S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 16:44

ముంబయి: ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో బాలీవుడ్ అగ్రనటుడు దిలీప్‌కుమార్ (93) క్రమంగా కోలుకుంటున్నారు. ఈ విషయమై దిలీప్ భార్య, అలనాటి నటి సైరాబాను శనివారం ఒక ప్రకటన చేశారు. జ్వరం, ఛాతీనొప్పి రావడంతో ఆయనను శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించామని ఆమె పేర్కొన్నారు. కాగా, మరో 72 గంటల వరకూ దిలీప్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంటుందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

04/16/2016 - 16:43

హైదరాబాద్: పగటి ఉష్ణోగ్రతలు అధికం కావడంతో వడదెబ్బకు లోనై ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం 11 మంది మరణించారు. అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురేసి, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు రోజుల పాటు వేడిసెగలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

04/16/2016 - 16:43

ఒంగోలు: పంటకాల్వలను ఆక్రమించుకున్నవారు నెలరోజుల్లోగా వైదొలగని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎపి సిఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శనివారం ‘నీరు-చెట్టు’ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి తీరువా వసూళ్లను సాగునీటి సంఘాలకే ఇస్తామని, కాల్వల ఆధునీకరణకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

04/16/2016 - 16:42

ఒంగోలు: పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తాను గతంలోనే చెప్పానని, ఇదే విషయమై తెలంగాణ సిఎం కెసిఆర్ తాజాగా చేసిన సూచనను తాను స్వాగతిస్తున్నానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. సాగునీటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. నీటి పంపకంతో పాటు అనేక విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పొరుగు రాష్ట్రాలు అనుసరించాల్సి ఉందన్నారు.

04/16/2016 - 16:41

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులకు బదులు పోలీసులు తనిఖీలకు రావడం పట్ల తెలంగాణ విద్యాసంస్థల జెఎసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు సిఎం కెసిఆర్‌ను, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని తప్పుదోవ పట్టిస్తున్నారని జెఎసి నేతలు అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐబి, సిఐడి, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ పోలీసులు ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

04/16/2016 - 16:40

బెంగళూరు: భూకబ్జాలు, పలు అవినీతి వ్యవహారాల్లో జైలుకి వెళ్లి వచ్చిన కర్నాటక బిజెపి అధ్యక్షడు, మాజీ సిఎం యడ్యూరప్పకు కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటూ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఇక్కడ ధర్నా జరిపారు.

04/16/2016 - 16:39

దిల్లీ: ట్రాఫిక్, కాలుష్యం సమస్యలపై ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా శనివారం తన కార్యాలయానికి సైకిల్ తొక్కుతూ వచ్చారు. దేశ రాజధానిలో ట్రాఫిక్, వాయు, శబ్దకాలుష్యాలు నానాటికీ మితిమీరుతున్నాయన్నారు. కార్లు, ఆటోల యజమానులు ప్రభుత్వానికి సహకరించి దిల్లీలో ‘సరి, బేసి’ సంఖ్య విధానంలో వాహనాలు నడిపేందుకు ముందుకు రావాలన్నారు.

04/16/2016 - 16:38

రాజమండ్రి: మల్కిపురం మండలం రామరాజులంకలో శనివారం ఉదయం గోదావరి నదిలోకి దూకి గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపం చెందడం వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

04/16/2016 - 14:35

హైదరాబాద్: ఆధ్యాత్మిక పండితుడిగా, కవిగా, వ్యాఖ్యాతగా తెలుగువారికి చిరపరిచితమైన శేషం రామానుజాచార్యులు శనివారం ఉదయం నగరంలోని వనస్థలిపురంలో కన్నుమూశారు. తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.

04/16/2016 - 14:34

వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి తాడ్వాయిలోని ఫారెస్టు గెస్ట్‌హౌస్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. జీపుతో పాటు ఓ నిర్మాణాన్ని వారు దగ్ధం చేశారు. హరితహారం పేరిట గిరిజనుల భూములను లాక్కుంటే తెలంగాణ సర్కారుకు తాము బుద్ధి చెబుతామని సంఘటన స్థలంలో వదిలిన లేఖలో మావోలు హెచ్చరించారు.

Pages