంలో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ స్వాధీనం విషయం చర్చకు వచ్చింది.

12/01/2016 - 06:28

హైదరాబాద్, నవంబర్ 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నగరంలోని రోడ్లను పునఃనిర్మించేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టిన కార్యాచరణ శరవేగంగా ముందుకు సాగుతుంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలో సుమారు 180 కిలో మీటర్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్ల పునఃనిర్మాణ పనులకు జిహెచ్‌ఎంసి రూ.75కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది.

Pages