S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 00:05

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 26: నెరవేరని హామీలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం ఎస్‌ఎం పురం గ్రామంలో గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

09/27/2016 - 00:05

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 26: పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఇవోఆర్డీ నిశ్చల ఆదేశించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పెద్దపాడు, వాకలవలస పంచాయతీ గ్రామాల్లో కాలువల్లో ఉన్న పూడికను తొలగిస్తున్నారు. ఈ పనులను సోమవారం ఈవోఆర్డీ నిశ్చల పెద్దపాడు గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

09/27/2016 - 00:04

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 26: హరికాథ కాలక్షేపం పూర్వనుంచి నేటి వరకు విజ్ఞాన దాయకమైన అంశమని డిఎం అండ్ హెచ్‌ఒ ఎస్.తిరుపతిరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో మిత్రా సాంస్కృతిక సమితీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆదిభట్ల నారాయణదాస్ 152వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన హరికథాసప్తాహం రెండో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

09/27/2016 - 00:03

ఏలూరు, సెప్టెంబర్ 26 : జిల్లాలో పదవ తరగతి లోపు విద్యార్ధినీ విద్యార్ధులకు దోమలపై పరీక్షలు నిర్వహించి 50 మార్కులు సైన్స్ సబ్జెక్టులో కలుపుతామని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా విద్యాశాఖ ప్రచురించిన దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

09/27/2016 - 00:02

లింగపాలెం, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సిఎం చంద్రబాబునాయుడు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రం లింగపాలెంలో మంత్రి దోమల నివారణా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

09/27/2016 - 00:02

భీమవరం, సెప్టెంబర్ 26: గత కొద్దిరోజులుగా హోరాహోరీగా జరుగుతున్న విష్ణు ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 సోమవారం రాత్రి ముగిసింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జాతీయస్థాయి పోటీలకు భీమవరం విష్ణు విద్యాసంస్థలు వేదికైంది. ఈనెల 23 నుండి 26 వరకు ఈ పోటీలు జరిగాయి.

09/27/2016 - 00:01

ఏలూరు, సెప్టెంబర్ 26 : కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉద్యోగులు రాజ్యమేలుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పక్కన పెట్టకపోతే సంబంధిత శాఖాధికారులు భారీ కుంభకోణాల్లో ఇరుక్కుపోయే ప్రమాదముందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/27/2016 - 00:01

ఏలూరు, సెప్టెంబర్ 26 : కళలను, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే మనస్తత్వం గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడలో ఏర్పాటుచేయనున్న ఘంటసాల మ్యూజియంకు కోటిన్నర రూపాయలు విడుదలచేశారని ఎపి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి కెవి ఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏలూరు అగ్రహారంలోని వై ఎంహెచ్ ఏ హాలులో కెవి ఎస్ ఎక్స్‌లెన్స్ అవార్డు-2016 బహుకరణ ఉత్సవాన్ని నిర్వహించారు.

09/27/2016 - 00:00

ఆకివీడు, సెప్టెంబర్ 26: ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ బ్యాంకులో బంగారం మాయమైన సంఘటన ఖాతాదారులు మరువక ముందే మరోసారి బ్యాంకులో రుణం కోసం పెట్టిన దస్తావేజులు మాయమయ్యాయి. ఆకివీడుకు చెందిన అల్లూరి సూర్యకుమారి పేరు మీద ఉన్న ఎంపైర్ టవర్స్ ప్లాట్ నెంబర్ 203 దస్తావేజులను 2013 జూన్ 19వ తేదీన బ్యాంకులో తనఖా పెట్టి రూ.10 లక్షల రుణాన్ని తీసుకున్నారు.

09/27/2016 - 00:00

నరసాపురం, సెప్టెంబర్ 26: మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పురష్కరించుకొని జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్టు వైఎన్ కళాశాల గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. మహాత్మాగాంధీ-మత సామరస్యం అనే అంశంపై ఈ నెల 30న కళాశాలలో ఈ పోటీ నిర్వహించనున్నారు. 6వ తరగతి నుండి పిజి, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు.

Pages