S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 02:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత్‌తో ఎప్పుడు పోరు జరిగినా తన చిరకాల మిత్రదేశం చైనా తనకు బాసటగా నిలుస్తుందన్న పాకిస్తాన్ విశ్వాసానికి ఇదో పెద్దదెబ్బ. ఇది పాకిస్తాన్ విశ్వాసమే కాదు.. ఆ దేశ నేతలు బహిరంగంగా చెప్పారు కూడా. అయితే పాకిస్తాన్‌కు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను చైనా ఖండించింది.

09/27/2016 - 01:59

విజయవాడ, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా రాష్ట్రంలో 2.4 శాతం వర్షపాతం లోటు ఉందని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జలవరులన్నింటినీ కాపాడుకోవాలని, చెరువులు, కుంటలకు సకాలంలో మరమ్మతులు చేయాలని సూచించారు. నీరు-ప్రగతిపై సర్పంచ్‌లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/27/2016 - 01:51

ఫ్రాన్స్ నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ‘రాఫెల్’ బహుళ ప్రయోజన విమానాల వల్ల మన వైమానిక దళం సమర పటిమ మరింత విస్తరించనుంది. సంపూర్ణ స్వదేశీయ పరిజ్ఞానంతో సమగ్ర రక్షణ స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యం ఎండమావిలోని మంచినీటి ప్రవాహం వలె ఊరిస్తోందన్న వాస్తవం కూడా ఈ కొనుగోలు ఒప్పందం వల్ల మరోసారి స్ఫురించింది. మన సైనిక బలం రక్షణ పటిమ పెరగడం అనివార్యమైన పరిణామం.

09/27/2016 - 01:48

మేము ఎల్‌ఇడి బల్బులు వాడుతున్నాం. వీటితో సమస్య ఏమంటే- ఇవి గది అంతటా ఒకే విధమైన వెలుగు ఇవ్వవు. బల్బు ముందు భాగంలో 2,3 అడుగుల మేర వెలుతురు బాగానే వుంటుంది. దూరం ఎక్కువ అవుతున్నకొద్దీ వెలుతురు తగ్గుతోంది. వస్తువులైతే కనిపిస్తాయి కానీ, చదువుకోవడం, రాసుకోవడం వంటివి ఆ వెలుతురులో కుదరదు. ప్రభుత్వం ఇరవై రూపాయలకు రెండు ఎల్‌ఇడి బల్బుల ఇచ్చింది కానీ, అదనంగా కావాలంటే మార్కెట్‌లో ఒక్కో బల్బు ధర రూ.

09/27/2016 - 01:47

రాజకీయ జోక్యం, అభిమానుల కులతత్వం, వెబ్‌సైట్ రివ్యూలు.. మా సినిమా ఆడకుండా కక్షకట్టి ప్రచారం చేస్తున్నాయి! దానివలన కోట్లు ఖర్చుపెట్టి విదేశాల్లో నిర్మించిన మా సినిమాలు ఆడకుండాపోతున్నాయి! ప్రేక్షకులు కూడా ఆ ప్రచారాలను నమ్మి సినిమాలను కనె్నత్తి కూడా చూడటం లేదు.. అని నేడు కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు లబోదిబోమని ఏడుస్తున్నారు! ప్రెస్‌మీట్‌లు పెట్టి గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

09/27/2016 - 01:45

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు అభివృద్ధి గురించి పాఠాలు చెప్పేబదులు మన దేశప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలంటూ ప్రతిపక్షాలు సూచించండం అర్థరహితం. కనీసం పాక్‌తో వ్యవహరించే విషయంలోనైనా ప్రతిపక్షాలు ప్రధానికి అండగా నిలబడటం మంచిది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ఏ మేరకు అభివృద్ధి చెందింది? పరిపాలన ఏ విధంగా మారుతోంది?

09/27/2016 - 01:44

షబ్‌నమ్‌లోనీ కాశ్మీరుకు చెందిన స్ర్తి. ఆమె న్యూఢిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తున్నది. ఆమె మాట్లాడుతూ- ‘కాశ్మీ రు సుందర స్వప్నం. మా స్వర్గాన్ని నరకంగా మార్చారు’ అన్నది. ‘పాపం నిరుద్యోగులు ఐసిస్ జెండాలు పట్టుకొని తిరుగుతుంటే వారిని కాల్చి చంపటం అన్యాయం’ అన్నది. ఈ రెండు ప్రకటనలు విశే్లషించండి. కాశ్మీరంలో కుంకుమ పండుతుంది. కానీ ఇప్పుడు అక్కడ అరుణారుణ రుధిర వాహినులు ప్రవహిస్తున్నాయి. ఈ పాపం ఎవరిది?

09/27/2016 - 01:51

కాన్పూర్, సెప్టెంబర్ 26: గ్రీన్ పార్క్ స్టేడియంలో తన 500వ టెస్టు మ్యాచ్‌ని ఆడిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను మొదటి టెస్టులో 197 పరుగుల భారీ తేడాతో చిత్తుచేయడం ద్వారా చారిత్రిక మ్యాచ్‌ని చిరస్మరణీయంగా మలచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

09/27/2016 - 01:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: గులాబీ బంతులతో టెస్టు మ్యాచ్ ఈ హోం సిరీస్ సీజన్‌లో ఉండదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. ఈ వరుస హోం సిరీస్‌లలో భాగంగా భారత్ మొత్తం 13 టెస్టులు ఆడాల్సి ఉండగా, మొదటి టెస్టు న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో ముగిసింది.

09/27/2016 - 01:32

కాన్పూర్, సెప్టెంబర్ 26: న్యూజిలాండ్ స్పిన్నర్ మార్క్ క్రెగ్ భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. వీపు కండరాలు బెణకడంతో అతను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని కివీస్ జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను కంరాల నొప్పితో బాధపడ్డాడు.

Pages