S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 07:08

హైదరాబాద్, జూన్ 16: నిత్యజీవితంలో ప్రతి అంశానికీ అణుఇంధనంతో ముడిపడి ఉంటుందని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, సిఇఓ జి కళ్యాణకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఎంపి చారి 9వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ హైథరాబాద్ రీజనల్ సెంటర్ నిర్వహించింది.

06/17/2016 - 07:01

ముంబయి, జూన్ 16: బుధవారం ఒకరోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాలతో ముగిశాయి.

06/17/2016 - 06:59

హైదరాబాద్, జూన్ 16: స్పెయిన్‌లో ఈనెల 24న జరిగే ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొనాలని ఫిక్కీ నిర్వాహక బృందం కెటిఆర్‌ను కోరింది. ‘సినర్జీస్ ఇన్ ఐటి, స్మార్ట్‌సిటీ, టూరిజం ప్రమోషన్’ అనే అంశంపై ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించారు.

06/17/2016 - 06:58

న్యూఢిల్లీ, జూన్ 16: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న ఐరోపా కూటమినుంచి బ్రిటీష్ నిష్క్రమణ (బ్రెక్సిట్)పై రెఫరెండం, మధ్యప్రాచ్యంలో కల్లోలం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిణామాలపై ప్రభుత్వం కనే్నసి ఉంచిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం చెప్పారు.

06/17/2016 - 06:56

ముంబయి, జూన్ 16: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత దేశ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గింది. మూడో త్రైమాసికంలో ఈ లోటు 710 కోట్ల డాలర్లు ఉండగా నాలుగో త్రైమాసికంలో దాదాపు 30 లక్షల డాలర్ల మేరకు తగ్గిపోయింది. వాణిజ్య లోటు తగ్గడమే కరెంట్ ఖాతా లోటు తగ్గడానికి ప్రధాన కారణం.

06/17/2016 - 06:55

ముంబయి, జూన్ 16: ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్-500 సంస్థల జాబితాలో జస్ట్ డయల్, యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఐఆర్‌సిటిసిలకు చోటు లభించింది. ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల్లో చాలా సంస్థలు మధ్యస్థాయి పరిమాణం కలిగినవే. వీటిని ‘స్మాల్ వండర్స్’గా ఫార్చ్యూన్ పత్రిక అభివర్ణించింది.

06/17/2016 - 06:54

న్యూఢిల్లీ, జూన్ 16: భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ భారతీ మిట్టల్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వాణిజ్య మండలి (ఐసిసి)కి అధిపతిగా ఎన్నికయ్యారు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఐసిసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. దీనికి అధిపతిగా ఎన్నికైన భారత వ్యాపారవేత్తల్లో సునీల్ మిట్టల్ మూడోవారు.

06/17/2016 - 06:52

పులివెందుల, జూన్ 16: కడప జిల్లా పులివెందులలోని ఎపికార్ల్‌లో జినోమిక్స్ కంపెనీ మూడు రకాల వ్యాక్సిన్లు తయారు చేసిందని జినోమిక్స్ ఎండి రత్నగిరి పేర్కొన్నారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎపికార్ల్‌లో ఆవు గర్భాశయంలో వచ్చే వ్యాధి, పాల పొదుపునకు సంబంధించి వ్యాధి, టిబికి వ్యాక్సిన్లను మొట్టమొదటిసారి తయారు చేశామన్నారు.

06/17/2016 - 06:50

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (టిఏ.్ఫ్యప్సీ) అధ్యక్షునిగా రవీంద్రమోదీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగా గౌర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు రవీంద్రమోదీ మెసర్స్ హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండిగా పనిచేస్తున్నారు. బిఎస్‌సి ఆనర్స్, బిఎస్‌సి టెక్నాలజీ, ముంబాయిలోని యూనివర్శిటీ నుంచి టెక్నాలజీలో ఎంఎస్‌సి డిగ్రీలను పొందారు.

06/17/2016 - 06:48

న్యూఢిల్లీ, జొన్ 16: బంగారం ధరలు గురువారం 30 వేల రూపాయల మార్క్‌ను దాటి పోయాయి. ఒక్కరోజే రూ.580 పెరగడంతో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాములు రూ. 30,250 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయంగా కూడా డిమాండ్ పెరగడమే బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Pages