S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 23:40

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : జిల్లాల పునర్విభజనలోభాగంగా నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేయాలని డిమాండ్ చేస్తు గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి 6 గంటల పాటు హైడ్రామా సృష్టించారు. నారాయణరావు పేట గ్రామానికి చెందిన బామండ్ల కిషన్ (27) సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ..గ్రామాన్ని మండలం చేయకుంటే అక్కడ నుండి దూకుతానని బెదిరించి 6గంటల పాటు హైడ్రామాకు పాల్పడటం చర్చనీయంశంగా మారింది.

09/26/2016 - 23:40

సంగారెడ్డి, సెప్టెంబర్ 26: నాలుగు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్లాను నిలువునా ముంచాయి. ఎండిన జలాశయాలకు జలకళ వచ్చిందన్న సంతృప్తి మినహా కురిసిన వర్షాలతో అన్ని వర్గాల వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలకు వరదపోటును ఎదుర్కొన్నాయి.

09/26/2016 - 23:39

గజ్వేల్, సెప్టెంబర్ 26: జల వనరుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యపడుతుందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ పాండవుల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఅర్ ప్రత్యేక దృష్టి కారణంగా పాండవుల చెరువు మినీట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు.

09/26/2016 - 23:38

జహీరాబాద్, సెప్టెంబర్ 26: వరదనీటిలో గల్లంతయిన చిన్నారి ముజాహిద్ ఆచూకి సోమవారం లభించింది. పోలీసులు మున్సిపల్ సిబ్బంది సహకారంతో సోమవారం మూడోరోజు చేపట్టిన గాలింపుల్లో సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న చెక్‌డ్యాం వద్ద బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహం లభించింది. జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.

09/26/2016 - 23:38

సదాశివపేట, సెప్టెంబర్ 26: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన పెద్దవాగులో ఆరూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి బోయిని ప్రశాంత్ గల్లంతై సోమవారం నాడు శవమై తేలాడు. ఈ నెల 24వ తేదీన ఆరూర్, మెలిగిరిపేట గ్రామాల మద్య పెద్దవాగుపై నిర్మించిన వంతెనపైకి వెళ్లిన ప్రశాంత్ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన విషయం తెలిసిందే.

09/26/2016 - 23:38

గజ్వేల్, సెప్టెంబర్ 26: రోడ్డు విస్తరన పేరుతో తమను బజారున వేయవద్దని సంగాపూర్ రోడ్డు బాదితులు ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి వద్ద నిరసన తెలిపారు. 33 అడుగుల రోడ్డు వెడల్పుతో విస్తరణ పనులు చేపట్టాలని, అందుకు తమకు గజ్వేల్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా ఉన్నట్లే తెలిపారు. ముఖ్యంగా అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోగా, ప్రస్తుతం విస్తరణ పేరుతో తమను ఇబ్బందుల పాలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.

09/26/2016 - 23:37

మెదక్, సెప్టెంబర్ 26: శాలిపేట గ్రామానికి చెందిన పచ్చటి శామయ్య(50) విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు పొలం వద్దకు కాపలాకు శామయ్య వెల్లాడు. సోమవారం నాడు శామయ్య తిరిగి రాకపోవడంతో కుటుంభ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా శామయ్య విద్యుత్ షాక్‌తో మరణించి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

09/26/2016 - 23:37

జిన్నారం, సెప్టెంబర్ 26: జిన్నారం మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపితే సహించేది లేదని హెచ్చరించారు అఖిల పక్ష నాయకులు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో మండల అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపితో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీపీ రంవీదర్‌రెడ్డి, జడ్పిటిసి ప్రభాకర్, ఎంపీపీ ఉపాద్యక్షుడు నాగెందర్‌గౌడ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

09/26/2016 - 23:35

హత్నూర, సెప్టెంబర్ 26: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగుదేవునిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సార మల్లేశం (28) ఆదివారం రాత్రి బహిర్బుమికని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు చెరువువద్దకు వెళ్లి చూడగా జారిపడ్డ ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు.

09/26/2016 - 23:35

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 26: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాకేంద్రం చిత్తడిగా మారింది. కురుస్తున్న వర్షాలతో నిత్యావసర సరుకులు,కూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. వరుణుడు శాంతిచడంతో ప్రతి సోమవారం కొనసాగే కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.మార్కెట్ పూర్తిగా మురికినీరు, బురదతో నిండిపోవడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది.

Pages