S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:38

మార్కాపురం, మే 17: మార్కాపురం సర్కిల్ పరిధిలో మట్కారాయుళ్లపై పోలీసులు పంజా విసిరారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మట్కా ఆడుతున్న 8మందిని అరెస్టు చేసి వారి నుంచి 4700 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సిఐ బత్తుల శ్రీనివాసరావు వెల్లడించారు.

05/18/2016 - 02:36

నెల్లూరు, మే 17: వేసవితాపంతో విలవిల్లాడుతున్న జిల్లా ప్రజలను సేదతీర్చేందుకు అనుకోని అతిథిలా వచ్చింది వర్షం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. ముఖ్యంగా గూడూరు డివిజన్ పరిధిలో భారీ వర్షపాతమే నమోదైంది. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ జలమయమయ్యాయి.

05/18/2016 - 02:35

సూళ్లూరుపేట, మే 17: నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన జనానికి చల్లని వానతో ఉపశమనం కలిగినట్లయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సోమవారం అర్ధరాత్రి నుండి సూళ్లూరుపేటలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురవడంతో పట్టణమంతా తడిసి ముద్దయింది. రెండు నెలల నుండి మండుటెండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరైన జనానికి ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

05/18/2016 - 02:35

సూళ్లూరుపేట, మే 17: ఇటీవలి వరకు నీరు లేక ఎడారిని తలపించిన పులికాట్ సరస్సు నేడు జలకళ సంతరించుకుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వానతో సరస్సుకు వర్షపు నీరు చేరింది. చాలాకాలం తరువాత వేసవిలో వర్షం కురవడంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

05/18/2016 - 02:34

నెల్లూరు, మే 17: జిల్లాలోని మీ-సేవా కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఆ కేంద్రాల నిర్వహణ మరింత సమర్ధవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారుల్ని రాష్ట్ర భూసేకరణ, పరిపాలన కమిషనర్ అనీల్ చంద్ర ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

05/18/2016 - 02:34

రాపూరు, మే 17: మండల పరిధిలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆచారం ప్రకారం గోనుపల్లి గ్రామంలోని పెంచలస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవేరులతో సహా లక్ష్మీనరసింహస్వామి విశేష అలంకరణతో మంగళవాయిద్యాలు, నాట్యబృందాలు, భజన వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా పెంచలకోనకు బయలుదేరారు.

05/18/2016 - 02:34

నాయుడుపేట, మే 17: పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో గోమతీ సెంటర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు పెళ్లకూరు మండలం పెనే్నపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు (38), మనోజ్ (25) పట్టణంలోని వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

05/18/2016 - 02:33

నెల్లూరు, మే 17: తమిళనాడులో మాతృభాష మనుగడ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని భవాని రెసిడెన్సీ హోటల్‌లో మంగళవారం 25 కళాసంఘాల ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది.

05/18/2016 - 02:32

వెంకటాచలం, మే 17: అక్రమంగా నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇసుక అక్రమ నిల్వలపై స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు దాడి చేసిన సీజ్ చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కాకుటూరు సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పరిశ్రమల కేంద్రం వద్ద ఇసుకను అక్రమ రవాణా చేయడానికి సుమారు 200 యూనిట్లకు పైగా నిల్వ ఉంచారు.

05/18/2016 - 02:32

బాలాయపల్లి, మే 17: మండలంలోని ఉపాధి హామీ పథకంలో గుర్తించిన అక్రమాలను వెల్లడించకుండా తొక్కిపెట్టేందుకు విచారణ అధికారి ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపిడి ఆదిరెడ్డి యత్నించారు. ఎపిడి ఆదిరెడ్డి విచారణ వైఖరిని ఆడిట్ అధికారులు తప్పుబడుతూ నిలదీశారు. దీంతో ఆదిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ రాష్ట్ర రిసోర్స్‌పర్సన్ వెంకటేశ్వర్లుపై కాగితాలను విసిరికొట్టారు.

Pages